Breaking News

ప్రధాని హెయిర్‌ కటింగ్‌కు లక్ష రూపాయాలు!

న్యూయార్క్‌: హెయిర్‌ కటింగ్‌కు లక్ష రూపాయలు, భోజనానికి 1.25 లక్షలు, బట్టల ఇస్త్రీ చేయించుకోవడానికి రూ.14 వేలు, ఇతర గృహోపకరణాల కోసం రూ. 13 లక్షలు.. ఈ ఖర్చంతా ఎవరో బిలియనీర్‌ అయిన బిజినెస్‌ మ్యాగ్నెట్‌ది అనుకుంటే పొరబాటే. ఈ ఖర్చంతా ప్రజాధనానికి కాపలా కాయాల్సిన ఓ దేశాధినేతది. ప్రజాధనాన్ని తమ విలసాల కోసం అధినేతలు ఎలా ఖర్చుపెడుతున్నారో తెలియజేసే దృష్టాంతం ఇది.
ఐక్యరాజ్య సమితి సమావేశాల కోసం ఆరు రోజుల పాటు న్యూయార్క్‌లో బస చేసిన ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ, ఆయన భార్య సారా చేసిన ఖర్చు ఇది. ఈ విషయం ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చింది. సచార్‌ బెన్‌ మిర్‌ అనే ఇజ్రాయిల్‌ న్యాయవాది ఈ వివరాలు సేకరించారు. ‘ఇది ప్రజలందరి డబ్బు. దీనిని ప్రధాని, ఆయన భార్య దుర్వినియోగం చేస్తున్నా’రని ఆయన విమర్శించారు.

Check Also

కందకుర్తి శాఖా వార్షికోత్సవం

బోధన్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కందకుర్తి శాఖా వార్షికోత్సవాన్ని గురువారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *