Breaking News

Daily Archives: July 10, 2016

లయన్స్‌ క్లబ్‌ ద్వారా అందరికి సేవలందించాలి

  కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ద్వారా నిరుపేదలందరికి సేవలందించాలని క్లబ్‌ పాస్టు కౌన్సిల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ జి.బాబురావు అన్నారు. కామారెడ్డి పట్టణంలో లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కామారెడ్డి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగాముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. మానవ సేవయే మాధవ సేవ అని, క్లబ్‌ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలన్నారు. క్లబ్‌ ఆధ్వర్యంలో రక్తదానం, నేత్రదానం, వైద్య శిబిరాలు, పేద విద్యార్తులకు దుస్తులు, ...

Read More »

ప్రతి ఒక్కరు చెట్లను సంరక్షించాలి

  – డిఎస్పీ భాస్కర్‌ కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో ప్రతి ఒక్కరు చెట్లను సంరక్షించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని కామారెడ్డి డిఎస్పీ భాస్కర్‌ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి డిఎస్‌పి కార్యాలయ ఆవరణలో డిఎస్పి మొక్కలునాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చెట్లను పెంపొందించడంలో భాగంగా ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టిందన్నారు. హరితహారంలో అందరూ భాగస్వాములై పచ్చని ఆహ్లాదకరమైన తెలంగాణ కోసం పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో సిఐలు శ్రీనివాస్‌రెడ్డి, కోటేశ్వర్‌రావు, ఎస్‌ఐలు శోభన్‌బాబు, శోభన్‌, ...

Read More »

వాసవీ క్లబ్‌ ఆధ్వర్యంలో హరితహారం

  కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి వాసవీ క్లబ్‌ ఆధ్వర్యంలో ఆదివారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. డాన్‌ టు డెస్క్‌ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటినట్టు తెలిపారు. వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద 50 మంది పేద విద్యార్థులకు పాఠశాల యూనిఫారాలు, దుప్పట్లు, బియ్యం పంపిణీ చేశారు. జేబిఎస్‌ పాఠశాలలోని 50 మంది పేద విద్యార్థులకు ప్లేట్లు, పెన్నులు, పుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షుడు మహేశ్‌గుప్త, క్లబ్‌ ఇంటర్నేషనల్‌ అడిషనల్‌ సెక్రెటరీ రేణికుంట శ్రీనివాస్‌, ప్రతినిధులు ...

Read More »

మెహెర్‌బాబా భక్తుల అన్నదానం

  కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెహెర్‌బాబా 91వ మౌన వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి పట్టణంలో ఆదివారం మెహెర్‌బాబ పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మౌన వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మౌనవ్రతం నిర్వహించారు. మౌనం ద్వారా జ్ఞానం, మేధస్సు, శక్తి పెరుగుతుందని భక్తులు అన్నారు. 500 మందికి అన్నదానం చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో భక్తబృందం రమేశ్‌, ప్రభు, రాజేశం, శ్రీనివాస్‌, అంజయ్య, ప్రభాకర్‌, నర్సింలు, లలిత, మాధవి తదితరులు పాల్గొన్నారు.

Read More »

మాల్యా రావాల్సిందే..

న్యూఢిల్లీ: ఫెరా అతిక్రమణ కేసులో విజయ్‌ మాల్యాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఢిల్లీ కోర్టు రద్దు చేసింది. మాల్యా తప్పనిసరిగా కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టం చేసింది. సెప్టెంబర్‌ 9లోపు మాల్యా కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. 2000 సంవత్సరంలో తాము జారీ చేసిన సమన్లు అందుకునేందుకు నిరాకరించడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేటట్‌ (ఇడి) మాల్యా పై కోర్టుకు ఫిర్యాదు చేసింది. ఫార్ములా వన్‌ రేసులో కింగ్‌ఫిషర్‌ లోగో ప్రదర్శించేందుకు 2 లక్షల డాలర్లు చెల్లించాడన్న ఆరోపణలపై ఇడి మాల్యాకు ...

Read More »

గల్ఫ్‌ ప్రవాసీయులకు అండగా ఉంటాం : కేటీఆర్

ఎన్‌ఆర్‌ఐ పాలసీపై ఈ నెల 16న సమావేశం తెలంగాణలో ఉపాధి కల్పనకు ప్రయత్నిస్తాం ఓవర్‌సీస్‌ మ్యాన పవర్‌ కంపెనీని విస్తరిస్తాం 250 మందికి వీసాలందించిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం నుంచి ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లిన వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఎనఆర్‌ఐ శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరు అందించేలా ప్రాజెక్టుల నిర్మాణం, మిషన భగీరథ వంటి పథకాలను చేపట్టామని ...

