Breaking News

హైకోర్టు సిజె దిష్టిబొమ్మ దగ్దం

 

కామారెడ్డి, జూన్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయమూర్తుల యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ కామారెడ్డిలో సోమవారం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో హైకోర్టు సిజె దిష్టిబొమ్మ దగ్దం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైకోర్టులో ఆంధ్రా జడ్జిల ఆప్షన్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణలో న్యాయమూర్తులు, న్యాయవాదులు చేస్తున్న నిరసనలకు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను బాధ్యులను చేస్తూ సస్పెండ్‌ చేయడం సమంజసం కాదన్నారు. 120 మంది జడ్జిలు మూకుమ్మడి రాజీనామాలు చేసి యూనియన్‌ బాధ్యులకు ఇస్తే దానికి ప్రతీకారంగా వారిని సస్పెండ్‌ చేయడం గర్హణీయమన్నారు. వెంటనే సస్పెండ్‌ను ఎత్తివేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఆంధ్రా న్యాయమూర్తులు తమ ఆప్షన్‌ను విరమించుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ప్రతినిదులు క్యాతం సిద్దిరాములు, గోవిందరావు, నారాయణ, గంగాధర్‌, శంకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో దుప్పట్ల పంపిణీ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇందూర్‌ ఆద్వర్యంలో శుక్రవారం రాత్రి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *