Breaking News

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 

కామారెడ్డి, జూన్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర 2వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కామారెడ్డి పట్టణంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో, పట్టణ పోలీసు స్టేషన్‌, రూరల్‌ పోలీసు స్టేషన్‌, తహసీల్‌ కార్యాలయం, బల్దియా కార్యాలయంతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, ఆయా పార్టీల కార్యాలయాల ముందు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అమరవీరుల ఆత్మబలిదానాలతోపాటు యావత్‌ తెలంగాణ ప్రజల పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని ఆయా పార్టీల ప్రతినిదులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అటవీశాఖాధికారులు పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. నిజాంసాగర్‌ చౌరస్తాలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌, తెలంగాణ తల్లి, కానిస్టేబుల్‌ కిష్టయ్య విగ్రహాలకు పూలమాలలవేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో దుప్పట్ల పంపిణీ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇందూర్‌ ఆద్వర్యంలో శుక్రవారం రాత్రి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *