సమాజం బాగుంటే అందరూ బాగుంటారని నమ్మె మ న దేశంలో అందరి ఐక్యతకు పవిత్ర మాసం నాంది అన్నారు. ముస్లిములు ఉపవాసం ఉండి అల్లాహ్ను ప్రార్థిస్తే కరుణించి అందరినీ చల్లగా చూస్తారని తెలిపారు. ప్రభుత్వం అధికారికంగా ఇఫ్తార్ విందు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. సర్కా రు రాష్ట్రంలోని 200 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తోందని, సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రారంభించారని గుర్తు చేశారు. రంజాన్ మాసం సందర్భంగా జిల్లాలోని 2 లక్షల మం ది పేదలకు ప్రభుత్వం దుస్తులు పంపిణీ చేస్తోందన్నారు.
రాష్ట్రం అన్ని వర్గాల ప్రజల మతాలను సమానంగా గౌరవించి ముఖ్యమంత్రి వారి పండుగలను సర్కారు పండుగలుగా నిర్వహించి దేశానికి ఆదర్శంగా నిలిచినట్లు చెప్పారు. పవిత్ర మాసం లో ముస్లిములు చేసిన ప్రత్యేక ప్రార్థనలతో ఈ ఏడాది సంమృద్ధిగా వర్షాలు కురుస్తాయన్నారు. ప్రజల సహకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్నట్లు చె ప్పారు. మైనార్టీల సంక్షేమానికి తమ సర్కారు ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు.
షాదీ ముబారక్ పథకం కింద పేద ఆడపిల్లల పెళ్లిళ్ల కానుకగా 51000 రూపాయలు అందిస్తున్నామన్నారు. కలెక్టర్ యోగితారాణా మాట్లాడుతూ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలతో పేదలు లబ్ధి పొందే విధంగా చూడాలన్నారు. మంచి మనస్సుతో ప్రార్థిస్తే కో రికలు తీరుతాయన్నారు. ప్రభుత్వం ముస్లిముల సంక్షేమం కో సం అనేక పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మైనార్టీల కోసం జిల్లాలో గురుకుల పా ఠశాలలను ఏర్పాటు చేశారని తెలిపారు. అనంతరం పేదలకు దుస్తులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, జిల్లా పరిషత్తు చైర్మన్ దఫేదార్ రాజు, నగర మేయర్ ఆకుల సు జాత, ఎస్పీ విశ్వప్రసాద్, డిప్యూటీ మేయర్ ఫహీం, ఆర్డీవో యాదిరెడ్డి, మైనార్టీ సంక్షేమాధికారి విజయ్ కుమార్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు నవీద్ ఇక్బాల్, ఎస్ఎ అలీం, తారీక్ అన్సా రి, ఖురేషి, అబ్బు, అక్బర్, అక్తర్, కార్పొరేటర్లు చాంగుబాయి, రియాజ్, కార్యకర్తలు, త దితరులు పాల్గొన్నారు.

Latest posts by NizamabadNews OnlineDesk (see all)
- డయల్ 100కు 2271 ఫోన్ కాల్స్ - October 10, 2018
- ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - October 10, 2018
- బహుజనులు ఐక్యం కావాలి - October 10, 2018