Breaking News

గేటు లోపలకు వచ్చిన నాగుపాము.. తోక పట్టుకుని గిరగిరా తిప్పేసిన కుక్క.. ఆ తర్వాత ఏమైంది?

శునకాలకు విశ్వాసం ఎక్కువన్న విషయం అందరికీ తెలిసిందే. యజమానుల పట్ల వాటికున్న విశ్వాసానికి సాటిలేదు. దొంగలు, ఆచూకీ తెలియని వ్యక్తుల్ని ఇంటిపక్కకు కూడా శునకాలు చేర్చవు. కానీ దొంగలకు బదులు ఓ పాము ఇంట్లోకి చొరబడాలని చూస్తే శునకాలు అడ్డుకున్న ఘటన తమిళనాడు, ధర్మపురిలో చోటుచేసుకుంది.
ఈ వివరాలను పరిశీలిస్తే… ధర్మపురి జిల్లాలోని వెల్లలాపట్టి అనే గ్రామంలోని ఓ ఇంటికి సమీపంలో నాగుపాము వచ్చింది. గేటులో ప్రవేశించింది. అంతే కుక్కలు ఆ పామును అడ్డుకున్నాయి. పామును చూసి అరవడం ప్రారంభించిన కుక్కలతో పాము కూడా పోరాడింది. నాగుపామును ఇంట్లోకి వెళ్లనీయకుండా ముందుగా ఓ కుక్క మాత్రమే అడ్డుకుంటే.. ఆపై మరో రెండు శునకాలు సైతం దానికి తోడై పామును ఆటాడుకున్నాయి.
వీటిలో ఓ శునకమైతే పాము తోకను పట్టుకుని గిరగిరా తిప్పేసింది. అప్పటికీ ఆ నాగుపాము శునకాలపై పడగవిప్పి కరిచేందుకు ప్రయత్నించింది. కానీ ఆ పాము శునకం బారిన పడక తప్పలేదు. చివరికి శునకం కరిచి ఆ పాము చనిపోయింది. ఇప్పటివరకు ఆ కుక్క ఏడు పాములను ఇలా కరిచి చంపిందని స్థానికులు చెప్తున్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *