Breaking News

బాలయ్య పరమ వేస్ట్… హిందూపురం మహిళ ధ్వజం…

నిన్ననే జనసేన పార్టీని ఎన్నికల సంఘం రద్దు చేయాలంటూ బీసీ సంఘం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సంగతి అలావుంటే తాజాగా నందమూరి నటసిహం, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య మీద ఓ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండిపడింది. అసలు బాలకృష్ణ నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆమె వ్యాఖ్యానించింది.
పేదరికంతో మగ్గుతున్నవారు, ఆర్థిక ఒడుదుడుకులతో నానా అవస్థలు పడుతున్నవారు ఎంతమందో హిందూపురంలో ఉన్నారనీ, వారి సమస్యలను పట్టించుకునే నాధుడే లేడనీ, ఎమ్మెల్యే అయిన బాలయ్య సినిమాల్లో డైలాగులు చెప్పి వెళుతుంటారని విమర్శించింది. ఇలాంటి ఎమ్మెల్యే పరమ వేస్ట్ అంటూ ఆమె చేసిన కామెంట్లతో కూడిన వీడియో ఇపుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.

Check Also

కొత్త వ్యక్తులు వస్తే పోలీసుల‌కు సమాచారం ఇవ్వండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మనం కరోనా అనే కనిపించని శత్రువుతో పోరాడుతున్నామని అనుక్షణం ...

Comment on the article