Breaking News

62 అడుగుల జుట్టు!

ప్రత్యేకం: జుట్టు మనిషికి అందాన్నిస్తుంది. మహిళలు కేశాలపై అమితమైన ప్రేమను చూపుతుంటారు. రకరకాలుగా అందమైన జడలు అల్లి ఆకట్టుకుంటారు. అంతేకాదు కేశాలతోనే ప్రపంచ రికార్డులు కొట్టేస్తున్నవారు కూడా పెరిగిపోతున్నారు. ఇది వరకు చైనాకు చెందిన ఓ మహిళ 18అడుగుల పొడవైన జుట్టుతో గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లో చేరింది. మగవాళ్లు తక్కువేం కాదన్నట్టు వియత్నాంకు చెందిన ఓ వ్యక్తి 22 అడుగుల పొడవు జుట్టు పెంచి రికార్డు సాధించారు. ఇప్పుడు ఆ రికార్డులను బ్రేక్‌ చేస్తూ వాళ్లకంటే మూడింతల పొడవు జుట్టుతో గిన్నిస్‌ రికార్డుల్లో ఎక్కనున్నాడు.. సావ్‌జీభాయ్‌ రత్వ.

గుజరాత్‌కి చెందిన సవ్‌జీభాయ్‌ రత్వ జుట్టు 62 అడుగులు. చిన్నప్పట్నుంచి జుట్టును కత్తిరించకుండా పెంచుతూ వస్తున్నాడు. దీంతో అతని జుట్టు ఇప్పుడు 62 అడుగులు పొడవు పెరిగింది. దీన్ని రత్వ తలపై టర్బన్‌లా ధరిస్తున్నాడు. ఇంత జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ పలు రకాల పండ్లు.. కూరగాయాలు తింటాడట. రెండ్రోజులకు ఒకసారి తలస్నానం చేస్తాడట. జుట్టును శుభ్రం చేయడానికి దాదాపు మూడుగంటల సమయం పడుతుందని చెబుతున్నాడు.

ఇక జుట్టు ఆరాలంటే అతని మనవళ్లు.. మనవరాళ్లు జుట్టును లాగి పట్టుకొని ఎండలో నిల్చుంటారు. ఇంత జుట్టుతో ఉన్న రత్వ గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించడానికి స్థానిక స్వచ్ఛంద సంస్థ సహాయపడింది. దీంతో గిన్నిస్‌ బుక్‌ వారికి దరఖాస్తు చేసుకున్నాడు. తర్వలో ప్రపంచంలోనే అత్యంత పొడవు జుట్టు ఉన్న వ్యక్తిగా రత్వ పేరు రికార్డుల్లోకెక్కనుంది.

Check Also

కొత్త వ్యక్తులు వస్తే పోలీసుల‌కు సమాచారం ఇవ్వండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మనం కరోనా అనే కనిపించని శత్రువుతో పోరాడుతున్నామని అనుక్షణం ...

Comment on the article