Breaking News

Daily Archives: June 14, 2016

మెప్మా ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

కామారెడ్డి, జూన్‌ 14  నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని రాజీవ్‌నగర్‌ సిఆర్‌సి సెంటరులో మెప్మా ఆద్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందిరా నగర్‌ సిఆర్‌సి సెంటర్‌లో సైతం ఉచిత శిక్షణ కార్యక్రమం చేపట్టారు. మంగళవారం ఈకేంద్రాలను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ సుష్మ సందర్శించారు. కేంద్రాల్లో జూట్‌ బ్యాగులపై, టైలరింగ్‌లో మహిళలకు శిక్షణ ఇస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. శిక్షణ పొందేందుకు 18-45 సంవత్సరాల మహిళలందరు అర్హులని చెప్పారు. శిక్షణ పొందిన వారిచేత త్వరలో ఒక స్టాల్‌ను ఏర్పాటు చేయిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ...

Read More »

ఆంధ్రాన్యాయమూర్తుల ఆప్షన్‌పై కలెక్టర్‌కు వినతి

  కామారెడ్డి, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంధ్రా న్యాయమూర్తులు తెలంగాణ రాష్ట్రానికిఇచ్చిన ఆప్షన్‌ను వెనక్కి తీసుకోవాలని మంగళవారం కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ ప్రతినిదులు జిల్లా కలెక్టర్‌ యోగితా రాణాకు వినతి పత్రం సమర్పించారు. కామారెడ్డికి వచ్చిన కలెక్టర్‌ వాహనాన్నిఘెరావ్‌ చేసి ఆమెను కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఆంధ్రా ప్రాంత న్యాయమూర్తులు తెలంగాణకు ఇచ్చిన ఐచ్చికాల వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. దీనివల్ల తెలంగాణలో 20 సంవత్సరాల పాటు న్యాయమూర్తుల నియామకాలు జరగబోవని ఆవేదన వ్యక్తం చేశారు. ...

Read More »

రక్తదానం చేసి ప్రాణదాతలు కండి

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా కామారెడ్డి, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి రెడ్‌క్రాస్‌ లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో మంగళవారం రక్తదాతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్‌ రక్తదాతలను సన్మానించారు. రక్తదానం పట్ల ఉన్న అనుమానాల్ని వీడి ఆరోగ్యవంతులైన అందరు రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని కోరారు. రక్తం ...

Read More »

పాఠశాలలో అక్షరాభ్యాసం

  కామారెడ్డి, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ మాద్యమిక ఉర్దూ మీడియం ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మైనార్టీ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. పలువురు విద్యార్థులను పాఠశాలలో చేర్పించారు. 5వ వార్డు కౌన్సిలర్‌ పద్మ రాంకుమార్‌ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. వందమంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాద్యాయుడు అబ్దుల్‌ అలీం, నాయకులు రాంకుమార్‌గౌడ్‌, కృష్ణమూర్తి, అసిఫ్‌ అహ్మద్‌, మహ్మద్‌ గౌస్‌, నూర్జహాన్‌ తదితరులు ...

Read More »

మెటల్‌ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

  కామారెడ్డి, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 25వ వార్డులో విద్యానగర్‌ కాలనీలో మంగళవారం మెటల్‌ రోడ్డు నిర్మాణ పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. నాన్‌ ప్లాన్‌ గ్రాంట్‌ నిధులు రూ. 1.75 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్టు తెలిపారు. పనులను నాణ్యతగా త్వరితగతిన పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ రాధిక, ప్రభాకర్‌ యాదవ్‌, ఏ.ఇ. గంగాదర్‌, నాయకులు అశోక్‌కుమార్‌, శివారెడ్డి, లత, తదితరులు పాల్గొన్నారు.

Read More »

పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి

  బీర్కూర్‌, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని సేవా సంఘ్‌ యూత్‌ ఆధ్వర్యంలో సంగం గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగా చేపడుతున్న కెజి నుంచి పిజి ఉచిత విద్యలో భాగంగా మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ఇంటింటికి తిరుగుతూ చేపట్టారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో ఉండేతేడాను ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పించారు. ఉచిత పుస్తకాలు, యూనిపారం, సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనం ...

Read More »

తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంగ్లీష్‌ మీడియం

  బీర్కూర్‌, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరమున్నచోట, తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంగ్లీష్‌ మీడియం విధానం ప్రారంభించాలని ఎంఇవో గోపాల్‌రావు అన్నారు. మంగళవారం బీర్కూర్‌లో మండలంలో మండల ప్రధానోపాద్యాయులతో సమావేశమయ్యారు. ఆరోగ్య శిబిరలు 18న జడ్పిహెచ్‌ఎస్‌ పాఠశాలలో, 19న ఉర్దూ మీడియం పాఠశాలలో ఉదయం 8 నుంచి 1.30 గంట లవరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఈ విద్యాసంవత్సరానికి సంబందించినపాఠ్య పుస్తకాలు సరఫరా చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Read More »

హత్యకేసులో నిందితుని అరెస్టు

  బాసర, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత 2015 జనవరి 7వ తేదీన బాసర రైల్వే స్టేషన్‌ సమీపంలో జరిగిన హత్యకేసులో ఓ నిందితుని మంగళవారం పట్టుకున్నట్టు సిఐ రఘుపతి వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం… గతంలో బాసర రైల్వే స్టేషన్‌ ప్రాంతంలో సాయబ్‌రావు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. కేసు విచారణ జరిపిన పోలీసులు అప్పట్లో నిందితులైన సాయబ్‌రావు, ఉత్తమ్‌, గంగుబాయిలను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు ప్రారంభించారు. కాగా తాజాగా మరో నిందితుడు నాలుగోవ్యక్తి షేక్‌ ...

Read More »

విదేశీ కార్మికుడి హత్య..

షార్జా: బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్మికుడు ఒకరు షార్జాలో హత్యకు గురయ్యాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మువైలీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అంబులెన్స్, పెట్రోలు, సీఐడీ పోలీసులను వెంటనే ఘటనా స్థలానికి పంపించారు. అప్పటికే అక్కడ చనిపోయి రక్తపుమడుగులో పడిఉన్న వ్యక్తిని ఓ పాకిస్థానీగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిలో ఒకరు పాకిస్థానీ కాగా మరొకరు బంగ్లాదేశీ. వెంటనే వారిద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Read More »

Top Kapu leaders issue two-day ultimatum to CM Naidu

HYDERABAD: Accusing CM N Chandrababu Naidu of being vindictive towards fasting Kapu leader Mudragada Padmanabham, prominent Kapu leaders belonging different political parties have warned that if anything happens to Mudragada, the state government will have to face serious consequences. Cutting across political lines, prominent Kapu politicos including K Chiranjeevi, Dasari Narayana Rao, MM Pallam Raju, C Ramachandraiah, Botcha Satyanarayana and ...

Read More »

నైట్ క్లబ్‌లో ఫైరింగ్.. బాత్రూమ్‌లో దాక్కుని తల్లికి టెక్ట్స్ మెసేజ్‌లు.. చివరికి..?

అమెరికాలోని నైట్ క్లబ్‌లో ఆగంతకుడు ఫైరింగ్ స్టార్ట్ చేయగానే ఎడీ జస్టిస్ తన తల్లికి మెసేజ్ పంపాడు. అదీ బాత్‌రూమ్‌లో ఉండే. బాత్‌రూమ్‌లో ఉంటే తప్పించుకుంటానని అనుకున్నాడు. కానీ ఉన్మాది కాల్పులకు బలైపోయాడు. ఫైరింగ్ ప్రారంభం కావడంతోనే బాత్రూమ్‌లో దాక్కున్న జస్టిస్ ఫోన్లో మాట్లాడకుండా టెక్ట్స్ మెసేజ్‌లు పంపాడు. ఆ ఉగ్రవాది అసలు బాత్ రూమ్‌లోకి తొంగి చూడడని, తాను బతికి బయటపడతానని చివర వరకూ అనుకున్నాడు జస్టిస్. అమ్మకు పోలీసులకు ఫోన్ చేయమన్నాడు. నన్ను చంపేస్తాడు అంటూ తొందరపెడుతూ మెసేజ్‌లు ఇచ్చాడు. అప్పటికే ...

Read More »

ఓర్లాండో ఘాతుకం

అమెరికాలోని ఓర్లాండో నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల ఘటన అత్యంత అమానుషమైనది. ఈ తరహా కాల్పులకు మారుపేరైన దేశంలో ఇప్పుడు ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో పౌరులు మరణించడం ఆ దేశాన్ని మరోమారు కుదిపేసింది. స్వలింగ సంపర్కుల ప్రత్యేక నైట్‌క్లబ్‌ ‘పల్స్‌’లో ఈ దారుణం చోటుచేసుకోవడం, కాల్పులకు పాల్పడిన వ్యక్తి అఫ్ఘాన్ మూలాలున్న ఒమర్‌ సిద్దిఖీ మతీన కావడం ఈ ఘటనకు మరిన్ని కోణాలను చేర్చింది. ఘటన జరగగానే ‘ఇది మా పనే’ అని ప్రకటించిన ఇస్లామిక్‌ స్టేట్‌, మర్నాడు దానిని ‘అమెరికాలోని మా కాలిఫైట్‌ ...

Read More »

ఇంత ఘాటు హాట్ సీన్ నేను చేయను.. సినిమా బాయ్‌కాట్ చేసిన హీరోయిన్

కుషన్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో హీరోయిన్ చిత్రాంగదా సింగ్-నవాజ్ సిద్ధిఖీ మధ్య హాట్ సీన్ షూట్ చేస్తుండగా కలకలం మొదలైంది. హాట్ సీన్ మరీ ఘాటుగా కావాలని డైరక్టర్ కుషన్ పట్టుబట్టారు. హీరో నవాజ్ సిద్ధిఖీ హీరోయిన్ అయిన చిత్రాంగదాను దగ్గరకు తీసుకుంటుండగా ఎవరైనా చూస్తారంటూ దూరం జరుగుతుంది. అప్పుడు నవాజ్ ఆమెను మరింత దగ్గరగా తీసుకునే సీన్‌లో ఈ వివాదం మొదలైంది. ఈ సీన్ సమయంలో తనకు సీన్ ఎలా కావాలంటే అంటూ డైరక్టర్ ఉపయోగించిన భాషతో చిత్రాంగదకు మైండ్ ...

Read More »

జర్నలిస్టు నాగరాజు కుటుంబానికి జాగృతి నాయకుల ఆర్థిక సహాయం

నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని గాయత్రి నగర్‌కు చెందిన జర్నలిస్టు నాగరాజు కుటుంబానికి తెలంగాణ జాగృతి నాయకులు అండగా నిలిచారు. ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదేశాలతో జాగృతి నాయకులు పది వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. సోమవారం నాగరాజు భార్యకు పిల్లల చదువు నిమిత్తం ఆర్థిక సాయం అందించారు. జర్నలిస్టు నాగరాజు ఇటీవల మృతి చెందగా, ఎంపీ బాధిత కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో విద్యా సంవత్సరం ఆరంభం కావడంతో పిల్లల చదువు కోసం సాయం అందించారు. ఎంపీ ...

Read More »

15 ద్విచక్ర వాహనాలు సీజ్

ఆర్మూర్ : పట్టణంలో ఆదివారం రాత్రి ఎస్సై యాకూబ్‌తో కలసి వాహనాల తనిఖీ నిర్వహించినట్లు ఎస్‌హెచ్‌వో కె.సీతారాం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సరైన వాహన ధ్రువపత్రాలు లేని, నంబరు ప్లేట్స్ లేని 15 ద్విచక్ర వాహనాలను గుర్తించి సీజ్ చేశామని, వాటిని ఎంవీఐకి అప్పగించినట్లు తెలిపారు.

Read More »

మోగిన బడి గంట..!

నిజామాబాద్ అర్బన్: జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సోమవారం తెరుచుకున్నాయి. ఉదయం నుంచి పాఠశాలల ప్రారంభ హడావుడి కనిపించింది. వేసవి సెలవుల తర్వాత పాఠశాల లు తెరుచుకోగా, పిల్లలు స్కూల్‌కు వెళ్లమని మారం చేయడం వంటివి కనిపించాయి. వి ద్యా సంవత్సరం ఆరంభం రోజు అష్టమి కావడంతో చాలామంది తమ పిల్లలను పాఠశాలలకు పంపించలేదు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం రోజు కాలనీల్లో విద్యా సంస్థల వా హనాల రాకపోకల సందడి కనిపించింది. ప్ర భుత్వ విద్యా సంస్థల్లో పుస్తకాలను పంపిణీ చేశారు. మధ్యాహ్న ...

