Breaking News

Daily Archives: June 28, 2016

కోర్టుకు తాళం వేసి న్యాయవాదుల నిరసన

  కామారెడ్డి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయమూర్తుల సస్పెన్షన్‌లపై నిరసన వ్యక్తం చేస్తూ మంగళవారం కామారెడ్డిలో న్యాయవాదులు కోర్టుకు తాళం వేసి బైఠాయించారు. కక్షిదారులు కోర్టు సిబ్బంది, పిపి, ఎపిపిలను కోర్టుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. సస్పెన్షన్లను వెంటనే ఎత్తివేయాలని, ఆంధ్రా జడ్జిల ఐచ్చికాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏజే ఉన్నంత వరకు తెలంగాణ న్యాయవ్యవస్థకు న్యాయం జరగదని నినాదాలు చేశారు. ఐచ్చికాలకు వ్యతిరేకంగా న్యాయమూర్తుల ఫెడరేషన్‌ తీసుకున్న నిర్ణయంతో కామారెడ్డిలో పనిచేస్తున్న ఇద్దరు న్యాయమూర్తులు సెలవుపై వెళ్లారు. ...

Read More »

మహాసభలను విజయవంతం చేయాలి

  కామారెడ్డి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ బీడీ అండ్‌ సిగార్‌ వర్కర్స్‌ యూనియన్‌ మొదటి రాష్ట్ర మహాసభలను కామారెడ్డిలో నిర్వహించనున్నామని, ఇది విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.రమ, రాష్ట్ర అధ్యక్షుడు సిద్దిరాములు కోరారు. మంగళవారం కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. సిఐటియు అనుబంధ తెలంగాణ బీడీ అండ్‌ సిగార్‌ యూనియన్‌ విజయవంతమైన నేపథ్యంలో జూలై 2న కామారెడ్డి ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆగష్టు 19, 20 తేదీల్లో కామారెడ్డిలో రాష్ట్ర మహాసభలు ...

Read More »

ఆర్‌ఎస్‌పిలో చేరిన సిపిఎం నాయకులు

  కామారెడ్డి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెవల్యుషనరీ సోషలిస్టు పార్టీలో మంగళవారం పలువురు సిపిఎం కార్యకర్తలు చేరారు. ఆర్‌ఎస్‌పి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రరాజేశ్‌ సమక్షంలో వారు పార్టీలో చేరినట్టు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్‌ఎస్‌పి పనితీరునచ్చి, పోరాటాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. పార్టీలో చేరిన కొత్త నర్సింలు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా సిపిఎం పార్టీకి సేవలందిస్తున్నామన్నారు. పార్టీలో జరుగుతున్న ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ ఆర్‌ఎస్‌పిలో చేరినట్టు తెలిపారు. వీరిలో చిన్నసాయిలు, మిద్దెసాయిలు, ...

Read More »

డిసెంబరు కల్లా పెద్దపల్లి రైల్వే లైన్‌ పనులు పూర్తి

  – వినియోగదారులకు మరింత చేరువలో సేవలు – రైల్వే ఎడి ఆర్‌ఎం రాజ్‌కుమార్‌ కామారెడ్డి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈయేడాది డిసెంబరు కల్లా నిజామాబాద్‌ – కరీంనగర్‌ పెద్దపల్లి రైల్వే లైను పనులు పూర్తవుతాయని హైదరాబాద్‌ డివిజన్‌ రైల్వే ఎడి ఆర్‌ఎం రాజ్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం ఆయన కామారెడ్డి రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. వినియోగదారులకు చేరువలో సేవలందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలో ఎటిఎం మాదిరిగా ఆటోమెటిక్‌ టికెట్‌ ...

Read More »

ప్రయివేటు పాఠశాలల దోపిడిని అరికట్టాలి

  కామారెడ్డి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడిని అరికట్టాలని మంగళవారం గిరిజన విద్యార్థి సంఘం నాయకులు కామారెడ్డి ఉపవిద్యాధికారి బలరాంకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ఇన్‌చార్జి వాసు నాయక్‌ మాట్లాడుతూ విద్యారంగాన్ని వ్యాపార రంగంగా మారుస్తున్న ప్రయివేటు పాఠశాలల దోపిడిని అడ్డుకోవాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ప్రేమ్‌దాస్‌నాయక్‌, పండరి సింగ్‌, రాజు, సతీష్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విదానాలపై పోరాటం

  కామారెడ్డి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని ఇందులో భాగంగా జూలై 23న కార్మిక మహా ప్రదర్శన చేపట్టనున్నామని తెలంగాణ రాష్ట్ర బిఎంఎస్‌ అధ్యక్షుడు మల్లేశం అన్నారు. కామారెడ్డిలో మంగళవారం నిర్వహించిన బిఎంఎస్‌ జిల్లాస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులందరికి కనీస వేతనంగా రూ. 18 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత, ఇఎస్‌ఐ, పిఎఫ్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ...

Read More »

పట్టపగలు దొంగల స్వైరవిహారం

  కామారెడ్డి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని అశోక్‌నగర్‌ కాలనీలో పట్టపగలే దొంగలు స్వైరవిహారం చేశారు. సంతోష్‌ అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి ఉండడంతో దొంగలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువా తాళాలు సైతం పగులగొట్టారు. 20 వేల నగదు దోచుకెళ్లినట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిఐ శ్రీనివాస్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు.

Read More »

జూలై 6న ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటాలి

  మోర్తాడ్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు హరితహారం పథకంలో భాగంగా జూలై 6వ తేదీన జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటేలా విద్యార్థులకు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు అవగాహన కల్పించి కృషి చేయాలని ప్రోగ్రాం అధికారి నర్సయ్య, ఎంఇవో రాజేశ్వర్‌లు అన్నారు. మంగళవారం మోర్తాడ్‌ విద్యావనరుల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాద్యాయులకు హరితహారంపై అవగాహన కల్పించారు. తెరాస ప్రభుత్వం ఎంతో ప్రతిస్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం జూలై 2న ప్రారంభిస్తున్నట్టు ...

Read More »

హత్య కేసులో నిందితురాలి అరెస్టు

  కామారెడ్డి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తన పిల్లలను బావిలో పారవేసి హత్యచేసిన కేసులో నిందితురాలిని పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు కామారెడ్డి రూరల్‌ సిఐ కోటేశ్వర్‌రావు తెలిపారు. కామారెడ్డి మండలం గర్గుల్‌ గ్రామానికి చెందిన రజిత, భార్యభర్తల మధ్య నెలకొన్న మనస్పర్థలు, గొడవల కారణంగా తన పిల్లలతో పాటు ఏప్రిల్‌ 17న ఆత్మహత్యకు ఒడిగట్టింది. ఈ క్రమంలో పిల్లలు మృతి చెందగా రజిత బయటపడింది. మంగళవారం ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సిఐ తెలిపారు.

Read More »

ఈనెల 30న ఉపాధ్యాయుల మహాధర్నా

  మోర్తాడ్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయుల సమస్యలపరిష్కారానికై ఈనెల 30న హైదరాబాద్‌లో జరిగే ఉపాధ్యాయుల మహాధర్నాకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని మండల టీఎస్‌ యుటిఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు దండు గంగాధర్‌, శంకర్‌లు అన్నారు. మంగళవారం మోర్తాడ్‌లో ఛలో హైదరాబాద్‌ మహాధర్నా గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు పిఆర్‌సి బకాయి వేతనాలు అందించాలని, హెల్త్‌ కార్డులు, మోడల్‌ స్కూలు ఉపాధ్యాయులకు పిఆర్‌సి అమలు చేయాలని, పాత విధానమే ఉపాధ్యాయులకు వర్తింపజేసి ...

Read More »

గ్రామసమాఖ్య నూతన కార్యవర్గం ఎన్నిక

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సుల్తాన్‌నగర్‌ గ్రామసమాఖ్య నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని ఐకెపి సిసి విఘ్నేశ్వర్‌గౌడ్‌ తెలిపారు. మండలంలోని సుల్తాన్‌నగర్‌ గ్రామంలో గ్రామ సమాఖ్య సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సమాఖ్య అధ్యక్షురాలిగా ఏర్ల ప్రభావతి, ఉపాధ్యక్షురాలిగా లలిత, కార్యదర్శిగా షేక్‌ మహమూదా, సహాయ కార్యదర్శిగా శారద, కోశాధికారిగా అసీఫా బేగం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. సమావేశానికి ఐకెపి ఎపిఎం రాంనారాయణగౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వయం సహాయక ...

Read More »

పశువులకు టీకాలు వేయించాలి

  మోర్తాడ్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో గల పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి పాడి పశువులను, పశు సంపదను రైతులు కాపాడుకోవాలని పశుసంవర్ధకశాఖ రాష్ట్ర పరిశీలక అధికారి భిక్షపతి, జిల్లా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శంకర్‌లు అన్నారు. మంగళవారం మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో నిర్వహిస్తున్న గాలికుంటు వ్యాధి టీకాల పరిశీలనకు విచ్చేసి అనంతరం గ్రామ రైతులతో అధికారులు మాట్లాడారు. వర్షాకాలంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లేత గడ్డి తినడం వల్ల పశువులు రోగాల బారిన పడతాయని, పశువులను ...

Read More »

విధులు సక్రమంగా నిర్వహించండి

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ రెవెన్యూ అధికారులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని తహసీల్దార్‌ హైమద్‌ అబ్దుల్‌ గనిఖాన్‌ అన్నారు. తహసీల్‌ కార్యాలయంలో డిప్యూటి తహసీల్దార్‌ సయ్యద్‌ హైమద్‌ మస్రూల్‌ ఇన్‌చార్జిగా ఉండడంతో ఆయన నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నిర్వహించిన విఆర్వోల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థానికంగా అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో ఆర్‌ఐ సయ్యద్‌ హుస్సేన్‌, విఆర్వోలు, జూనియర్‌ ...

Read More »

ఉచిత కంటి వైద్య శిబిరం

  బీర్కూర్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్కూర్‌ గ్రామంలో లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ బీర్కూర్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటి సంబంధిత వ్యాధులు గలవారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. మోతిబిందు గలవారికి బోధన్‌, నిజామాబాద్‌ లయన్స్‌ ఆసుపత్రులకు రిఫర్‌ చేసినట్టు సభ్యులు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని బీర్కూర్‌ గ్రామంలో ప్రతి మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు, మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ...

Read More »

తహసీల్‌ కార్యాలయానికి చేరిన రంజాన్‌ దుస్తులు

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయానికి ముస్లింలకు పంపిణీ చేసేందుకు దుస్తులు చేరాయని నూతన తహసీల్దార్‌ హైమద్‌ అబ్దుల్‌ గని ఖాన్‌ తెలిపారు. కార్యాలయంలో నూతన తహసీల్దార్‌ బాధ్యతలను స్వీకరించి ఆయన విలేకరులతో మాట్లాడారు. మండలానికి వందజతల దుస్తులు వచ్చాయని, అర్హులైన నిరుపేద ముస్లింలకు పంపిణీ చేస్తామన్నారు.

Read More »

హరితహారంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలి

  బీర్కూర్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలని ఎంపిడివో భరత్‌కుమార్‌ అన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో గల 49 పాఠశాలల ఉపాధ్యాయులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ది అధికారి మాట్లాడుతూ ఒక్కో పాఠశాలకు సంబందించి ఒక్కో ఉపాధ్యాయుడు ఆయా పాఠశాలల ఆవరనలో మొక్కలు నాటేవిధంగా చర్యలు చేపడుతూ సంరక్షణ బాద్యత తీసుకోవాలని అన్నారు. మొక్కలు నాటేవిధానంపై మండల అభివృద్ది కార్యాలయం ...

Read More »

మధ్యాహ్న భోజన ఏజెన్సీకి మూడు దరఖాస్తులు

  రెంజల్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని స్థానిక జడ్పిహెచ్‌ఎస్‌లో మధ్యాహ్న భోజన ఏజెన్సీ ఖాళీ ఉంది. దీంతో మంగళవారం ఏజెన్సీ నిర్వహణ కొరకు నిర్వాహకులు తమ దరఖాస్తులు తహసీల్దార్‌కు సమర్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ వెంకటయ్య మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం జడ్పిహెచ్‌ఎస్‌లో భోజన ఏజెన్సీ నిర్వహణ ఖాళీ ఏర్పడిందని, వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపతహసీల్దార్‌ వినయ్‌ సాగర్‌, ఆర్‌ఐ క్రాంతికుమార్‌ తదితరులున్నారు.

Read More »

లీటర్ గోమూత్రంలో తులం బంగారం..

గోమూత్రం అంటే భారతీయులకు ఎనలేని గౌరవం. కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో గోమూత్రం ఉండాల్సిందే. ఇప్పుడు మరోసారి గోమూత్రం ప్రత్యేకత బయటపడింది. గోమూత్రంలో ఔషధ గుణాలే కాదు బంగారం ఉందని చెబుతున్నారు గుజరాత్ పరిశోధకులు. జునాగఢ్ అగ్రికల్చరల్ యూనివర్శిటి పరిశోధకుడు డాక్టర్ బీఏ గోలకియా ఈ ప్రయోగం చేశారు. సుమారు 400 గిర్ జాతికి చెందిన ఆవుల మూత్రాలను పరిశీలించారు. లీటర్ మూత్రాన్ని సేకరించి పరిశీలించగా మూడు నుంచి 10 గ్రాముల బంగారం ఉన్నట్లు పరిశోధనలో తేలింది. ఈ బంగారం అయాన్ల రూపంలో ఉన్నట్లు చెబుతున్నారు ...

Read More »

పప్పు కూర

కావలసినవి పొట్టుతీయని పెసరపప్పు: పావుకిలో, పచ్చిమిర్చి: ఆరు, అల్లం: అంగుళం ముక్క, నెయ్యి: టేబుల్‌స్పూను, పసుపు: టీస్పూను, చిన్న ఉల్లిపాయలు: పది, వెన్న: 2 టేబుల్‌స్పూన్లు, తాలింపుకోసం: నెయ్యి: టీస్పూను, ఎండుమిర్చి: నాలుగు, లవంగాలు: టీస్పూను, కొత్తిమీర: కట్ట తయారుచేసే విధానం * పాన్‌లో పెసరపప్పు, తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. తరవాత ఉల్లిపాయలు, సన్నగా చీల్చిన పచ్చిమిర్చి, అల్లం తురుము వేసి ఉడికించాలి. ఇప్పుడు పసుపు, వెన్న వేసి కలపాలి. * విడిగా బాణలిలో నెయ్యి వేసి ఎండుమిర్చి ముక్కలు, లవంగాలు, వెల్లుల్లి ...

Read More »

శ్రీనగర్‌ ఘాతుకం

జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో ఎనిమిది మంది భద్రతాసిబ్బంది మరణించిన ఘటన అత్యంత విషాదకరమైనది. ఈ అతిపెద్ద దాడి ఏ అర్ధరాత్రో జరిగింది కాదు. శిక్షణకు హాజరైన సిబ్బందిని వెనక్కు తెస్తున్నప్పుడు సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు వాహనంపై ఇద్దరు ఉగ్రవాదులు తెగబడి జరిపినది ఇది. నలభైమంది సిబ్బంది ప్రయాణిస్తున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను, పాటించవలసిన నియమాలను బేఖాతరుచేసిన కారణంగానే మరొక పాతికమంది తీవ్రంగా గాయపడ్డారు. జమ్ముకాశ్మీర్‌ అసెంబ్లీలో ‘పాకిస్థాన ముర్దాబాద్‌’ అంటూ బీజేపీ ప్రతినిధులు నినాదాలు చేయడం, ఈ దేశాన్ని అస్థిరపరచడానికి పొరుగుదేశం కంకణం కట్టుకుందంటూ హోంమంత్రి ...

Read More »