Read More »

నవయుగపు రారాణి

లండన్‌: అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్‌ అదరహో అనిపించింది. వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌లో ఏడోసారి విజేతగా నిలిచింది. ప్రతిష్టాత్మక టోర్నీ ఆసాంతం అసాధారణ ఆటతీరుతో అలరించిన డిఫెండింగ్‌ చాంప్‌ సెరెనా శనివారం జరిగిన తుదిపోరులో 7-5, 6-3తో వరుస సెట్లలో నాలుగో సీడ్‌ ఏంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ)ను ఓడించింది. తద్వారా కెరీర్‌లో 22వ గ్రాండ్‌స్లామ్‌ నెగ్గి ఓపెన్‌ ఎరాలో అత్యధిక టైటిళ్లు నెగ్గిన స్టెఫీగ్రాఫ్‌ (జర్మనీ) సరసన చేరింది. ఓవరాల్‌గా 24 గ్రాండ్‌స్లామ్స్‌తో అగ్రస్థానంలో ఉన్న ఆస్ర్టేలియా దిగ్గజం మార్గరెట్‌ కోర్ట్‌ను అందుకునేందుకు రెండు ...

Read More »

ఈ ఫొటోలో దెయ్యం ఎక్కడ ఉంది?

ఇప్పుడు మీరు చూస్తున్న ఫొటో 1900 సంవత్సరంలోనిది. ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్ నగరంలో  ఒక మిల్లులో పనిచేసే యువతులందరూ కలిసి దిగిన ఫొటో ఇది. అది సరే, మరి ఈ దెయ్యం గోల ఏమిటి? విషయం ఏమిటంటే, ‘దెయ్యాలు ఉన్నాయి’, ‘లేనే లేవు’ అనుకునే వాళ్లు ఈ ఫొటోను చూస్తూ రెండు వర్గాలుగా చీలిపోయారు. ఎవరి వాదనలు వారు గట్టిగా వినిపిస్తున్నారు. గోల ఎక్కడ మొదలైందంటే… మూడో వరుసలో చివరన కూర్చున్న అమ్మాయి భుజం మీద చెయ్యి కనిపిస్తుంది. వ్యక్తి మాత్రం కనిపించరు. ఇది చాలదా ...

Read More »

‘అమ్మాయిలు నాకు రాఖీ కట్టలేదు’

న్యూఢిల్లీ : తనకు ఇప్పటి వరకూ ఎవ్వరూ రాఖీ ఆఫర్ చేయలేదని బాలీవుడ్ నటుడు, ‘బ్రదర్స్’ ఫేమ్ సిద్ధార్థ్ మల్హోత్రా అన్నాడు.  ఈ నెల 14న విడుదలై విజయాన్ని అందుకున్న ‘బ్రదర్స్’లో అక్షయ్‌కుమార్, సిద్ధార్థ మల్హోత్రా అన్నదమ్ములుగా నటించిన విషయం తెలిసిందే. సిద్ధార్థ గుడ్ లుక్ చూసి అమ్మాయిలు ఎవరూ తనకు రాఖీ కట్టలేదోమో అన్నాడు. ఈ నెల 29న హిందువుల పండుగ రాఖీ. అయితే ఇతరులలా తన చేతి రంగు రంగుల రాఖీలతో నిండే అవకాశం లేదని అభిప్రాయపడ్డాడు. ఓ విలేకరి అడిగిన ...

Read More »

ఐఎస్ఐఎస్ కుత్తేలోగ్ (కుక్కలు)… మా బస్తీలో జీహాద్ చేయండి… అసదుద్దీన్ ఫైర్

ఐస్ఐఎస్ ఉగ్రవాదులు, ఉగ్రవాద చర్యలపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులంటే మనుషులు కాదంటూ చెప్పిన అసదుద్దీన్, వారు నరకం నుంచి వచ్చిన కుత్తేలోగ్ (కుక్కలు) అంటూ ఆవేశంతో ఊగిపోయారు. జీహాద్ అనే పదానికి వారికి అర్థమేమిటో తెలుసా అని ప్రశ్నించారు. జీహాద్ అంటే సేవ చేయడమని చెప్పారు. జీహాద్ అంటే ఎందరో అమాయకుల ప్రాణాలను కబళించడం కాదని అన్నారు. హైదరాబాదు, దారుస్సలాంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో తీవ్రవాదం, ఉగ్రవాదంపై ఆయన మాట్లాడారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ...

Read More »

పొలంలో బయటపడ్డ బంగారం

సాలూరు: వ్యవసాయ భూమిలో బంగారు నిధి వెలుగు చూసిన సంఘటన విజయనగరం జిల్లాలో చర్చనీయాంశమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి భూమిని లీజుకు తీసుకుని సాగు చేస్తున్న శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాలిలా వున్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన సమీర్‌కు విజయనగరం జిల్లా పాచిపెంట మండలం శ్యామలగౌరీపురంలో కొంత భూమి ఉంది. దానిని విజయనగరం జిల్లా సాలూరు పట్టణానికి చెందిన శ్రీనివాసరెడ్డి లీజుకు సాగుచేస్తున్నారు. గత శుక్రవారం వరకు భూమిని అభివృద్ధి చేసేందుకు ...

Read More »

11 ఏళ్ల బాలుడికి ఐన్‌స్టీన్ అంత ఐక్యూ!

నాగ్‌పూర్ : అఖిలేశ్ చందోర్కర్ అనే 11 ఏళ్ల నాగపూర్ బాలుడికి ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్ అంతటి ఇంటెలిజెంట్ కోషియంట్(ఐక్యూ) ఉందని మెన్సా జరిపిన పరీక్షలో తెలిసింది.ఇతని ఐక్యూ రికార్డు స్థాయిలో 160 ఉంది. ఇది ఐస్‌స్టీన్, హాకింగ్‌ల ఐక్యూతో సమానం. జైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివే అఖిలేశ్, విహారయాత్రకోసం కుటుంబంతో కలసి జూన్‌లో స్కాట్లాండ్ వెళ్లాడు. ఐక్యూ పరీక్ష మెన్సా రాశాడు. ‘నాకు 160 స్కోర్ వస్తుందని అనుకోలేదు. 140 స్కోర్ వస్తుందనుకున్నా. ఫలితాలకోసం ప్రతిరోజూ మెయిల్ చూసేవాడిని. కానీ మెన్సా నుంచి ...

Read More »

స్ఫూర్తిమంత్రం

వ్యక్తిత్వ వికాస గ్రంథ రచయిత శివ్‌ ఖెరా సుప్రసిద్ధ గ్రంథం ‘యు కెన్‌ విన్‌’ అట్టమీద ఒక ఆంగ్ల వాక్యం ఉంటుంది. ‘విజేతలు మనకన్నా వేరే విభిన్నమైన పనులు చేయరు… మనం చేసే పనులనే విభిన్నంగా చేస్తారు’ అన్న ఆ చిన్నవాక్యం ఎన్నో కోట్లమందికి ఎంతగానో స్ఫూర్తినిచ్చింది. విజేతలుగా మార్చింది. ‘ఈసురోమని మనుజులుంటే దేశమేగతి బాగుపడునోయి?’ అన్న గురజాడ వెన్నుచరుపు ఈ జాతిని జలదరింపజేసింది. ‘కదం తొక్కుతూ పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ పదండి పోదాం వినపడలేదా మరో ప్రపంచపు జలపాతం’ అన్న శ్రీశ్రీ ...

Read More »

కల్లోల కశ్మీరం

శ్రీనగర్‌: ఉగ్రవాదసంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌వాని ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో కశ్మీర్‌లోయ శనివారం కల్లోల కశ్మీర్‌గా మారింది. కశ్మీర్‌ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. భద్రతాదళాలకు ఆందోళనకారులకు మధ్య జరిగిన హింసాత్మక ఘటనల్లో 11 మంది మరణించారు. 126 మంది గాయపడ్డారు. వీరిలో 96 మంది భద్రతాదళాలకు చెందిన జవాన్లు. ఆందోళనకారులు ప్రభుత్వ కార్యాలయాలకు, పోలీసు స్టేషన్లకు, వాహనాలకు నిప్పుపెట్టారు. కశ్మీర్‌వ్యాప్తంగా పలుప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. ఉద్రిక్తతలకు కేంద్రంగా ఉన్న దక్షిణ కశ్మీర్‌లో సెల్‌ఫోన్‌ సేవలపైనా ఆంక్షలను అమలుపరిచారు. ...

Read More »

జాగ్రత్తగా వెళ్లిరండి..!

పిల్లలు బడికి వెళ్లేటప్పుడు ఇంట్లో కచ్చితంగా జాగ్రత్తగా వెళ్లిరా.. అని చెబుతుంటారు. అలా చెప్పడం వరకే పరిమితమైతే సరిపోదు. వారు జాగ్రత్తగా వెళ్లిరావడం మన చేతుల్లోనే ఉంది. గత నెల 15న ప్రారంభమైన బడుల బండి ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో పట్టాలెక్కుతోంది. గతంలో పిల్లలను సొంత ద్విచక్ర వాహనాలపై బడికి తీసుకెళ్లి దింపి వచ్చే తల్లిదండ్రులు ఉద్యోగాలు, ఇతర వ్యాపకాలతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. పేరుగాంచిన పాఠశాల అయితే ఎంత దూరమైనా పంపడానికి వెనుకాడటం లేదు. ఇంటి దగ్గర పాఠశాల ఉన్నా అది బాగా లేదంటే ...

