Breaking News

సమంత ‘పెళ్లికొడుకు’ ఇతడేనా?

‘ఐ యామ్ ఇన్ లవ్.. చాలా సంవత్సరాల నుంచి తను పరిచయం.. నాకు ఎగ్జాక్ట్ ఆపోజిట్ తను, తనది కూడా నాలా హెల్పింగ్ నేచర్, వంట సూపర్బ్‌గా చేస్తాడు. నాన్‌వెజ్ కూడా. రిస్క్ లేదు.. పెద్దలొప్పేసుకున్నారు’ అంటూ స్టన్నింగ్ బ్యూటీ సమంత ఇటీవల తన ప్రేమ విషయం బయటపెట్టేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి మన ‘జెస్సీ’ మనసు దోచుకున్న ఆ ‘కార్తీక్’ ఎవరా అని అంతటా ఆసక్తి. ఎలాగైనా తెలుసుకోవాలని మీడియా వంద ప్రశ్నలు సంధించినా.. ఎవరో అడగొద్దు, జస్ట్ కొన్ని నెలల్లో చెప్పేస్తానంటూ సమంత రిక్వెస్ట్.

అతడా.. ఇతడా.. అంటూ అభిమానులు ఊహలకు పని చెప్పిన ఈ సమయంలో ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్యతో కలిసి సమంత గురువారం విడుదలైన తన ‘అ..ఆ’ చిత్రాన్ని చూస్తూ ఉన్న ఫొటో బయటకు రావడంతో.. సమంత పెళ్లికొడుకు చైతన్యేనంటూ రూమర్లు ఊపందుకున్నాయి. చై మాత్రం ఇప్పటివరకు ఎప్పుడూ ఎక్కడా పెళ్లి ప్రస్తావన తీసుకు రాకుండా మౌనంగా ఉన్నాడు. మరోవైపు సామ్, చై జంట చూడముచ్చటగా ఉంటుందంటూ కాంప్లిమెంట్లు కూడా ఇచ్చేస్తున్నారు నెటిజన్లు. చూడాలి చిక్కుముడి ఎప్పుడు వీడుతుందో.. సమంత రాకుమారుడెవరో..?

Check Also

ఆర్‌ఎంపి, పిఎంపిలు వైద్యం చేయరాదు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చంద్రశేఖర్‌ బుధవారం ...

Comment on the article