కామారెడ్డి, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిపిఎం ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు సిపిఎం డివిజన్ కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ, ప్రభుత్వ విధానంపై సమావేశంలో చర్చిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా ప్రమాణాలు పాటించకుండా పేద, మధ్య తరగతి ప్రజల పిల్లల జీవితాలతో ఆటలాడుతుందన్నారు. ప్రభుత్వం విద్యా వ్యాపారంచేస్తుందని, దానికి పరోక్షంగా సహకరిస్తుందని ఆరోపించారు. సమావేశానికి విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, సామాజిక ఉద్యమ ...
Read More »Monthly Archives: May 2016
వీధి దీపాలు ఏర్పాటు చేయాలి
కామారెడ్డి, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో పలు వీధుల్లో వీధి దీపాలు వెలగకపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, వెంటనే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని తెరాస పట్టణ అద్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, 27వ వార్డు కౌన్సిలర్ లక్ష్మినారాయణ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని చైన్ స్నాచింగ్‌లు, దొంగల బెడద అధికంగా ఉందని, అయినప్పటికి బల్దియా సిబ్బంది వీధి దీపాల ఏర్పాటులో విఫలమవుతుందన్నారు. ఆర్డీవో కార్యాలయం ట్యాంక్ వద్దగల మునిసిపల్ నీటిసరఫార విభాగం కార్యాలయంలో ఆరులక్షల విలువచేసే ఎలక్ట్రిసిటీ ...
Read More »ఉచిత వైద్య శిబిరం
కామారెడ్డి, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో మంగళవారం వాసవీక్లబ్, వాసవి వనిత క్లబ్, లయన్స్ క్లబ్, వివేకానంద కామారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ సహకారంతో వైద్య శిబిరం నిర్వహించారు. పొగాకు వాడడం వల్ల కలిగే దుష్ప్రయోజనాలు ప్రజలకు వివరించారు. పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ అజయ్‌కుమార్, ఆయా క్లబ్‌ల ప్రతినిదులు మహేశ్‌గుప్త, శంకర్‌రెడ్డి, ప్రవీణ్, ...
Read More »అనుమతులు ఒకచోట… ఇసుక తవ్వకాలు మరోచోట…
బీర్కూర్, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్, బాన్సువాడ మండలాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనులైన సిసి డ్రైనేజ్, సిసి రోడ్లకు బీర్కూర్ మంజీర పరివాహక ప్రాంతం నుంచి గత సంవత్సర కాలం నుంచి ట్రాక్టర్ల ద్వారా ఆర్డీవో అనుమతితో స్థానిక తహసీల్దార్ మార్గదర్శకాలతో నడుస్తున్న ఇసుక రవాణా గత రెండు వారాల నుంచి అనుమతులు ఒకచోట ఉంటే తవ్వకాలు మరోచోట చేపడుతున్నారు. బీర్కూర్ తదితర మండలాల్లో అభివృద్ది పనులకు ఇసుక అనుమతి కొరకు ...
Read More »రాష్ట్ర అవతరణ వేడుకలకు ముస్తాబైన ఎంపిడివో కార్యాలయం
నిజాంసాగర్ రూరల్, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు అన్ని ప్రభుత్వ శాఖలు అంగరంగ వైభవంగా జరుపుకోవాలని సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు స్థానిక తహసీల్, ఎంపిడివో కార్యాలయాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు రెవెన్యూ సిబ్బంది తలమునకలయ్యారు. ఈ సందర్భంగా కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.
Read More »డ్వాక్రా సంఘాలపై అవగాహన కలిగి ఉండాలి
నిజాంసాగర్ రూరల్, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుక్ కీపర్లు డ్వాక్రా సంఘాలపై అవగాహన కలిగి ఉండాలని ఐకెపి ఏరియా కోఆర్డినేటర్ మారుతి సూచించారు. మండల కేంద్రంలోని కమిటీ భవనంలో బుక్ కీపర్లకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని 32 గ్రామ సంఘాలు ఉన్నాయని, వందమంది బుక్‌కీపర్లు, సిఎలుఉన్నారన్నారు. సంఘాలకు సంబంధించిన పూర్తి సమాచారం బుక్కులో పొందుపరచాలని సూచించారు. సిఎలు 31వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో పర్యవేక్షణ జరిపి బుక్కీపర్ల పనితీరు మెరుగుపరచాలని ఆయన సూచించారు. ...
Read More »హోరాహోరీగా కుస్తీ పోటీలు
నిజాంసాగర్ రూరల్, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని మాగి గ్రామంలో నల్లపోచమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని కుస్తీపోటీలు ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పోటీలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. వివిధ ప్రాంతాల నుంచి మల్లయోధులు పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు నల్లవాగు మత్తడి ఛైర్మన్ దుర్గారెడ్డి, ఉపసర్పంచ్ చింతకింది రాములు, కిష్టయ్య నగదు బహుమతులను అందజేశారు.
Read More »జూన్ 14 ఇంటిగ్రేటెడ్ ఎంబిఏ కోర్సు ప్రవేశ పరీక్ష
డిచ్పల్లి, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీలోని ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబిఏ కోర్సుకు ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెవివి బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం డీన్ ఆచార్య సత్యనారాయణచారి తెలిపారు. కాగా పరీక్ష జూన్ 14వ తేదీ ఉదయం 12.30 గంటల నుంచి 2 వరకు జరగనున్నట్టు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు జూన్ 1 నుంచి హాల్‌టికెట్లు ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రొఫెసర్ చారి పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ...
Read More »ముమ్మరంగా కల్కి చెరువు పనులు
బాన్సువాడ, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడలో మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ది చేస్తున్న కల్కి చెరువు పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. పట్టణానికి ఆనుకొని ఉండడంతో ఆహ్లాదకర వాతావరనం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం దీని అభివృద్దికి నిధులు మంజూరు చేసింది. రూ. ఆరున్నర కోట్లతో చెరువు నీటి నిలువ సామర్థ్యం పెంచడంతోపాటు కట్టను వెడల్పు చేసి పర్యాటక కేంద్రంగా చేసేందుకు పనులు చేస్తున్నారు. కట్టను బలోపేతం చేయడంతోపాటు దీని వెంట ఉద్యానవనాలు పెంచేందుకు ప్రణాళిక చేశారు. ఈ క్రమంలో భాగంగా ...
Read More »జూన్ 10 వరకు డిగ్రీ అడ్వాన్సు సప్లమెంటరీ పరీక్షల దరఖాస్తులు
డిచ్పల్లి, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల తెలంగాణ యూనివర్సిటీ డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా డిగ్రీ అడ్వాన్సు సప్లమెంటరీ పరీక్షల రుసుము జూన్ 10వ తేదీ వరకు చెల్లించవచ్చని ఇన్చార్జి పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ బాలకిషన్ తెలిపారు. అలాగే రీవాల్యుయేషన్, రీ కౌంటింగ్ కొరకు జూన్ 8వ తేదీ వరకు దరకాస్తు చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.
Read More »ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు
బీర్కూర్, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల కేంద్రంలోని ఇందిరా క్రాంతి పథం కార్యాలయ ఆవరణలో డ్వాక్రా గ్రూపు మహిళలు, ఐకెపి అధికారుల ఆద్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా చేపట్టారు. ఎంపిపి మల్లెల మీణ హన్మంతు ఆధ్వర్యంలో బతుకమ్మలను ఏర్పాటు చేసి తెలంగాణ ఆటపాటలాడారు. అనంతరం డ్వాక్రా మహిళలకు కుర్చీలాట, చంచా గోళీ ఆట, పాటల పోటీలు నిర్వహించారు. మండల అభివృద్ది అధికారి భరత్‌కుమార్ మాట్లాడుతూ మండలంలోని ఆయా గ్రామాల్లో ఊరూరా వాడా వాడా తెలంగాణరాష్ట్ర అవతరణ ...
Read More »కాంగ్రెస్ నాయకులూ మీ జాతీయ నాయకులను కాపాడుకోండి..
– మార్కెట్ కమిటీ ఛైర్మన్ పెరిక శ్రీనివాస్ బీర్కూర్, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ నాయకులు స్కాంలో నిందితులైన తమ జాతీయ నాయకులను కాపాడుకోవాలని బీర్కూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పెరిక శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీలో ఆయన మంగళవారం మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. కాంగ్రెస్ నాయకులు తెరాస పార్టీని విమర్శించే నైతిక హక్కులేదని, ఆ నైతిక హక్కుని ప్రజలు విశ్వసించరని ఆయన అన్నారు. స్కాముల్లో చిక్కుకున్న జాతీయ నాయకులను కాపాడుకునేందుకు పలు మార్గాలు ...
Read More »అంటరానితనం అమానుషం
బీర్కూర్, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రస్తుత నవీన సమాజంలో అంటరానితనం అమానుషమని బీర్కూర్ ఎస్ఐ రాజ్‌భరత్‌రెడ్డి అన్నారు. మండలంలోని బొమ్మన్‌దేవుపల్లి గ్రామంలో మంగళవారం పౌరహక్కుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు స్వేచ్చగా బతికే వీలుందని ఇతరుల హక్కులకు భంగం కలిగించకుండా రాజ్యాంగంలో పొందుపరిచిన స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం తదితరహక్కులు ప్రతి ఒక్కరు పొందవచ్చన్నారు. సమాజంలో కుల ప్రాతిపదికన ఎవరైనా దూషిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. ప్రతి నెల ...
Read More »ఝాన్సీని చంపేశారా?
-అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య -భర్త వ్యభిచారం చేయాలన్నారని పోలీసులకు లేఖ-ఆలస్యంగా అందిన లేఖ.. నల్లగొండ జిల్లాలో కలకలం నకిరేకల్: వ్యభిచారం చేయాలని కట్టుకున్న భర్త వేధింపులు, కన్నతల్లి అతడికే వత్తాసు పలుకడంతో ఓ వివాహిత ఆత్మహత్య కు పాల్పడిన ఘటన నల్లగొండ జిల్లాలో కలకలం సృష్టిస్తున్నది. ఈ ఘటన నకిరేకల్‌లో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నకిరేకల్ సీఐ వెంకటేశ్వర్రావు వివరాలు తెలిపారు. నకిరేకల్ మండలం నోములకు చెందిన గుర్రం పద్మ, వెంకట్‌రెడ్డి దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. భర్త చనిపోవడంతో నకిరేకల్‌లో ...
Read More »బ్రెడ్‌తో పొంచి ఉన్న క్యాన్సర్ ముప్పు..?
శాండ్విచ్లు, వడాపావ్, బన్, వైట్ బ్రెడ్, పిజ్జాలు, బర్గర్లు ఎక్కువగా తింటున్నారా? అయితే జాగ్రత్త! ఎందుకంటే వాటిలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) తాజాగా చేసిన పరిశోధనల్లో వెల్లడైంది. ఆయా ఆహార పదార్థాలను తయారు చేసేందుకు వాడే బ్రెడ్లలో క్యాన్సర్ కారకాలైన పొటాషియం బ్రోమేట్, పొటాషియం ఐయోడేట్లు అధిక మోతాదులో ఉంటున్నాయని సీఎస్ఈ తెలియజేసింది. సీఎస్ఈలోని పొల్యూషన్ మానిటరింగ్ ల్యాబొరేటరీ శాఖ వారు ఢిల్లీలో ఉన్న కేఎఫ్‌సీ, పిజ్జా హట్, డామినోస్, సబ్వే, మెక్‌డొనాల్డ్స్ వంటి పలు ...
Read More »ప్రాణదానం చేసింది!
ఆమె టార్గెట్ చార్టెడ్ అకౌంటెంట్. లక్ష్యసాధనలో భాగంగాపదవ తరగతి పరీక్షలు రాసింది.. 8.6 పాయింట్లతో పాసయింది. కానీ తన రిజల్ట్ తనే చూసుకోలేకపోయింది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే కేజల్ పాండే నవ్వులు ఇప్పుడు లేవు. కానీ ఆమె గుర్తులు మాత్రం ఉన్నాయి. సరదాగా బైక్ మీద తల్లిని ఎక్కించుకుని రైడ్ చేస్తుంటే వెనకనుంచి ఓవర్‌టెక్ చేస్తున్న కారు కేజల్ బైక్‌ని తాకింది. ఆ వేగంలో కేజల్‌కి, ఆమె తల్లికి గాయాలయ్యాయి. అక్కడున్నవారు వెంటనే దవాఖానకు తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. కేజల్ బ్రెయిన్ ...
Read More »అన్ని గ్రామ పంచాయతీలకు వై ఫై సౌకర్యం!
ఢిల్లీ: దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలకు అక్టోబర్ 2018 వరకు వై ఫై సౌకర్యం కల్పించనున్నట్లు టెలికామ్ సెక్యూరిటీ జే.ఎస్. దీపక్ వెల్లడించారు. సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతీ ఏడాది నిర్వహించే జనరల్‌బాడీ మీటింగ్ నిన్న ఢిల్లీలో జరిగింది. సమావేశంలో డేటా కనెక్టివిటి ఫర్ ది నెక్ట్స్ బిలియన్పై ప్రభుత్వ అధికారులు, టెలికాం ఆపరేటర్స్ చర్చించారు. ఈ సందర్భంగా భారత్ నెట్ ఇనిషియేటివ్ ప్రొగ్రాంలో భాగంగా దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలు 2018 వరకు వై ఫై సౌకర్యాన్ని కలిగి ఉండేలా ...
Read More »తండ్రి శవాన్ని ముక్కలు చేసిన తనయుడు
కేరళ : ఆస్తి తగాదాలతో తనయుడు తండ్రిని నరికి చంపాడు. ఈ దారుణ ఘటన గత వారం కేరళలోని చెంగనూరులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శేరిన్ జాన్(36) అనే ఐటీ ఉద్యోగి గత కొంతకాలం నుంచి అమెరికాలో నివాసముంటున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం చెంగనూరుకు వచ్చాడు. ఈ సందర్భంగా శేరిన్కు తన తండ్రి జాన్(68)కు ఆస్తి వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే తండ్రిని బయటకు తీసుకెళ్లి కిరాతకంగా నరికిచంపారు. అంతే కాదు శరీర భాగాలను ముక్కలుముక్కలుగా చేసి అక్కడక్కడ ...
Read More »నేడు ఐసెట్ ఫలితాల వెల్లడి
హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 19న నిర్వహించిన ఐసెట్-2016 పరీక్షా ఫలితాలను మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ టి. పాపిరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ చిరంజీవులు విడుదల చేయనున్నారు.
Read More »రూ.4వేలకే రిలయన్స్ లైఫ్ 4జీ స్మార్ట్‌ఫోన్…
రిలయన్స్ సంస్థ ‘లైఫ్ ఫ్లేమ్ 4’ పేరిట ఓ నూతన బడ్జెట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.4వేలకు ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు లభ్యమవుతోంది. రిలయన్స్ లైఫ్ ఫ్లేమ్ 4 ఫీచర్లు… 4 ఇంచ్ డిస్ప్లే, డ్రాగన్టెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్ 800 X 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.5 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, మాలి 400 ఎంపీ2 గ్రాఫిక్స్ 512 ఎంబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, డ్యుయల్ సిమ్ ...
Read More »