Breaking News

అంతర్జాతీయ యోగా దినోత్సవం

ప్రతి ఏటా జూన్ 21ని యోగా దినంగా జరపాలని 193 దేశాల తో కూడిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 2014, డిసెంబర్ 11న నిర్ణయించింది.
170కి పైగా దేశాలు సహ ప్రయోజకులుగా వ్యవహ రించాయి.
2014, సెప్టెంబర్ 27న ఐరాసలో ప్రసంగిస్తూ భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ ఆలోచనను ప్రతిపాదించారు.
ఆరోగ్యం, సంక్షేమం కోసం ప్రాచీన కాలంనాటి భారతీయ యోగాశాస్ర్తాన్ని పరిపూర్ణమైన మార్గంగా ఐరాస గుర్తించినట్లయింది.
సర్వసభ్య సమావేశంలో ఒక తీర్మానానికి ఇంతపెద్ద స్థాయిలో మద్దతు రావడం ఇదే తొలిసారి.
సూర్యుడు భూమధ్యరేఖకు దూరంగా వెళ్లే తేదీల్లో ఒకటైన జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినంగా పాటించాలని మోదీ సూచించారు.
అదేరోజు సుదీర్ఘమైన పగలు ఉండటం వల్ల ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ తేదీకి ప్రత్యేకస్థానం, గుర్తింపు ఉంది.
ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్ల మంది యోగా సాధన చేస్తున్నల్లు అంచనా.
ఒక్క అమెరికాలోనే 20 మిలియన్ల మంది యోగా సాధన చేసేవారు ఉన్నారు.
తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవం 2015, జూన్ 21న 192 దేశాల్లోని 251న నగరాల్లో జరుపుకొన్నారు.
ఒకే వేదికపై నుంచి అత్యధికంగా 35,985 మంది యోగా ప్రదర్శన చేయడం, 84 వేర్వేరు దేశాలకు చెందిన అత్యధిక మంది ఒక ప్రదేశంలో యోగా కార్యక్రమంలో పాల్గొనడం అనే రెండు అంశాల్లో గిన్నిస్ బుక్ రెండు ప్రపంచ రికార్డులు కట్టబెట్టింది.

Check Also

రేష్మి ‘అంతం’ ట్రైలర్ విడుదల

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా ఎదిగేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్న రేష్మి ఇటీవల ‘అంతం’ అనే చిత్రంలో నటించింది. కెరీర్ ...

Comment on the article