Read More »

మొక్కలతో నేతకు నివాళి

నాందేడ్‌: కమ్యూనిష్టు నాయకుడు, కార్మికులకోసం పోరాటం చేసిన కామ్రేడ్‌ అనంతరావు నాగపూర్‌కర్‌ జయంతి సందర్బంగా నగరంలోని పలుచోట్ల వివిధ స్థాయి నేతలు, కార్యకర్తలు మొక్కలు నాటారు. నగరంలోని లేబర్‌ కాలనీ, లేబర్‌ కాలనీ హనుమాన్‌ మందిరం, ప్రజావాణి కార్యాలయం పరిసరాల్లో మొక్కలు నాటారు. శివానంద్‌ రాహేగాంకర్‌, ప్రదీప్‌ నాగాపూర్‌కర్‌ చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంబించారు. ఒకే రోజున 101 మొక్కలను నాటారు.

Read More »

కొలమానం… అనుమానం!

వర్షపాత నమోదు ఆధారంగానే కరవు అంచనాలు, బీమా చెల్లింపుల ప్రయోజనాలు ఉంటాయి. ఏ ప్రాంతంలో ఎంత వర్షం కురిసిందనేది రోజువారీగా గణాంక అధికారులు ఇచ్చిన నివేదికల ద్వారానే అధికార యంత్రాంగం, పాలకులు పరిస్థితులను అంచనా వేస్తారు. దానికనుగుణంగా వ్యవసాయశాఖ కూడా పంటల సాగుపై ప్రణాళికలను రూపొందిస్తుంటుంది. అలాంటి ఉపయోగాలున్నా వర్షపాతం నమోదు ఎంతవరకు పారదర్శకంగా ఉంటుందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గణాంక శాఖలో చాలీచాలని సిబ్బంది ఉండడం, ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన వర్షమానిల పర్యవేక్షణ అంతంతమాత్రంగా ఉండటంతో చినుకుల లెక్కల్లో చిక్కులు తప్పడం ...

Read More »

నేడు జిల్లాకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాక

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆదివారం జిల్లా కేంద్రానికి వస్తున్నారు. కరీంనగర్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొని 11 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి నిజామాబాద్‌కు 2 గంటలకు చేరుకుంటారు. జిల్లా కేంద్రంలోని వైద్యకళాశాల అనుబంధ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన క్యాన్సర్‌ నిర్ధరణ కేంద్రం, పిల్లల కోసం అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన ఎన్‌ఐసీ విభాగాన్ని మంత్రి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా జిల్లా ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటుతారు. అనంతరం వైద్య కళాశాలకు వెళ్లి అక్కడ ...

Read More »

ఆ గుర్తు కథేంటి? ,

ప్రశ్న: ఆసుపత్రులు, అంబులెన్స్‌లు, వైద్యుల కార్లపై ఎర్రని ప్లస్‌ (+) గుర్తు ఉంటుంది కదా? దాని అర్థమేంటి? జవాబు: తెల్లని నేపథ్యంలో ఎర్రని ప్లస్‌ గుర్తు ఉంటే అది అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ సంస్థ చిహ్నం. కొందరు ప్లస్‌ చుట్టూ గుండ్రని వలయం గీస్తారు. అప్పుడది రెడ్‌క్రాస్‌ చిహ్నం కాదు. నాలుగుసార్లు నోబెల్‌ శాంతి బహుమతి పొందిన రెడ్‌క్రాస్‌ సంస్థ, స్విట్జర్లాండ్‌ దేశస్థుడైన హెన్రీ డునాంట్‌ యుద్ధ సైనికులకు చికిత్స చేసే విధానాలపై రాసిన పుస్తకం ప్రేరణగా కొందరు 1863లో జెనీవాలో స్థాపించినది. అప్పట్లో తరచూ ...

Read More »

పొగకు కళ్లు మండుతాయేం?

ప్రశ్న: పొగ కళ్లలోకి వెళ్లినపుడు కళ్లు మండుతాయి. ఎందుకని? జవాబు: పాక్షికంగా మండిన ఇంధనం వల్లనే పొగ వస్తుంది. ‘నిప్పు లేనిదే పొగరాదు’ అన్న సామెత సబబే అయినా నిప్పున్నంత మాత్రాన పొగ రావాల్సిన అగత్యం లేదు. నిప్పులకు సరిపడినంత ఆక్సిజన్‌ దొరికితే పొగ లేకుండానే నిప్పులు మండగలవు. పచ్చిగా ఉన్న వంట చెరకు, తడిగా ఉండే బొగ్గులు, మలినగ్రస్తమైన తారు తదితర పెట్రోలియం ఇంధనాలు, ప్లాస్టిక్కులు, రబ్బరులు, కిరోసిన్‌ దీపాలు, గాలి సరిగా సరఫరా కాని కిరోసిన్‌ పొయ్యిలు, సిగరెట్లు, బీడీలు పొగల్ని ...

Read More »