Breaking News

ప్రయివేటు పాఠశాలలో ఫీజులు నియంత్రించాలి

 

కామారెడ్డి, జూన్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం చర్యలు తీసుకోవాలని ఏబివిపి ఆధ్వర్యంలో గురువారం కామరెడ్డి ఎంఇవో కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయివేటు పాఠశాలల్లో విచ్చల విడిగా ఫీజులు పెంచుతూ వసూలు చేస్తున్నారన్నారు. కనీస వసతులు సైతం కల్పించడం లేదని తెలిపారు. సంబంధిత అధికారులు పాఠశాలలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏబివిపి నాయకులు భరత్‌, బాల్‌రాజ్‌, రాజు, గోపి, లక్ష్మణ్‌, మాధవ్‌, ప్రవీణ్‌, తదితరులున్నారు.

Check Also

కురిసింది వాన… కామారెడ్డిలోన….

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో గురువారం భారీవర్షం కురిసింది. ధీంతో రోడ్లన్నీ జల‌మయమయ్యాయి. ...

Comment on the article