Breaking News

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ స్పీకర్‌

 

నందిపేట, జూన్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో గత శనివారం రోజున భారీ గాలివాన కారణంగా గోడకూలి నలుగురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరోఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జోర్‌పూర్‌ గ్రామానికి చెందిన అక్కా, తమ్మడు రమాదేవి, ప్రవీణ్‌, వెల్మల్‌ గ్రామానికి చెందిన సుదర్శన్‌, గొట్టుముక్కల గ్రామస్తురాలు మృతి చెందారు. కాగా శనివారం మృతుల కుటుంబాలను మాజీ స్పీకర్‌ కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని అన్నారు. వీరి కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయించాలని పేర్కొన్నారు.

Check Also

ఆ రెండు క‌ల్లు దుకాణాల‌తో కష్టాలు

నిజామాబాద్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగర ప్రజల‌కు అసౌకర్యం కలిగిస్తున్న క‌ల్లు దుకాణం ఇక్కడి ...

Comment on the article