Breaking News

బోధన్‌లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు

 

బోధన్‌, జూన్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ పట్టణంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 7.30 గంటలకు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బోధన్‌ ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్‌, తహసీల్దార్‌ సుదర్శన్‌, ఎంపిపి గంగాశంకర్‌, ఎంఇవో శంకర్‌, తెరాస నాయకులు, కుల సంఘాల నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం వద్ద, తహసీల్‌ కార్యాలయం, మునిసిపల్‌ కార్యాలయం, ఎంపిపి కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయజెండాలు ఆవిష్కరించారు. అనంతరం అంబేడ్కర్‌ చౌరస్తాలోఅన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా మండలంలోని ఆయా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు జాతీయ జెండా ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు. వేడుకల్లో మునిసిపల్‌ ఛైర్మన్‌ ఎల్లయ్య, వైస్‌ఛైర్మన్‌ హబీద్‌, తెరాస నాయకులు అబీద్‌ అలీ సోఫీ, సంజీవ్‌కుమార్‌, షకీల్‌, వివిధ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆ రెండు క‌ల్లు దుకాణాల‌తో కష్టాలు

నిజామాబాద్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగర ప్రజల‌కు అసౌకర్యం కలిగిస్తున్న క‌ల్లు దుకాణం ఇక్కడి ...

Comment on the article