Breaking News

సాగు పద్ధతులు అద్భుతం

ఆర్మూర్ రూరల్ : అంకాపూర్ రైతులు పంటల సాగులో పా టించే పద్ధతులు అద్భుతంగా ఉన్నాయని కరీంనగర్ జిల్లా రైతులు కొనియాడారు. మండలంలోని అంకాపూర్ గ్రామాన్ని ఆదివారం కరీంనగర్ జిల్లా మాడిమాడ్ల రైతుల బృందం సందర్శించింది. సందర్శన రైతులు మొదట గురడిరెడ్డి రైతు సంఘంలో ఆ సంఘం కార్యదర్శి కేకే. భాజన్నతో సమావేశమై పంటల సాగు పద్ధతులను తెలుసుకున్నారు. అనంతరం క్షేత్రస్థాయికి వెళ్లి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంకాపూర్ రైతులు వ్యవసాయాన్ని మొక్కుబడిగా కాకుండాక్రమశిక్షణతో చేస్తున్నారన్నారు. పంట పొలాల్లో, గట్ల మీద కలుపు మొక్కలే లేవని తెలిపారు. కలుపు నివారణ నిక్కచ్చిగా చేయడంతోనే అధిక దిగుబడులు సాధిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల చంద్రమౌళి, పల్కం మల్లేశ్, దాపుల అశోక్, రాజేశం, అంజి, రత్తయ్య, లింబాద్రి, నారాయ ణ, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

22న రాష్ట్రస్థాయి గణిత పరీక్ష

కామారెడ్డి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణిత ప్రతిభ పరీక్షల పోస్టర్‌ను కామారెడ్డి జిల్లా జాయింట్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *