Breaking News

తేనెటీగల దాడిలో ఏడుగురికి తీవ్ర గాయాలు

నిజాంసాగర్: కామారెడ్డిలోని అశోక్‌నగర్ కాలనీకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని, హసన్‌పల్లి గ్రామానికి చెందిన మరొకరిపై ఆదివారం నిజాంసాగర్ మండలం హెడ్‌సులూస్ వద్ద తేనె టీగలు దాడి చేశాయి. బాధితులు ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే… అశోక్‌నగర్ కాలనీకి చెందిన చాకలి లక్ష్మీనారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి మండలంలోని హెడ్‌సులూస్ వద్ద పండగ చేసుకుందామని ఆదివారం మద్యాహ్నం వచ్చారు. పరిసర ప్రాంతాల్లో ఒక చెట్టు కింద వంటలు చేసుకుంటున్న సమయంలో పొగ పైకి లేచింది.

అదే చెట్టుపై ఉన్న తేనెపట్టు పెట్టుకున్న తేనెటీగల గుంపు ఒక్కసారిగా లేచి చెట్టు కింద ఉన్న వారందరినీ చుట్టుముట్టి దాడి చేశాయి. లక్ష్మీనారాయణతో పాటు ఆయన భార్య రుక్కవ్వ, అల్లుడు కాశీనాథ్, వదిన సంగమ్మ, కుమారుడు ప్రసాద్, మనుమరాలు అమీన్‌పై దాడి చేశాయి. హసన్‌పల్లి గ్రామానికి చెందిన సాయిలుపై సైతం దాడి చేశాయి. బాధితులు కేకలు వేయడంతో స్థానికులు 108కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వీరంతా ఎల్లారెడ్డి ప్రభుత్వ దవఖానలో చికిత్స పొందుతున్నారు. వీరిలో రుక్కవ్వ,ప్రసాద్,అమీన్‌పై తేనెటీగలు దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఇదే ప్రాంతంలో పండుగ జరుపుకుంటామని బాధితులు పేర్కొన్నారు. చాకలి లక్ష్మీనారాయణ కామారెడ్డి ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు కుటుంబీకుల ద్వారా తెలిసింది.

Check Also

22న రాష్ట్రస్థాయి గణిత పరీక్ష

కామారెడ్డి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణిత ప్రతిభ పరీక్షల పోస్టర్‌ను కామారెడ్డి జిల్లా జాయింట్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *