Breaking News

Daily Archives: June 20, 2016

రాష్ట్రమంతా రుతుపవనం

హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలపై పూర్తిగా విస్తరించాయి. వీటి ప్రభావంతో రెండురోజులుగా అన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రుతువపనాలు రాష్ట్రంలో ప్రవేశించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. శనివారం నుంచి రెండురోజులుగా వర్షాలు కొనసాగుతున్నాయి. అందువల్ల.. ఆదివారంతో రుతుపవనాలు పూర్తిగా విస్తరించినట్టు ప్రకటించాం. బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రుతువనాలు చురుగ్గా కదులుతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో అన్ని ప్రాంతాల్లో ...

Read More »

పింఛన్‌దారులు బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలి

హైదరాబాద్ : జిల్లా పరిధిలోని పింఛన్‌దారులు మీ సేవ కేంద్రాల్లో బ యోమెట్రిక్, ఐరిస్‌ను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఏజేసీ అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా బ్యాంకులో పింఛన్లు తీసుకునేవారు వెంటనే మీ సేవ కేంద్రాలకు వెళ్లి రూ.20 చెల్లించి, బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత ఆధార్‌తో సరిపోలితే వారికి ధ్రువీకరణ పత్రం ఇస్తారని తెలిపారు. దాన్ని పొందినవారికి మాత్రమే పింఛన్ వస్తుందని స్పష్టం చేశారు.

Read More »

మరీ ఇంత పాశవికమా..!

ఓ వ్యక్తి మరో వ్యక్తి పట్ల క్రూరంగా ప్రవర్తిస్తే పశువులా ప్రవర్తిస్తున్నాడంటం! మరి పశువులపైనే అలా ప్రవర్తిస్తే.. వాళ్లనేమంటాం?! ఈ చిత్రాల్లో కనిపిస్తున్న వ్యక్తులను చూడండి.. ఆస్ట్రేలియాలోని ఓ పశువధశాలలో ఆవులను ఎంతదారుణంగా చంపుతున్నారో తెలుస్తుంది. ఆవులను వరుసలో కట్టేసి.. అవి చచ్చేదాకా వాటి తలపై పెద్దసుత్తితో బాదుతున్నారు.ఒకదాని తర్వాత మరోదానిని చంపేస్తున్నారు. ఈ దారుణాన్ని ఓ సామాజిక కార్యకర్త వీడియో తీసి పోస్ట్ చేశారు. ఇలాంటి క్రూరచర్యపై సోషల్‌మీడియాలో ఆగ్రహం పెల్లుబుకుతున్నది. వీళ్లు మనుషులా.. పశువులా..? అంటూ నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.

Read More »

పవన్ సినిమాకు డైరెక్టర్ మారారు..

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ పవన్‌కళ్యాణ్ సర్దార్‌గబ్బర్‌సింగ్ తర్వాత ఎస్‌జె సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. పవన్ లేటెస్ట్ మూవీ దర్శకత్వ బాధ్యతలను ఎస్‌జె సూర్య దర్శకుడు డాలీ (గోపాల గోపాల ఫేం)కి అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఎస్‌జేసూర్య నటించిన తమిళ సినిమా ‘ఇరైవి’ బాక్సాపీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా విజయంతో తమిళంతోపాటు తెలుగులో ఎస్‌జేసూర్యకు కొత్త సినిమా ఆఫర్లు చాలా వచ్చాయట. తనకు బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల ఎస్ జె సూర్య ఈ సినిమా బాధ్యతలను ...

Read More »

ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న బుద్ధవనం

హైదరాబాద్: నాగార్జునసాగర్ లెఫ్ట్‌బ్యాంక్ సమీపంలో 279 ఎకరాల్లో సుందరంగా నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నది. ప్రత్యేకంగా బుద్ధిజం విస్తరించి ఉన్న దక్షిణాసియా దేశాలలో బుద్ధవనంపై చర్చ జరుగుతున్నదని రాష్ట్ర టూరిజం అధికారులు చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీపర్వతారామం పేరుతో ఏర్పాటు చేసిన బుద్ధవనం ఒక్క తెలంగాణ రాష్ర్టానికే కాకుండా యావత్ దేశానికి తలమానికమైన బౌద్ధ సాంస్కృతిక వికాస కేంద్రమని పేర్కొంటూ వరల్డ్ బుద్ధిస్ట్ కల్చరల్ సొసైటీ నిర్వాహకులు తెలంగాణ టూరిజంశాఖ అధికారులకు లేఖలు రాశారు.బుద్ధవనం ప్రాజెక్ట్‌లో బుద్ధచరితవనం, జాతకపార్క్, ధ్యానవనం, ...

Read More »

ఈ తండ్రికి 472 మంది కూతుళ్లు!

ఫాదర్స్ డే సందర్భంగా ఆదివారం ఓ తండ్రికి 472 మంది కూతుళ్లు శుభాకాంక్షలు తెలిపారు. ఇంత మంది కుమార్లేంటని ఆశ్చర్యపోతున్నారా? కానీ, ఇది నిజం. కాకపోతే వాళ్లంతా తండ్రిలేని పిల్లలు. వాళ్లందరికీ ఆయనే తండ్రయ్యారు. ఆయనే గుజరాత్‌కు చెందిన వ్యాపారి మహేశ్ సనాని(47). పదేండ్ల క్రితం తన తమ్ముడు చనిపోవడంతో ఆయన కూతుర్లకు వివాహం చేయడంతో ప్రారంభించిన ఆయన ఇప్పటివరకు తండ్రిలేని 472 మంది యువతకులకు వివాహం జరిపించారు. ఇందుకోసం ఆయన ఒక్కొక్కరిపై రూ.4 లక్షలు ఖర్చుచేశారు. భర్త చనిపోయిన మహిళ తన కూతురు ...

Read More »

నిండు గర్భిణిని చంపేశారు

-తల్లిదండ్రులకు ఇష్టం లేని పెండ్లి చేసుకోవడమే ఆమె చేసిన నేరం -పాక్‌లో రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురి హత్య లాహోర్: నాలుగు రోజుల్లో పండంటి బిడ్డను కంటాననే సంబురంలోనున్న ఓ గర్భిణిని పుట్టింటివాళ్లే కడతేర్చారు. తమకు ఇష్టం లేనిపెండ్లి చేసుకొన్నదన్న ఏకైక కారణంతో నిండు గర్భిణి అని చూడకుండా తుపాకీతో కాల్చి చంపేశారు. ఆదివారం ఒకే రోజు జరిగిన వేర్వేరు ఘటనల్లో మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పాక్‌లో రెండు రోజుల క్రితమే ఇదే కారణంతో ఓ గర్భిణిని హతమార్చగా.. 48 గంటల్లో మరో ...

Read More »

యోగా డేకు భారీ ఏర్పాట్లు

-దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు -చండీగఢ్‌లో పాల్గొననున్నప్రధాని మోదీ -40 ముస్లిం దేశాలు సహా 190 దేశాల్లో నిర్వహించనున్న యోగా డే న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తున్నది. ఆ రోజు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ప్రత్యేక యోగా కార్యక్రమాల్లో 57మంది కేంద్రమంత్రులు పాల్గొననున్నారు. చండీగఢ్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్నారు. జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తిస్తూ ఐక్యరాజ్యసమితి 2014 డిసెంబర్‌లో ప్రకటన జారీ చేసింది. యోగా దినోత్సవానికి 190కిపైగా దేశాలు మద్దతు తెలుపగా.. అందులో ...

Read More »

ఠాణాలోనే మహిళతో ఎస్‌ఐ మసాజ్!

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌ను మసాజ్ కేంద్రంగా మార్చాడు ఆ స్టేషన్ ఎస్‌ఐ. ఠాణాలోనే ఓ మహిళతో బాడీ మసాజ్ చేయించుకున్నాడు. బట్టలు తీసేసి సబ్‌ఇన్‌స్పెక్టర్ సంజయ్‌యాదవ్ కింద కూర్చొగా మహిళ బాడీ మొత్తం మసాజ్ చేసింది. ఈ తతంగం మొత్తం ఆమె మరిది ఎదురుగా కూర్చొని చూస్తూనే ఉన్నాడు. ఈ సంఘటనను చూసిన కొందరు వీడియో తీశారు. అక్కడితో ఊరుకుంటారా నెట్లో పెట్టి క్యాప్షన్లు కూడా ఇచ్చారు. ఈ వీడియో సోషల్‌మీడియా సైట్లలో బాగా ప్రచారం పొందింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకొన్న ...

Read More »