కొనసాగుతున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం

 

నందిపేట, జూన్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 13వ విడత ఉచిత గాలికుంటు నివారణ కార్యక్రమంలో భాగంగా బుధవారం వెల్మల్‌, బజార్‌ కొత్తూరు గ్రామాల్లో వ్యాధి నివారణ టీకాలు వేసినట్టు పశువైద్యాధికారి లక్కారం ప్రభాకర్‌ తెలిపారు.

ఇందులో భాగంగా వెల్మల్‌ తెరాస నాయకులు కోటజాన్‌, కంచెట్టి, సంతోష్‌ పాల్గొన్నారు. వెల్మల్‌ గ్రామంలో గ్రామ పెద్దలు అందించిన తోడ్పాటు అభినందనీయమని పేర్కొన్నారు. ఇదేవిధంగా ప్రతి గ్రామంలో అందరూ నిలబడి పశుసంవర్ధకశాఖ సిబ్బందికి సహకరించాలన్నారు. ప్రజలు తమ తమ ఆవులు, ఎద్దులు జంగిటిలోనికి పంపకుండా ఇంటివద్దే ఉంచి టీకా వేసిన తరువాతే వదలాలని పశువైద్యాధికారి కోరారు.

Check Also

మహిళల భద్రతపై విద్యార్థులకు అవగాహన

రెంజల్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళల భద్రత కోసం నా భద్రత నా పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *