Breaking News

మండప నిర్మాణానికి 41 వేల విరాళం

 

కామారెడ్డి, జూన్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం మండప నిర్మాణానికి సోమవారం భక్తులు విరాళం అందించారు. కామారెడ్డి మండలం అడ్లూర్‌ గ్రామానికి చెందిన గడ్డమీది నర్సయ్య, మైసమ్మ దంపతులు వీరభద్రయ్య మండప నిర్మాణానికి రూ. 41 వేలు విరాళం అందించారు. ఆలయ అభివృద్ది కోసం విరాళం అందించినట్టు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్‌ లచ్చిరెడ్డి, కార్యదర్శి లింగన్నచారి, అర్చకులు ప్రభాకర్‌స్వామి, గణేష్‌, స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

చెక్కుల పంపిణీ

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా మంజూరైన 25.05 ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *