Breaking News

గర్భధారణను నిర్ధారించే స్మార్ట్‌ఫోన్ యాప్

వాషింగ్టన్: కుటుంబ నియంత్రణ పాటించడానికో.. లేదా ఆరోగ్య సమస్యలను అధిగమించే క్రమంలో గర్భం దాల్చకుండా ఉండటానికి మహిళలు సాధారణంగా గర్భ నిరోధక మాత్రలు ఉపయోగించడం తెలిసిందే. మారుతున్న కాలానికనుగుణంగా, ప్రస్తుత స్మార్ట్ యుగంలో టెక్నాలజీ వాడకాన్ని గుర్తించి.. గర్భధారణను నిర్ధారించే డాట్ (డైనమిక్ ఆప్టిమల్ టైమింగ్) అనే యాప్‌ను అమెరికాలోని సైకిల్ టెక్నాలజీ అనే సంస్థ తయారు చేసింది. మహిళల రుతుస్రావ చక్రం వివరాల ఆధారంగా ఎప్పటికప్పుడు కచ్చితమైన సమాచారాన్ని యాప్ వెల్లడిస్తుంది. రుతుస్రావ ప్రారంభ తేదీని మహిళలు యాప్‌లో నిక్షిప్తం చేస్తే, దానిని బట్టి గర్భం వచ్చే అవకాశముందా, లేదా అనే విషయాన్ని ప్రతిరోజు యాప్ తెలుపుతుంది. పలు అధ్యయన నివేదికల ఫలితాల ఆధారంగా ఈ యాప్‌ను తయారు చేశారు. దీనిని సరైన రీతిలో ఉపయోగిస్తే 98 శాతం మేర ఫలితాన్ని సాధించవచ్చనే విషయాన్ని అమెరికాలోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీప్రొడక్షన్ హెల్త్ (ఐఆర్‌హెచ్) పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు.

Check Also

ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి జిల్లా లోకల్‌ అథారిటీ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ...

Comment on the article