Breaking News

గర్భిణీలకు, బాలింతలకు పోషకాహారం అందించాలి

 

బీర్కూర్‌, జూన్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గర్భిణీలకు, బాలింతలకు పోషకాహారం అందించాలని బీర్కూర్‌ ఎంపిపి మల్లెల మీణ హన్మంతు అన్నారు. మండలంలోని నసురుల్లాబాద్‌ అంగన్‌వాడి కేంద్రాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. మొదటగా అంగన్‌వాడి కేంద్రంలోగల రిజిష్టర్లను పరిశీలించారు. ఆహారపదార్థాల నిలువ విషయాన్ని అంగన్‌వాడి కార్యకర్తను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార పదార్థాలకు గర్భిణీలకు, బాలింతలకు అందించాలని, రోజువారి గుడ్లు వారికి సమకూర్చాలని ఆమె సూచించారు. నసురుల్లాబాద్‌ అంగన్‌వాడి సెంటర్‌ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Check Also

ఖరీఫ్‌ యాక్షన్‌ ప్లాన్‌ సిద్దం చేయాలి

నిజామాబాద్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన ప్లాన్‌ యాక్షన్‌ తయారు ...

Comment on the article