Read More »

చిరు చిందేసిన వేళ…

చిరు స్టెప్పేస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఆయన ప్రతి కదలికలో ఏదో మ్యాజిక్ వుంటుందని అభిమానులు చెబుతుంటారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సినీ మా అవార్డుల వేడుకలో తనదైన శైలి నృత్య విన్యాసాలతో అభిమానుల్ని ఉర్రూతలూగించారు మెగాస్టార్ చిరంజీవి. గ్యాంగ్‌లీడర్ సినిమాలోని టైటిల్‌సాంగ్‌కు హుషారుగా స్టెప్పులేసి ఆహుతుల్ని ఆనందడోలికల్లో ముంచెత్తారు. చిరు స్టెప్పులేస్తుంటే అభిమానుల కేరింతలు, ఈలలతో ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది. సాయిధరమ్‌తేజ్, శ్రీకాంత్, సునీల్, నవదీప్…తదితరులు చిరంజీవితో జతకలిసి డ్యాన్స్ చేశారు. చిరంజీవి నృత్యానికి సంబంధించిన వీడియోను ఆయన తనయుడు రామ్‌చరణ్ తన ఫేస్‌బుక్ ...

Read More »

డిఫంట్‌గా మ్యారేజ్ డే..

పెళ్లిరోజూ అనగానే… గొప్పగా జరుపుకోవాలని ముందే ప్లాన్ చేసుకుంటాం. కుటుంబంలోని దగ్గరి వాళ్లను, ఆత్మీయులు, ఆఫీస్ కొలీగ్స్, ఇంకా ఫెండ్స్‌ను పార్టీకి ఆహ్వానిస్తాం. మంచి విందు ఏర్పాటు చేసి మస్త్ మజా చేస్తాం. మామూలుగా అయితే పెళ్లిరోజు వేడుక ఇలా జరుపుకుంటారు. కానీ టోరంటోలో భారత సంతతికి చెందిన జంట అరుణ్‌మోహన్, అజిత జగన్నాథన్ మాత్రం తమ పెళ్లిరోజును అందరికంటే ఢిపంట్‌గా చేసుకున్నారు. అది కూడా వారికి చాలా ఇష్టమైన బాస్కెట్‌బాల్ గేమ్ ఆడి. పార్టీకి ఆహ్వానించిన వారితో దంపతులిద్దరూ బాస్కెట్‌బాల్ కోర్టులోకి దిగారు. ...

Read More »

బాదంతో అందం!

-కొబ్బరి నూనె, బాదం నూనె సమపాళ్లలో కలిపి కళ్లకింద నల్లటి వలయాలపై రాస్తే ఈజీగా మాయమవుతాయి. -బాదం నూనె ముఖానికి పట్టించి మర్దన చేశాక గంధంతో ఫేస్‌ప్యాక్ వేస్తే ముఖం మెరిసిపోతుంది. -బాదం నూనె, ఆముదం మిశ్రమంలా చేసి జుట్టుకు పట్టిస్తే జుట్టు బలంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది

Read More »

సన్యాసిగా మారనున్న అనుష్క!

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న అనుష్క వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఒక వైపు గ్లామర్‌ రోల్స్ తో అలరిస్తూనే మరో వైపు డీ గ్లామరస్ పాత్రలలో నటించి మెప్పిస్తోంది అనుష్క. ప్రస్తుతం సింగం3, బాహుబలి2, భాగమతి, ఓం నమో వెంకటేశ అనే చిత్రాలతో బిజీగా ఉంది ఈ యోగా బ్యూటీ. రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఓం నమో వెంకటేశ అనే చిత్రంలో అనుష్క సన్యాసిగా కనిపించనుందనే వార్తలు వస్తున్నాయి. నన్‌గా నటించాలనే కోరిక తనకు ...

Read More »