Breaking News

జై తెలంగాణ నినాదాలతో మారుమోగిన మోర్తాడ్‌

 

మోర్తాడ్‌, జూన్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా గురువారం మండలంలో జై తెలంగాణ నినాదాలతో మారుమోగాయి. మోర్తాడ్‌ తహసీల్‌, ఎంపిపి, వ్యవసాయశాఖ, స్త్రీనిధి, ఇజిఎస్‌ తదితర కార్యాలయాల ముందు మోర్తాడ్‌ జడ్పిటిసి ఎనుగందుల అనిత, ఎంపిపి కల్లడ చిన్నయ్య, తహసీల్దార్‌ వెంకట్రావు, ఎంపిడివో శ్రీనివాస్‌, ప్రోగ్రాం అధికారి నర్సయ్య, ఏవో లావణ్య, ఎపిఎం ప్రమీల, విద్యాశాఖ లో ఎంఇవో రాజేశ్వర్‌ జాతీయ జెండాలు ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు. మోర్తాడ్‌ పోలీసు స్టేషన్‌, ఎక్సైజ్‌ కార్యాలయాల్లో ఎస్‌ఐ అశోక్‌రెడ్డి, సిఐ సహదేవ్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యాలయాల వద్ద ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు జాతీయ జెండాలు ఆవిష్కరించారు. మోర్తాడ్‌లోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో ఆయా పాఠశాలల ప్రధానోపాద్యాయులు, కరస్పాండెంట్లు జాతీయ జెండాలు ఆవిష్కరించారు. తెరాస పార్టీ కార్యాలయం ముందు మండల పార్టీ అధ్యక్షుడు కల్లడ ఎలియా జాతీయ జెండా ఆవిష్కరించి, ఎంపిపి, జడ్పిటిసి, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, నాయకులు జాతీయ రహదారిపై తెలంగాణ నృత్యాలు చేస్తూ సంబరాలు ఘనంగా నిర్వహించారు. అన్ని గ్రామాల్లోని ఉపాధి హామీ కూలీలకు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇంటింటికి మిఠాయిలు పంచిపెట్టారు. మోర్తాడ్‌లో నాయకులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మోర్తాడ్‌లోని అంబేడ్కర్‌, జ్యోతిరావుఫూలే, జగ్జీవన్‌రామ్‌, మహాత్మాగాంధీ, తెలంగాణ తల్లివిగ్రహాలకు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. దొన్కల్‌ గ్రామంలో అమరవీరులకు నివాళులు అర్పించారు. మండలంలో తెలంగాణ అవతరణ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

Check Also

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

రెంజల్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రానికి చెందిన నరేష్‌ అనారోగ్యానికి గురి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *