Breaking News

మూతబడిన పాఠశాల ప్రారంభమైంది

 

బీర్కూర్‌, జూన్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బొమ్మన్‌దేవుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కట్టకింద తాండాలో ఎంఇవో గోపాల్‌రావు, ఎంపిటిసి కిషన్‌ నాయక్‌ మూతబడ్డ పాఠశాలను తిరిగి ప్రారంభించారు. కట్టకింది తాండా పాఠశాలలో విద్యార్థులు లేరని పాఠశాల మూసివేయించారని, గ్రామంలోని 15 మంది బడి బయట పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించి పాఠశాల పున: ప్రారంబించామని వారు పేర్కొన్నారు. విద్యావనరుల అధికారి గోపాల్‌రావు వివరించారు. మండలంలో బడి బయట పిల్లలను గుర్తించి బడుల్లో చేర్పించాలని, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో సిఆర్‌పి గుండం నర్సింలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Check Also

ఏదో ఒకరోజు గొప్పవ్యక్తి గాని సామాన్య వ్యక్తి గాని అక్కడికి వెళ్ళాల్సిందే

re నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విఐపి డెడ్‌ బాడీల‌కు ఏ విధంగా శవ యాత్ర నిర్వహిస్తారో అదేవిధంగా ...

Comment on the article