Breaking News

Daily Archives: July 9, 2016

ఘనంగా ఏబివిపి ఆవిర్భావ దినోత్సవం

  భీమ్‌గల్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ భీమ్‌గల్‌ శాఖ ఆధ్వర్యంలో 67వ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ లక్ష్మణ్‌ పాల్గొని ఎస్సీ, బిసి వసతి గృహంలో మొక్కలు నాటి నీరుపోశారు. జిల్లా కో కన్వీనర్‌ రాకేశ్‌ మాట్లాడుతూ ఏబివిపి 1949 జూలై 19వ తేదీన ఢిల్లీలోని జవహార్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ లో 10 మంది విద్యార్థులతో ప్రారంభమై దేశవ్యాప్తంగా విస్తరించడం జరిగిందని వివరించారు. ఏబివిపి విద్యారంగ సమస్యలపై ...

Read More »

కోడి మాంసం ధరలకు రెక్కలు

  నందిపేట, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోడి మాంసం ధర కొండెక్కి కూర్చుంది. అటు ఇటుగా మేక మాంసంతో సమానంగా ధర పైకి ఎగబాకుతోంది. మొన్నటి వరకు కొంత అదుపులో ఉన్న చికెన్‌ ధర నెలరోజులుగా పెరుగుతూనే ఉంది. ఆదివారం లేకపోయినా, కనీసం పండగపూట అయిన చికెన్‌ తిందామని ఇష్టపడేవారికి పెరిగిన ధరతో కొనలేని పరిస్థితి నెలకొంది. గత కొద్దిరోజుల క్రితం వరకు కిలో మాంసం ధర రూ. 100 నుంచి రూ. 120 వరకు ఉండేది. గడిచిన ...

Read More »

నిండుతున్న గోదావరి….

  నందిపేట, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండేళ్ళుగా బోసిపోయిన గోదావరి నది ప్రస్తుతం గళగళా పారుతోంది. గత రెండు సంవత్సరాలుగా వానలు లేకపోవడంతో ఎడారిగా మారి పరివాహక ప్రాంతంలోని లిప్టు ఇరిగేషన్‌లన్ని మూతబడడంతో చెరువులు కూడా ఎండిపోయాయి. గతంలో ఇక్కడ వర్షాలు పడకపోయినప్పటికి మహారాష్ట్ర ప్రాంతంలో కురిసిన వర్షాలకు గోదావరి నిండితే ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులు నింపడం, రెండు పంటలకు వాడుకోవడమే గాకుండా బోరుబావుల్లో నీరుకూడా సమృద్ధిగా వచ్చేది. కానీ గోదావరి ఎండిపోవడంతో ఈ ప్రాంతం మొత్తం ...

Read More »

పెన్షన్‌ పరేషానీ…

  నందిపేట, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం వికలాంగులు, వితంతువులు, వృద్దాప్య, బీడీ కార్మికులకు అందించే పెన్షన్లు శనివారం నందిపేట మండల కేంద్రంలోని పోస్టాఫీసులో ప్రారంభమైంది. శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం ముసురుపడడంతో లెక్కచేయకుండా వరుసలో నిలబడి పెన్షన్‌ పొందుతున్నారు. దీంతో తమకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని, వర్సంలో నిలబడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పోస్టాఫీసుకు బదులుగా బ్యాంకు ఖాతాల్లో పెన్షన్‌ డబ్బు జమచేసినట్టయితే వికలాంగులు, వృద్దులకు సౌకర్యంగా ఉంటుందని, అధికారులు ...

Read More »

వర్షంలో సైతం మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు

  మోర్తాడ్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రామన్నపేట్‌, ఏర్గట్ల గ్రామాల్లో శనివారం స్థానిక సర్పంచ్‌లు ఈర్ల లక్ష్మి, కిషన్‌, శ్రీవైష్ణవి, ఉపసర్పంచ్‌లు శోభన్‌, కొలిప్యాక్‌ ఉపేంద్ర, వార్డు సభ్యులు, ఎంపిటిసిలు, నోడల్‌ అధికారులు మండల సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మి, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఉపాధి హామీ కూలీలు శనివారం మొక్కలు నాటారు. పలు గ్రామాల్లో హరితహారం పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో, అంగన్‌వాడికేంద్రాలు, మహిళా భవనాల ముందు, ప్రభుత్వ కార్యాలయాల్లో, వీదుల్లో , రోడ్లపక్కన మొక్కలు ...

Read More »

ఈనెల 12న అన్ని చెరువు కట్టలపై మొక్కలు నాటాలి

  మోర్తాడ్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో గల చెరువు కట్టలపై, కుంటల కట్టలపై ఈనెల 12న ప్రజాప్రతినిదులు, నోడల్‌ అధికారులు, ఆయా శాఖల అధికారులు స్వయం సహాయక గ్రూపు మహిళలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మోర్తాడ్‌ ఎంపిడివో శ్రీనివాస్‌ శనివారం తెలిపారు. హరితహారం పథకం కింద మండలానికి కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ప్రతిరోజు గ్రామాల్లో 2 వేల మొక్కలు నాటాలని ఆదేశించారు. చెరువు కట్టలపై మొక్కలునాటే ...

Read More »

నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు

  మోర్తాడ్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రమైన మోర్తాడ్‌ గ్రామంలోకి బిటి రోడ్డు పునర్‌నిర్మాణానికి మిషన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి నిధులు మంజూరు చేశారని మోర్తాడ్‌ ఉపసర్పంచ్‌ గంగారెడ్డి, తెరాస పట్టణ అధ్యక్షుడు రాజేశ్వర్‌లు తెలిపారు. శనివారం తెరాస కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల ఎమ్మెల్యే పర్యటించిన నేపథ్యంలో మోర్తాడ్‌ గ్రామ రోడ్డు దుస్థితిని చూసి వెంటనే స్పందించి 60 లక్షల నిధులు బిటి రోడ్డు నిర్మాణానికి మంజూరుచేశారని తెలిపారు. ఎమ్మెల్యేకు గ్రామస్తుల ...

Read More »

ఉర్దూ పాఠశాలలో విద్యావాలంటీర్‌కు దరఖాస్తు చేసుకోవాలి

  మోర్తాడ్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ గ్రామంలోగల ఉర్దూ మాద్యమిక, ప్రాథమిక, గోవింద్‌రెడ్డి కాలనీలోగల ఉర్దూ పాఠశాలలో 3 విద్యావాలంటీర్లు మంజూరయ్యాయని, వీటికోసం అర్హతగల అభ్యర్థులు దరకాస్తు చేసుకోవాలని ఎంఇవో రాజేశ్వర్‌ శనివారం తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిఇవో వెబ్‌సైట్‌ ద్వారా ఈనెల 12 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ప్రింట్‌ కాపీని ఎంఇవో కార్యాలయంలో అందజేయాలని చెప్పారు. ఈ అవకాశాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read More »