Breaking News

జిల్లా స్థాయిలో విద్యార్థులు ప్రతిభ కనబరచాలి

 

మోర్తాడ్‌, జూన్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా స్థాయిలో విద్యార్థులు ప్రతిభ కనబరిచి గ్రామానికి, మండలానికి పేరుప్రతిష్టలు తీసుకురావాలని దొన్కల్‌ సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ పడాల సత్తమ్మ, హనుమాగౌడ్‌లు అన్నారు. గురువారం మండలంలోని దొన్కల్‌ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యాబోధన జరుగుతుందని విద్యార్థులకు అవసరమయ్యే అన్ని వసతులు ప్రభుత్వం కల్పిస్తుందని, ఉచిత భోజనం, పాఠ్యపుస్తకాలు అందిస్తుందని వివరించారు. తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఉత్తములుగా తీర్చిదిద్దేందుకు బాట వేయాలన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, ప్రధానోపాద్యాయులు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Check Also

పందులను నివారించ లేరా?

నందిపేట్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ గ్రామంలో ఏముంది ..ఒకవైపు అపరిశుభ్ర వాతావరణం.. మరోవైపు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *