Breaking News

Daily Archives: June 16, 2016

బోధన్‌లో మౌన ప్రదర్శన

బోధన్,: పట్టణంలోని న్యాయస్థానాల ప్రాంగణంలో న్యాయవాదులు న్యాయాధికారుల విభజనలో అక్రమాలను వ్యతిరేకిస్తూ మౌనంగా ప్రదర్శన చేశారు. తమ నోటికి నల్ల గుడ్డలు కుట్టకుని ఈ నిరసన ప్రదర్శనలో న్యాయవాదులు పాల్గొన్నారు. నిరసన ప్రదర్శనలో బోధన్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఆర్ దేశాయ్, న్యాయవాదులు హన్మంత్‌రావు, సమ్మయ్య, ఎన్.ఈశ్వర్, ఇంద్రకరణ్, సుబ్బారావు, మధుసింగ్, శంకర్, సాయిలు నాయక్, మోహన్, కోటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Read More »

బాల్కొండ నియోజకవర్గంలో 65వేల ఎకరాలకు సాగు నీరందించాలి

కమ్మర్‌పల్లి: బాల్కొండ నియోజకవర్గంలో 65వేల ఎకరాలు సాగులోకి వచ్చేలా అంచనాలు సిద్ధం చేయాలని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బాల్కొండ నియోజకవర్గంలోని ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ 21 పనుల పురోగతి, చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం, గుత్ప ఎత్తిపోతల పథకం, నిజాంసాగర్ పాత కెనాల్ మరమ్మతుల గురించి బుధవారం ఆయన సచివాలయంలోని తన చాంబర్‌లో గోదావరి బేసిన్ కమిషనర్ మధుసూదన్ రావు, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్యాకేజీ 21 ద్వారా నియోజకవర్గంలోని వేల్పూర్, భీమ్‌గల్, కమ్మర్‌పల్లి, మోర్తాడ్ ...

Read More »

తొందర పడి విత్తనాలు వేయద్దు..

-సేంద్రియ సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి -70 మి.మీ వర్షపాతం నమోదైన తర్వాతే విత్తాలి -జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత లేదు -80 శాతం తగ్గనున్న పత్తి సాగు -ప్రత్యామ్నాయంగా సోయాబీన్, మొక్కజొన్న -నమస్తే తెలంగాణతో జేడీఏ నరసింహా నిజామాబాద్;ఖరీఫ్ సీజన్ మొదలైంది. రైతులు దుక్కులు దున్ని వరుణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. అడపా దడపా కురుస్తున్న వానలు చూసి విత్తనాలు వేయడం అనర్థదాయకం అంటున్నారు వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు నర్సింహా. నాలుగు నెలలుగా విపరీతమైన ఎండలు కొట్టాయి. భూమిలో వేడి ఇంక ...

Read More »

గంట ప్రయాణానికి రూ.2500

న్యూఢిల్లీ:దేశీయ విమానయాన రంగంలో కీలక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సామాన్యుడికి సైతం విమాన సేవలు అందించాలనే ఉద్దేశంతో రూపొందించిన నూతన పౌర విమానయాన పాలసీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. టికెట్ ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచుతున్న విమానయాన సంస్థలకు చెక్ పెట్టడానికి కేంద్రం కనీస టికెట్ ధరను సైతం నిర్ణయించింది. దేశీయంగా గంట విమానప్రయాణానికి గరిష్ఠంగా రూ.2,500గాను, అరగంట ప్రయాణానికి రూ.1,200గా నిర్ణయించింది. వచ్చే నెలలో అమలులోకి ...

Read More »

కుర్రాళ్లు కుమ్మేశారు..

విజయాల రికార్డును మరింత పదిలపర్చుకుంది. కుర్రాళ్లతో కూడిన ద్వితీయశ్రేణి జట్టుతో బరిలోకి దిగినా ఫలితంలో తేడా లేకుండా జింబాబ్వేను ముచ్చటగా మూడో సారి వైట్‌వాష్ చేసింది. గత రెండు వన్డేలకు కొనసాగింపు అన్నట్లుగా సాగిన ఆఖరి వన్డేలో టీమ్‌ఇండియా ఘనవిజయం సాధించింది. బుమ్రా పేస్ బౌలింగ్ ధాటికి తొలుత జింబాబ్వే కకావికలై స్వల్ప స్కోరుకే చాపచుట్టేసింది. గెలుపు లాంఛన ప్రాయమే అన్నట్లుగా ఓపెనర్లు రాహుల్, ఫజల్ అజేయ అర్ధసెంచరీలతో రాణించి జట్టుకు అద్భుత విజయాన్ని కట్టబెట్టారు. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను ధోనీ నాయకత్వంలోని ...

Read More »

చిరు సినిమాకు నో చెప్పిన ప్రముఖ కమెడియన్

సినిమాల్లో అవకాశాలు రాక దిగాలు పడేవారు కొందరైతే, ఒక భారీ మూవీ ప్రాజెక్ట్ చేయాలనుకునే వారు మరికొందరు. స్టార్ హీరో సినిమాలో తను యాక్ట్ చేస్తే బాగుంటుందనుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల మిస్ అవుతుంటారు. కానీ ఎప్పటికో మళ్లీ ఛాన్స్ వస్తుంది. ఓ కమెడియన్ మొదట వచ్చిన ఛాన్స్ ను మిస్ చేసుకున్నా ఇప్పుడు మరో మంచి ఛాన్స్ వచ్చింది. కమెడియన్ వెన్నెల కిశోర్ లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. అది అట్టాంటి, ఇట్టాంటి ఛాన్స్ కాదు… కత్తిలాంటి ఛాన్స్. చిరంజీవి 150వ సినిమా ...

Read More »

నాన్న ఇచ్చిన గిఫ్ట్‌తో ఉబ్బితబ్బిబ్బయిన నిహారిక

ఫ్యామిలీ నుండి తొలిసారి హీరోయిన్ గా ఎంట్రీస్తున్న అందాల భామ నిహారిక. ఇటు బుల్లితెరపైన, అటు వెబ్‌ సిరీస్ ద్వారా అలరించిన ఈ మెగా భామ తాజాగా ఒక మనసు చిత్రంతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం జూన్‌ 24న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ , ట్రైలర్స్ మూవీపై మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచుతున్నాయి. నిహారిక మూవీ కోసం మెగా అభిమానులే కాదు మెగా ఫ్యామిలీ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇక నాగ బాబు ...

Read More »

ఐటీ ఎగుమతుల్లో రాష్ట్రం బెస్ట్

కొత్తగా మూడు ఐటీ పార్కులు హైదరాబాద్‌లో అతిపెద్ద డాటా సెంటర్ -2015-16లో రూ.75 వేల కోట్లు -2014-15 కన్నారూ.9 వేల కోట్లు అదనం -దేశీయ సగటుకంటే ఒక శాతం ఎక్కువే -బ్రాండ్ హైదరాబాద్ సత్తా.. ప్రపంచ కంపెనీల రాక -ప్రపంచ ఐటీ పరిశ్రమను ఆకర్షించడమే లక్ష్యం -ఐటీశాఖ వార్షిక నివేదిక విడుదలచేస్తూ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ తెలంగాణకున్నాయని రాష్ట్ర సమాచార సాంకేతిక శాఖ (ఐటీ) మంత్రి కేటీ రామారావు ప్రకటించారు.2014-15 ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతులు రూ.66,276 కోట్లుగా (12.3%) ఉండగా.. 2015-16 ఆర్థిక ...

Read More »

వీర్యం ఇవ్వండి.. ఐఫోన్ ప‌ట్టుకెళ్లండి

బీజింగ్‌: చైనాలో 20 నుంచి 45 ఏళ్ల మ‌ధ్య ఉన్న మ‌గ‌వారికి అక్క‌డి స్పెర్మ్ బ్యాంకులు ఇస్తున్న ఆఫ‌ర్ ఇది. మీ దేశం కోసం ద‌య‌చేసి మీ వీర్యం ఇవ్వండంటూ బ‌తిమాలుకోవాల్సిన ప‌రిస్థితి ఇప్పుడు అక్క‌డ క‌నిపిస్తోంది. కార‌ణాలు ఏవైతేనేం వీర్యం దొర‌క్క అక్క‌డి స్పెర్మ్ బ్యాంకులు తెగ ఇబ్బంది ప‌డుతున్నాయి. దీంతో వీర్యం దానం చేసే యువ‌త కోసం కొత్త కొత్త ఆఫ‌ర్లు పెడుతున్నాయి. వెయ్యి డాల‌ర్ల క్యాష్ లేదంటే రోజ్ గోల్డ్ ఐఫోన్ ఇస్తామంటూ ఆక‌ర్షిస్తున్నాయి. ఈ మ‌ధ్యే రెండో సంతానానికి ...

Read More »

దొంగబాబా దోచేశాడు

-ప్రసాదంలో మత్తుమందిచ్చి 1.3 కోట్లతో పరారీ హైదరాబాద్ వ్యాపారి ఇంట్లో బడాచోరీ -లైఫ్ ైస్టెల్ బిల్డింగ్ యజమాని ఇంట్లో ఘటన క్రైంబ్యూరో/బంజారాహిల్ప్: మానసిక ప్రశాంతత కరువైందని, అందుకు పూజలు చేసి ఉపశమనం కలిగించాలని కోరిన ఓ వ్యాపారి కుటుంబాన్ని పూజారిగా వచ్చిన దొంగబాబా దారుణంగా మోసగించిన ఘటన హైదరాబాద్‌లోని బంజారాహల్స్‌లో బుధవారం జరిగింది. సినీ ఫక్కీలో ప్రసాదంలో మత్తుమందు కలిపి ఇచ్చిన ఆ దొంగబాబా వ్యాపారి ఇంట్లోంచి రూ.1.3 కోట్ల నగదును దొంగిలించి పరారయ్యాడు. బంజారాహిల్స్‌లో రోడ్డునెం.12లో నివాసముండే లైఫ్‌ైస్టెల్ బిల్డింగ్ యజమాని మధుసూదన్‌రెడ్డి ...

Read More »