Breaking News

ఆ సైన్యంలో రేప్‌లు ఆచారమట!

సిడ్నీ: ఆస్ట్రేలియా సైన్యంలో ఓ దురాచారం కాదు, ఘోరాచారం అమల్లో ఉంది. ఆ సైన్యంలో కొత్త చేరిన వారిని ఆడ, మగ తేడా లేకుండా సీనియర్లు రేప్ చేస్తారు. పలు విధాలుగా లైంగికంగా వేధిస్తారు. పైగా ఇది తరతరాలుగా వస్తున్న ఆచారమని, అది తమ హక్కని, తమ గ్రూపులో చేరాలంటే ఇలాంటివన్ని తప్పవని వాదిస్తారు.

1960వ దశకం నుంచి 2000 సంవత్సరం వరకు వందలాది మంది న్యూ రిక్రూట్స్ ఇలాంటి బాధలు పడుతూ వచ్చారు. సైన్యంలో కొనసాగుతూ వచ్చిన ఈ జాడ్యాన్ని రూపుమాపేందుకు ఎట్టకేలకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా దర్యాప్తు కోసం ఓ రాయల్ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడా కమిషన్ పాత కేసులన్నింటినీ తిరగతోడుతోంది. బాధితులు వచ్చి తమ బాధలను కమిషన్ ముందు వెల్లడించాల్సిందిగా రాయల్ కమిషన్ పిలుపునిచ్చింది.

ఈ పిలుపునందుకున్న బాధితుల్లో 111 మంది తమ అనుభవాలను వివరించేందుకు ముందుకు వచ్చారు. బాధితుల్లో ఎక్కువ మంది ఇప్పటికే రిటైరయ్యారు. బాధించిన వాళ్లలో ఎక్కువ మంది  రిటైర్డ్ అవడమే కాకుండా చనిపోయారు కూడా. వారి సాక్ష్యాధారాలను రాయల్ కమిషన్ నమోదు చేస్తోంది. కొన్ని రోజుల క్రితం ప్రారంభమైన ఈ విచారణ జూలై ఒకటవ తేదీ వరకు కొనసాగనుంది.

రాయల్ కమిషన్ ముందు హాజరైన బాధితుల అనుభవాలు వారి మాటల్లోనే….‘ఒక్కసారి కాదు. అనేక సార్లు. అర్ధరాత్రి సీనియర్లు వచ్చి నన్ను బెడ్ మీది నుంచి లాక్కెళ్లే వాళ్లు. నన్ను రేప్ చేసేవాళ్లు, నాతోని ఇతరులను రేప్ చేయించేవాళ్లు. వారి ముందు నో అనడానికే వీలు లేని పరిస్థితి. నాకన్నా ముందు ఎంతోమంది ఈ లైంగిక వేధింపుల గురించి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే వారిపై ఎలాంటి చర్య తీసుకోకపోగా, అది వారి ఆచారమని, తమ గ్రూపులో కలుపుకునేందుకు చనువుగా వ్యవహరించడమని చెప్పేవారు’ అని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ బాధితుడు చెప్పారు.

‘అది 1967. అప్పుడు నా వయస్సు 16 ఏళ్లు. నౌకాదళంలో కొత్తగా చేరాను. షవర్ కింద స్నానం చేస్తున్న నన్ను బలవంతంగా లాక్కుపోయారు. దారుణంగా కొట్టారు. ముగ్గురు కొత్త రిక్రూట్స్‌తో నన్ను రేప్ చేయించారు. ఒకరు నన్ను ఓరల్ సెక్స్‌కు ఒత్తిడి చేశాడు. ఒప్పుకోనందుకు నా జననాంగంపై బూట్ పాలిష్ పోసి బ్రష్‌తో రాశారు. ఆ తర్వాత నేను ఎంతో మానసికంగా కృంగిపోయాను’ అని గ్రామీ ఫ్రాజర్ అనే వృద్ధుడు వివరించారు. ఇలా బాధితులు తమకు జరిగిన ఘోరాలను వివరించారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *