Breaking News

Daily Archives: April 28, 2016

ఎండ దెబ్బ నుంచి పిల్లలను కాపాడుకోండిలా..!

వేసవి తీవ్రతకు పెద్దలే తట్టుకోలేక పోతుంటే పసిపిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో వూహించుకోవచ్చు..చుట్టుపక్కల పిల్లలతో కాస్సేపు బయట ఆడుకొని వచ్చేసరికి వడదెబ్బతగిలి వాలిపోయే ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తుంది. శరీరంలో ఉత్పన్నమయ్యే వేడి చర్మరంధ్రాల ద్వారా చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. వేసవిలో ఈ ప్రక్రియ కొంత మందగించడం వల్ల త్వరగానే ఎండదెబ్బకు గురవుతుంటారని పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్‌ అన్‌జుల్‌ దయాల్‌ తెలిపారు. ఇలాంటపుడు ఎలా స్పందించాలన్నదానిపై ఆయన సూచనలివీ. * పిల్లలు సుదీర్ఘ సమయం ఎండలో ఆడుతుంటారు. ...

Read More »

రేషన్‌ దుకాణాల్లోనూ.. బయోమెట్రిక్‌ విధానం

నిజామాబాద్‌ సిటీ,: ప్రజా పంపిణీ వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. లబ్ధిదారుల వేలి ముద్రల సేకరణ ఆధారంగా సరకులు పంపిణీ చేయాలనే యోచనలో ఉంది. అవినీతికి చెక్‌ పెట్టడమే కాకుండా రాబోయే రోజుల్లో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా ఉంచేందుకు చూస్తోంది. రాష్ట్రంలోని హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో రేషన్‌ దుకాణాల్లో బయోమెట్రిక్‌ యంత్రాలను ఏర్పాటు చేశారు. వచ్చే రెండు నెలల్లో జిల్లాలోని రేషన్‌ దుకాణాలకు బయోమెట్రిక్‌ యంత్రాలు రానున్నాయి. లబ్ధిదారుల వేలి ముద్రలతోనే ఇక నుంచి సరకులు ...

Read More »

కుద్వాన్‌పూర్‌లో అగ్ని ప్రమాదం

నందిపేట్‌: మండలంలోని కుద్వాన్‌పూర్‌లో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి ప్రమాదవశాత్తు గ్రామంలోని గడ్డువాములకు నిప్పంటుకుంది. ఇదే సమయంలో బలమైన ఈదురు గాలులు రావడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో గ్రామ పెద్దలు అగ్ని ప్రమాదం జరిగిందని మైకులో చాటింపు వేయటంతో గ్రామస్థులు ప్రమాద స్థలానికి వెళ్లి మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో గడ్డివాములు, పశువుల పాకలు దగ్ధమయ్యాయి.

Read More »

బాల్య వివాహం అడ్డగింత

మాక్లూర్‌ గ్రామీణం: మాక్లూర్‌ మండలం బోర్గాం గ్రామంలో పదో తరగతి పూర్తయిన అమ్మాయికి బాల్య వివాహం చేస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లి పెళ్లిని అడ్డుకున్నారు. ఎస్సై వెంకట్రాములు కథనం ప్రకారం… ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన 16 ఏళ్ల ఉన్న బాలికకు వివాహం చేస్తున్నారనే సమాచారం అందడంతో బోర్గాం గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టి వాస్తవాలు తెలుసుకొని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. చిన్న వయస్సులో పెళ్లి చేయడం నేరమని, 18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలని సూచించారు. శుక్రవారం ...

Read More »

యువకుడి ఆత్మహత్య

అడ్లూర్‌ఎల్లారెడ్డి (సదాశివనగర్‌) :పెళ్లి సంబంధం కుదరడం లేదని జీవితంపై విరక్తి చెంది బుధవారం ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అడ్లూర్‌ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన పోతరాజు (23) అనే యువకుడికి రెండేళ్లుగా పలు పెళ్లిసంబంధాలు చూసినా కుదరకపోవడంతో మానసిక వేదనకు గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. తల్లి అమృత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు

Read More »

భూ తగాదాలతో హత్య

గాంధారి: భూతగదాలతో మహిళ హత్యకు గురైనట్లు ఎస్‌.ఐ రవికుమార్‌ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన ఉత్తునూర్‌ విఠబాయి (55)ను దత్తత తీసుకున్న కుమారుడు శ్రీనివాస్‌ భూమికి సంబంధించిన తగదాలతో ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భూమికి సంబంధించిన గొడవ జరుగుతోందని, ఈ క్రమంలోనే బుధవారం ఉదయం కూడా ఇద్దరి మధ్య గొడవ జరగడంతో శ్రీనివాస్‌ ఆమెను గొంతునులిమి హత్య చేసినట్లు తెలిపారు. మృతురాలి తమ్ముడి భార్య అనసూయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌.ఐ ...

Read More »