Breaking News

ఇసుక క్వారీలో నిబంధనలు తప్పకుండా పాటించాలి

 

నిజామాబాద్‌ రూరల్‌, జూన్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. శనివారం తన చాంబరులో జిల్లా ఇసుక కమిటీ సమావేశాన్ని కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 9 పట్టా ఇసుక క్వారీల్లో నిబంధనలకు అనుగుణంగా ఇసుక తీసుకునేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఎంత స్థాయిలో ఇసుకతీసుకోవాలో నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని, భూగర్భజలాల నీటిమట్టం తగ్గే స్థాయిల వరకు వెళ్లకుండా ఖచ్చితమైన నిబంధనలు పాటించాలన్నారు. ఇసుక తోడడానికి నిర్దేశించిన సమయాన్ని ఖచ్చితంగా పాటించాలని, అదనంగా లోడు తీసుకోకుండా ఖచ్చితమైన ఆదేశాలు జారీచేయాలని ఆదేశించారు. ప్రతి పదిహేను రోజులకోసారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సంయుక్త తనిఖీ నిర్వహించి ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇసుకకు అనుమతులు జారీచేయాలని, ఎటువంటి పొరపాట్లకు అవకాశం లేకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ విశ్వప్రసాద్‌, సంయుక్త కలెక్టర్‌ ఎ.రవిందర్‌రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రతి ఒక్కరు అల‌ర్ట్‌

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నందున మరింత అప్రమత్తంగా ఉండాల‌ని ...

Comment on the article