Breaking News
????????????????????????????????????

అభివృద్దిని అడ్డుకుంటే ప్రజలే గుణపాఠం చెబుతారు

 

మహిళల సాధికారతే తెరాస ధ్యేయం

– మంత్రి హరీష్‌రావు

మోర్తాడ్‌, జూన్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు, ఇంటింటికి తాగునీరు అందించి తీరుతామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. శుక్రవారం బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మండలం, బట్టాపూర్‌, మోర్తాడ్‌ మండలంలోని గుమ్మిర్యాల్‌, కమ్మర్‌పల్లి మండలంలో, భీమ్‌గల్‌ మండలంలో గోదాములు, ఎత్తిపోతల పథకాలు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ భవనాల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ప్రజలనుద్దేశించి మంత్రి మాట్లాడారు. రైతుల ప్రయోజనాల్లో రాజకీయాలు చేయవద్దని, 1100 గ్రామాల రైతులకు మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు చేపడితే సాగునీరు అందుతుందన్నారు. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న 16 గ్రామాల ప్రజలకు కోరుకున్న చోట భూములు, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళు, 6 లక్షల నష్టపరిహారం భూనిర్వాసితులకు అందిస్తున్నామన్నారు. తెలంగాణలో కరువు ఏర్పడి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, గత పాలకుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలు అభివృద్దిలో సహకరించాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో అడ్డుపడితే రైతులే ప్రతిపక్షాలకు గుణపాఠం చెబుతారని వారు హెచ్చరించారు.

శనివారం బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్‌, భీమ్‌గల్‌, కమ్మర్‌పల్లి మండలాల్లో పలు బిటి రోడ్ల , మహిళా భవనాల నిర్మాణాలకు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి శంకుస్తాపనలు చేసి మాట్లాడారు. మహిళల సంక్షేమ అభివృద్దికి అధిక ప్రాధాన్యతనిచ్చి సిఎం కెసిఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. నిజామాబాద్‌ జిల్లాలోని అన్ని గ్రామాల్లో గ్రూపు మహిళలకు మహిళా సంఘ భవనాలు నిర్మిస్తున్నామన్నారు. మహిళల సాధికారతకై సిఎం కెసిఆర్‌ 10 లక్షల వడ్డిలేని రుణాలు జిల్లాలో శిక్షణనిస్తూ కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నందుకు రుణాలు సైతం అందిస్తున్నారన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని అభివృద్ది చెందాలన్నారు. బంగారు తెలంగాణలో మహిళలే కీలకపాత్ర పోషించాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో ఆయా మండలాల జడ్పిటిసిలు, ఎంపిపిలు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ఆయా శాఖల అదికారులు, తెరాస నాయకులు పాల్గొన్నారు.

Check Also

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో డాక్టర్స్‌ డే

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లా పద్మశాలి సంఘం ఆద్వర్యంలో బుదవారం డాక్టర్స్‌ ...

Comment on the article