Breaking News

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ

 

నందిపేట, జూన్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత పదిహేను రోజుల క్రితం నందిపేట మండల కేంద్రంలో వానమూలంగా గోడకూలి అక్కడికక్కడే మృతి చెందిన జోర్‌పూర్‌ గ్రామానికి చెందిన రమాదేవి, ప్రవీణ్‌ కుటుంబ సభ్యులను బుధవారం ఎమ్మెల్సీ ఆకుల లలిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం కొరకు ప్రయత్నం చేస్తామన్నారు. ఆమె వెంట కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బండి నర్సాగౌడ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పెంట ఇంద్రుడు, లోక హన్మాండ్లు, చిన్నదొడ్ల కిషోర్‌, తదితరులున్నారు.

Check Also

కువైట్‌ నుంచి హైదరాబాద్‌కు

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల కవిత కృషితో కువైట్‌ నుండి ...

Comment on the article