Breaking News

ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పించాలి

 

కామారెడ్డి, జూన్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని గురువారం ఏఐటిఎస్‌యు ఆద్వర్యంలో ఉప విద్యాధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాసంవత్సరం ప్రారంభమై పక్షం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందని పరిస్థితి నెలకొందన్నారు. కనీసం మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యా ప్రయివేటీకరణవైపే మొగ్గుచూపుతుందని విమర్శించారు. ప్రభుత్వం విద్యారంగాన్ని పటిష్టం చేయాలని, కెజి నుంచి పిజి ఉచిత విద్యను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు జబ్బర్‌ నాయక్‌, సాయికృష్ణ, రవి, ఫయాజ్‌, రమేశ్‌, రాజు, ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

పందులను నివారించ లేరా?

నందిపేట్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ గ్రామంలో ఏముంది ..ఒకవైపు అపరిశుభ్ర వాతావరణం.. మరోవైపు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *