ముంబై : రఘురామ్ రాజన్ స్థానంలో ఆర్బిఐ తదుపరి గవర్నర్‌గా ఎవరు పగ్గాలు చేపడతారనే విషయంపై ఊహాగానాలకు తెరపడింది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే 12 మంది పేర్లతో ఒక జాబితా తయారు చేసినట్టు సమాచారం. ఇందులో ఎస్బిఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య, ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ ఉర్జిత పటేల్, మాజీ డిప్యూటీ గవర్నర్ రాకేశ్ మోహన్, సెబి చైర్మన్ యుకె సిన్హా, ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ చీఫ్ కెవి కామత, ప్రపంచ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త కౌశిక్ బసు, కాగ్ మాజీ చీఫ్ వినోద్ రాయ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరిలో అరుంధతీ భట్టాచార్యకే ఎక్కువ అవకాశం ఉందని భావిస్తున్నారు.

Latest posts by NizamabadNews OnlineDesk (see all)
- డయల్ 100కు 2271 ఫోన్ కాల్స్ - October 10, 2018
- ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - October 10, 2018
- బహుజనులు ఐక్యం కావాలి - October 10, 2018