Breaking News

Daily Archives: July 14, 2016

అన్ని వసతి గృహాల్లో మొక్కలు నాటాలి

  మోర్తాడ్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డివిజన్‌ పరిధిలోని బాల్కొండ, ఆర్మూర్‌ నియోజకవర్గాల్లోగల అన్ని వసతి గృహాల్లో వార్డెన్లు మొక్కలు నాటింపజేయాలని డివిజన్‌ సహాయ సంచాలకుల సంక్షేమ అధికారి దేవేందర్‌ అన్నారు. గురువారం బాల్కొండ, ఆర్మూర్‌ నియోజకవర్గాల్లోని పలు వసతి గృహాలను సందర్శించి రికార్డులను, గదులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ వసతి గృహాల్లో మొక్కలు నాటేందుకు ఉపాధి కూలీలతో గుంతలు తవ్వించేందుకు ఆయా మండలాల తహసీల్దార్లతో, ఎంపిడివోలతో చర్చించారు. వార్డెన్లు మొక్కలు నాటడంలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన ...

Read More »

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి

  మోర్తాడ్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని జడ్పిటిసి, ఆయా మండలాల సర్పంచ్‌లు కోరారు. గురువారం మోర్తాడ్‌లోని ఎస్సీ, బిసి కాలనీలో సాయిబాబా ఆలయ ఆవరణలో పలు ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు గుంతల తవ్వకాల పనులు జోరందుకున్నాయి. తొర్తి గ్రామంలో గ్రామాభివృద్ది కమిటీ సమావేశమై ఇంటికొకరు చెట్లు నాటాలని తీర్మానించడంతో వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో, పెద్దమ్మ ఆలయం వద్ద, ప్రభుత్వ భూముల్లో, స్మశాన వాటికలో గురువారం గ్రామస్తులు 5 ...

Read More »

గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలందించాలి

  మోర్తాడ్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉత్తమ ర్యాంకులు సాధించడమే గాకుండా ఉద్యోగాలు పొంది గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలందిస్తు గ్రామానికి, మండలానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గడ్డంలింగారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని తాళ్ల రాంపూర్‌ గ్రామంలో మండల కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలో మెడిసిన్‌లో ర్యాంకులు సాధించిన తాళ్ల రాంపూర్‌ గ్రామానికి చెందిన క్యాతం అఖిల్‌, ఏర్గట్ల గ్రామానికి చెందిన కొలిప్యాక్‌ రాజేశ్‌లను పూలమాలలు, జ్ఞాపికలతో ...

Read More »

హరితహారం పనుల పట్ల ఏజేసి అసంతృప్తి

  మోర్తాడ్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి, బల్కొండ మండలాల్లో గురువారం అదనపు జాయింట్‌ కలెక్టర్‌ రాజారాం ఆయా గ్రామాల్లో గల నర్సరీలను అకస్మాత్తుగా సందర్శించారు. హరితహారం పథకం కింద జరుగుతున్న గుంతల తవ్వకాలను, మొక్కలు నాటుతున్న తీరును ఆయన పరిశీలించారు. అనంతరం మోర్తాడ్‌ తహసీల్‌ కార్యాలయాన్ని సందర్శించి నియోజకవర్గంలోని ఐదు మండలాల హరితహారం పనుల రికార్డులు పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు గురువారం వరకు మొక్కలునాటే లక్ష్యాన్ని ...

Read More »

బిఎస్‌ఎన్‌ఎల్‌ ఆధ్వర్యంలో హరితహారం ర్యాలీ

  కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం కార్యక్రమంలో భాగంగా గురువారం కామారెడ్డి పట్టణంలోని బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. హరితహారం గురించి వివరిస్తూ బ్యానర్లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా బిఎస్‌ఎన్‌ఎల్‌ డిఇ కృష్నమూర్తి మాట్లాడుతూ కామారెడ్డి డిఇ కార్యాలయంతో పాటు కార్యాలయ పరిధిలోని దోమకొండ, భిక్కనూరు, ఎల్లారెడ్డి కార్యాలయాల్లో చెట్లు నాటినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరు రెండు మొక్కలు నాటి హరితహారాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌డిఇ ఆంజనేయులు, సిబ్బంది ...

Read More »

కార్మికులు ఎంప్లాయిస్‌ యూనియన్‌ను గెలిపించాలి

  – ఇయు రాష్ట్ర అధ్యక్షుడు బాబు కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఎస్‌ ఆర్టీసిలో ఈనెల 19న జరగనున్న యూనియన్‌ ఎన్నికల్లో కార్మికులు ఎంప్లాయిస్‌ యూనియన్‌ను గెలిపించాలని ఇయు రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.బాబు అన్నారు. యూనియన్‌ ఎన్నికల్లో భాగంగా కామారెడ్డి ఆర్టీసి డిపో కార్యాలయం ఆవరణలో నిర్వహించిన కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఐక్య ఉద్యమాల సారది ఎంప్లాయిస్‌ యూనియన్‌ బస్సు గుర్తుకు కార్మికులు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆర్టీసి పరిరక్షణ జరగాలన్నా, ...

Read More »

తెరాసలో పలువురి చేరిక

  కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ సమక్షంలో గురువారం పలువురు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎంపిటిసి శంకర్‌గౌడ్‌, రైతుమిత్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు పలువురు శాబ్దిపూర్‌ గ్రామానికి చెందిన నాయకులు తెరాసలో చేరారు. కార్యక్రమంలో గోపిగౌడ్‌, ప్రభాకర్‌రెడ్డి, లక్ష్మాగౌడ్‌, రామాగౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

విద్యాసంస్థల బంద్‌ విజయవంతం

  కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్‌ విజయవంతమైంది. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి అరుణ్‌కుమర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో కనీస మౌలిక వసతులు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కెజి నుంచి పిజి విద్య అని చెప్పి నేడు హామీని విస్మరించిందని విమర్శించారు. ఉచిత విద్యను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ...

Read More »

పందుల బెడద

  నందిపేట, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో రోజురోజుకు పెరుగుతున్న పందుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నందిపేట మండల కేంద్రం కావడంతో రోజురోజుకు కొత్త కొత్త కాలనీలో ఏర్పడుతున్నాయి. దీంతో జనాభా విస్తరించడంతోపాటు సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా పారిశుద్యం లోపించడంతో పందుల బెడద అన్ని వాడల్లో పెరిగిపోయింది. పాలకవర్గం, కార్యదర్శి నిర్లక్ష్యంతో పందుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోయి అన్ని వాడల్లో పెరుగుతున్నాయి. దీంతో అపరిశుభ్ర వాతావరణం ఏర్పడుతుందని స్థానికులు ఆందోళన ...

Read More »

అమెరికాలో కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాను కలిసిన తెవివి రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి

  డిచ్‌పల్లి, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమెరికాలోని కాన్సులర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా యూసప్‌ సయ్యద్‌ను తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అమెరికాలో కలిశారు. ఆయనతోపాటు చికాగో స్టేట్‌ యూనివర్సిటీ ప్రతినిధులు రోహన్‌ అట్లే, రావ్‌ అచంట లు కూడా భారత కాన్సులర్‌ జనరల్‌ను కలిశారు. ఈ సందర్బంగా ఆచార్య లింబాద్రి మాట్లాడుతూ అమెరికాకు వచ్చే అణగారిన, పేద వర్గాల పిల్లలకు ఆర్థిక సాయం అందించడానికి కౌన్సిలర్‌ జనరల్‌ నుంచి నిధులు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. విద్యారంగంలో, ...

Read More »

10 వేల చెట్లు నాటడమే లక్ష్యం

  నందిపేట, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట ఎస్‌ఐ జాన్‌రెడ్డి, ప్రొబిషనరీ ఎస్‌ఐ వినయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసుల దత్తత గ్రామమైన వన్నెల్‌ (కె)లో హరితహారంలో భాగంగా 10 వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్దేశించుకొని గత మూడురోజులుగా ప్రతిరోజు వాడవాడలా మొక్కలు నాటుతున్నారు. గురువారం సర్పంచ్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటి నీరుపోశారు. ఇంటింటికి మొక్కలు నాటాలని అన్నారు. సర్పంచ్‌ గంగాసాగర్‌ ఉన్నారు.

Read More »

వాడ వాడలా హరితహారం

  నందిపేట, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం పచ్చదనాన్ని పరుచుకుంటుంది. చిన్న, పెద్ద తేడా లేకుండా వాడవాడలా ఉద్యమంలా హరితహారం కొనసాగుతుంది. వనభారతికి చేయి చేయి కలిపి ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారానికి మండలంలో ఊహించనిదానికంటే మంచి స్పందన లభిస్తుంది. ఎమ్మెల్యే మొదలుకొని ఉద్యోగులు, విద్యార్థులు ప్రతి ఒక్కరు హరితహారంలో భాగస్వాములవుతున్నారు. బుధవారం మండలంలోని వెల్మల్‌, నందిపేట పాలిటెక్నిక్‌ కాలేజీలో తెరాస నియోజకవర్గ ఇన్‌చార్జి రాజేశ్వర్‌రెడ్డి మొక్కలు నాటి నీరుపోశారు. హరితహారంలో అందరు భాగస్వాములు ...

Read More »

సేంద్రీయ ఆహారం

సేంద్రీయ ఆహారాల ఉత్పత్తిలో సంశ్లేషిత పదార్థాల వాడకంను పరిమితం లేదా పూర్తిగా నివారిస్తుంది. మానవ చరిత్ర యెక్క అధిక భాగం కొరకు, వ్యవసాయంను సేంద్రీయంగా వర్ణించవచ్చు; 20వ శతాబ్ద సమయంలో పెద్ద మొత్తంలో నవీన సంశ్లేషిత రసాయనాలను ఆహార సరఫరాలోకి పరిచయం చేశారు. ఉత్పత్తి యెక్క ఇటీవలి శైలిని “సాంప్రదాయకమైనది”గా సూచిస్తారు. సేంద్రీయ ఉత్పత్తిలో, సాంప్రదాయ అసేంద్రీయ తెవులు నాశకాలు, పురుగుల నాశకాలు మరియు గుల్మనాశకాల యెక్క వాడకంను అమితంగా పరిమితం చేశారు మరియు దానిని కడాపటి చర్యగా భావించారు. అయినప్పటికీ, అట్లాంటి అసేంద్రీయ ఎరువులను ...

Read More »

విరామం తీసుకున్న ముసురు…

  నందిపేట, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో గత నాలుగురోజులుగా జిల్లా వ్యాప్తంగా, నందిపేట మండలంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. భారీ వర్షాలు కాకపోయినా విరామం లేకుండా చినుకులు శనివారం నుంచి సోమవారం వరకు కురిశాయి. మండలంలోని పల్లెలు, మండల కేంద్రం రోడ్లు చిత్తడిగా మారింది. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమానికి హారతి పట్టినట్టయింది. దీంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు వేగంగా చేపట్టారు. మరోపక్క వర్షాలు ఆశాజనకంగా కురియడంతో వ్యవసాయ పనుల్లో వేగం పుంజుకుంది. ...

Read More »

దాడిచేసిన నలుగురిపై కేసు నమోదు

  నందిపేట, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని సిహెచ్‌ కొండూరు గ్రామానికి చెందిన బొడ్డు దేవగౌడ్‌పై దాడిచేసిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదుచేసినట్టు నందిపేట ప్రొబిషనరీ ఎస్‌ఐ వినయ్‌ కుమార్‌ తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం… బొడ్డు దేవగౌడ్‌ సొంత పొలంలో పక్క పొలానికి చెందిన నారాయణ గట్టు దాటి దున్నుతున్నాడని దేవగౌడ్‌ వారించాడు. దీంతో ఆగ్రహించిన నారాయణ నీఅంతుచూస్తానని దుర్బాషలాడుతూ వ్యవసాయ పనిముట్టుతో దాడిచేశాడు. అంతేగాకుండా నారాయణ తన ముగ్గురు సహచరులతో కలిసి దాడిచేశాడని దేవగౌడ్‌ ...

Read More »

కామారెడ్డిలో వాడవాడలా హరితహారం…

  కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహరం కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలనుంచి విశేష స్పందన లభిస్తోంది. కార్యక్రమంలో అందరు భాగస్వాములవుతున్నారు. వాడవాడలా మొక్కలు నాటుతున్నారు. బుధవారం సైతం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఎస్సీ వాడ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు 150 మొక్కలు నాటారు. 8వ వార్డు రాజీవ్‌నగర్‌ కాలనీలోని ప్రభుత్వ ఉర్దూ మీడియం ప్రైమరీ పాఠశాలలో మొక్కలు నాటి నీరుపోశారు. బిజెపి ఆధ్వర్యంలో గొల్లవాడలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ...

Read More »