Breaking News

తెవివి వసతి గృహాల సమీక్ష సమావేశం

 

డిచ్‌పల్లి, జూలై 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసతిగృహ విద్యార్థులకు సంబంధించిన అడ్మిసన్లు, రికార్డులు, దరఖాస్తు ఫారాలు, అడ్మిషన్‌ పీజులు, డిపాజిట్లు తదితర విషయాలపై శుక్రవారం తెవివిలో సమీక్షించారు. ఈ మేరకు ప్రిన్సిపాల్‌ ఆచార్య కనకయ్య రికార్డులను పరిశీలించారు. రానున్న విద్యాసంవత్సరానికి విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొత్తగా ప్రారంభం కాబోయే హాస్టల్‌తో సహా అన్ని వసతి గృహాలు శుభ్రం చేసి ఉంచాలని, అలాగే యుజిసి నుంచి ప్రత్యేకంగా బాలికల కోసం వసతి గృహాలకు నిధులు మంజూరు చేయించుకోవాలని, బాలికల వసతి గృహాల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడానికి సిద్దంగా ఉందని పేర్కొన్నారు. గత సంవత్సరం లోటు బడ్జెట్‌ ఉంటే దానికి గల కారణాలు తెలుసుకొని, సమస్య పునరావృతం కాకుండా సిబ్బంది పనిచేయాలని సూచించారు. సమావేశంలో హాస్టల్స్‌ సిబ్బంది కేర్‌ టేకర్‌లు, వార్డెన్లు మహేందర్‌రెడ్డి, సంపత్‌, శాంతాబాయి, సూపరింటెండెంట్‌ విజయలక్ష్మి, ప్రవీణాబాయి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఘనంగా శతజయంతి ఉత్సవాలు ప్రారంభం

నిజామాబాద్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత మాజీ ప్రధాని పి.వి నరసింహ రావు శతజయంతి ...

Comment on the article