Breaking News

ఎత్తిపోతల కమిటీ ఛైర్మన్‌గా నోముల సత్యంరెడ్డి

 

మోర్తాడ్‌, జూన్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గుమ్మిర్యాల్‌ గ్రామ ఎత్తిపోతల కమిటీ ఛైర్మన్‌గా అదే గ్రామానికి చెందిన తెరాస నాయకుడు నోముల సత్యంరెడ్డిని ఎత్తిపోతల పథకం ఛైర్మన్‌గా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి నియమించారని మండల తెరాస అధ్యక్షుడు కల్లడ ఎలియా గురువారం తెలిపారు. నోముల ముత్యంరెడ్డి పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఆయన ఈ పదవిని అందించారని, గ్రామస్తుల తరపున ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా నోముల సత్యంరెడ్డి మాట్లాడుతూ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆశయాల మేరకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, తనపై విశ్వాసముంచి అందించిన ఛైర్మన్‌ పదవికి న్యాయం చేస్తానని చెప్పారు.

Check Also

ఏడు కుటుంబాల‌కు కిరాణ సరుకుల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డు కౌన్సిల‌ర్‌ ...

Comment on the article