Breaking News

ప్రజల పండుగలు ప్రభుత్వ పండుగలుగా…

 

– రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

బాన్సువాడ, జూన్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పండుగలను ప్రభుత్వ పండుగలుగా ప్రభుత్వ యంత్రాంగం ఆద్వర్యంలో నిర్వహిస్తూ పేదలకు అండగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం బాన్సువాడలోని తహసీల్‌ కార్యాలయం ఆవరణలో ఇమామ్‌లకు, మౌజన్‌లకు గౌరవ వేతనం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ 632 మందికి వెయ్యి రూపాయల చొప్పున 11 నెలలకు గౌరవ వేతనం చెక్కులు పంపినీ చేస్తున్నామని, మరో 302 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయన్నారు. ఇంకా అర్హులుంటే దరఖాస్తులు చేసుకుంటే పరిశీలించి మంజూరు చేస్తామన్నారు. 24వ తేదీన బాన్సువాడలో నియోజకవర్గ స్థాయిలో మార్కెట్‌ యార్డులో ప్రభుత్వం తరఫున ముస్లిం పెద్దలకు దుస్తులు అందించి ఇఫ్తార్‌ విందు ఇవ్వనున్నామన్నారు. జిల్లాస్థాయిలో 26వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి రెండు మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలను మంజూరు చేయడం జరిగిందని, బాన్సువాడకు బాలికల పాఠశాల, కోటగిరికి బాలుర పాఠశాల మంజూరు చేశామన్నారు. 5 ఎకరాల స్థలాల్లో ఒక్కోదానికి 20 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇల్లులేని వారందరికి త్వరలోనే రెండు పడకగదులు ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు జేసి రాజారాం, ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్‌, మైనార్టీ సంక్షేమాధికారి కిషన్‌, వక్ప్‌ బోర్డు అధ్యక్షుడు సుల్తాన్‌, ఉద్యానవనశాఖ డిడి సునంద, తదితరులు పాల్గొన్నారు.

Check Also

లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో దుప్పట్ల పంపిణీ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇందూర్‌ ఆద్వర్యంలో శుక్రవారం రాత్రి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *