Breaking News

Daily Archives: July 24, 2016

హరితహారాన్ని విజయవంతం చేయాలి

  కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలందరు కలిసి ప్రభుత్వం తలపెట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన కామారెడ్డి పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ పచ్చదనాన్ని సంరక్షించడంలో భాగంగా ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములై మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని కోరారు. ...

Read More »

యాదవ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండగ

  కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం బోనాల పండగను వైభవంగా నిర్వహించారు. మహిళలు బోనాలు నెత్తిన బెట్టుకొని అశోక్‌నగర్‌ కాలనీలోని బురుగు మైశమ్మ ఆలయం వరకు బోనాల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం బురుగు మైశమ్మతల్లికి బోనాలు సమర్పించారు. వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, అమ్మవారు అందరిని చల్లంగా చూడాలని వేడుకున్నారు. కార్యక్రమంలో యాదవ సంఘం ప్రతినిధులు కృష్ణ యాదవ్‌, శ్రీశైలం యాదవ్‌, ప్రభాకర్‌ యాదవ్‌, నారాయణ, రాజయ్య, చంద్రం, ...

Read More »

మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బోనాల పండగ

  కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పంచముఖి హనుమాన్‌ కాలనీ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం బోనాల పండగ వైభవంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన బోనాలను మహిళలు నెత్తిన బెట్టుకొని ఊరేగించారు. పట్టణంలోని పంచముఖి హనుమాన్‌ ఆలయం నుంచి పాత బస్టాండ్‌, సిరిసిల్లా రోడ్డు, అంగడి బజార్‌ మీదుగా నల్లపోచమ్మ దేవాలయంతో పాటు పెద్దమ్మ గుడి వరకు ఊరేగించారు. అనంతరంగ్రామ దేవతలకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడి పంటలతో అందరు ...

Read More »

మైసమ్మతల్లికి ప్రత్యేక పూజలు

  కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం మైశమ్మ తల్లి వార్సికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని సర్చ్‌ కాంపౌండ్‌ ఎదురుగా గల మైశమ్మ ఆలయాన్ని అందంగా అలంకరించి పూజలు జరిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ యేడు సైతం మైశమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రతినిధులు గంజి సతీష్‌, ...

Read More »

ఘనంగా బోనాల పండగ

  కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని రుక్మిణీ కుంట వాసులు ఆదివారం మైశమ్మ తల్లికి ఘనంగా బోనాల పండగ నిర్వహించారు. రుక్మిణీ కుంటలో మైసమ్మ తల్లిని నెలకొల్పి 25 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీకి చెందిన 200 కుటుంబాల వారు బోనాలు నెత్తినెత్తుకొని ఊరేగింపు నిర్వహించారు. మైశమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ చాట్ల లక్ష్మి, నాయకులు రాజేశ్వర్‌, సునీత, శ్రీనివాస్‌, సుధాకర్‌, శంకర్‌, ...

Read More »

ఘనంగా కెటిఆర్‌ జన్మదిన వేడుకలు

  రెంజల్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఐటి మంత్రి తారకరామారావు జన్మదినాన్నిపురస్కరించుకొని మండల తెరాస నాయకులు షాటాపూర్‌లోని తెలంగాణ చౌరస్తాలో కేక్‌కట్‌ చేసి పంచిపెట్టారు. అనంతరం బిఎస్‌ఎన్‌ఎల్‌ డైరెక్టర్‌ పాశం సాయిలు మాట్లాడుతూ కెటిఆర్‌ ఇలాగే మరిన్నిపదవులు చేపట్టి బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేసి హరిత తెలంగాణ మున్ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెరాస నాయకులు వికార్‌ పాషా, కుర్మె సాయిలు, అఖిల్‌ బేగ్‌, నిసార్‌, ముజాహిద్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

మండలంలో హరిత హారం లక్ష్యాన్ని పూర్తిచేయాలి

  రెంజల్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలో హరితహారంలో భాగంగా 4 లక్షల 40 వేల మొక్కలు నాటి లక్ష్యాన్నిపూర్తిచేయాలని తహసీల్దార్‌ వెంకటయ్య అన్నారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆదేశానుసారం పచ్చని హరితహారం పూర్తిచేయాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరు సహకరించాలని, గ్రామాల్లో ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలు ముందుకొచ్చి లక్ష్యాన్ని పూర్తిచేయాలని, మేట్‌లకు, క్షేత్ర సహాయకులకు ఆయన సూచించారు. తహసీల్దార్‌ వెంట డిప్యూటి తహసీల్దార్‌ వినయ్‌ ...

Read More »

బిసి వసతి గృహానికి ప్రహరీ నిర్మించండి

  నిజాంసాగర్‌ రూరల్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌ సమీపంలో నిర్మించిన బిసి వసతి గృహానికి ప్రహరీ గోడ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిసి వసతి గృహం చుట్టు ప్రహరీగోడ లేక పందులు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు పందులు సంచరించే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల పట్ల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థుల సౌకర్యార్థం కోట్ల రూపాయలు మంజూరు చేసినప్పటకి వసతి గృహానికి ప్రహరీ నిర్మాణానికి ...

Read More »

మొక్కల రక్షణకు కంచె ఏర్పాటు

  నిజాంసాగర్‌ రూరల్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలు కాపాడేందుకు వాటిని కంచె ఏర్పాటు చేశారు. ఉపాధి హామీ ద్వారా కూలీలు నాటిన మొక్కలను కాపాడేందుకు ఈవిధమైన ఏర్పాటు చేయడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలను కాపాడేందుకు ఉపాధి హామీ కూలీలతో ఒక్కో కంచెకు 130 రూపాయలు చెల్లించడంతో కూలీలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కంచె ఏర్పాటు కేవలం ముళ్ల కంపతో మాత్రమే ...

Read More »

బిసి వసతి గృహానికి ప్రహరీ నిర్మించండి

  నిజాంసాగర్‌ రూరల్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌ సమీపంలో నిర్మించిన బిసి వసతి గృహానికి ప్రహరీ గోడ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిసి వసతి గృహం చుట్టు ప్రహరీగోడ లేక పందులు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు పందులు సంచరించే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల పట్ల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థుల సౌకర్యార్థం కోట్ల రూపాయలు మంజూరు చేసినప్పటకి వసతి గృహానికి ప్రహరీ నిర్మాణానికి ...

Read More »

‘ఆధార్’ లేకుంటే జప్తే..!

డ్రైవింగ్ లెసైన్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో పాటు – ఆధార్ కార్డు ఉండాల్సిందే లేకుంటే వాహనం జప్తు.. – సైబరాబాద్ పరిధిలో అమలు! – ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి కోసమే అంటున్న పోలీసులు – ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి – 27 నుంచి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తామన్న ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ హైదరాబాద్ : వాహనాలు నడపాలంటే కనీసం మన దగ్గర ఉండాల్సినవి డ్రైవింగ్ లెసైన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్. అయితే ఈ వాహన పత్రాలతో పాటు ఇకపై ఆధార్ కార్డును కూడా వాహనచోదకులు వెంట ...

Read More »

తెలంగాణ పోలీసులకు అంతర్జాతీయ అవార్డు

‘హాక్‌ ఐ’ కు ప్రథమ బహుమతి  హైదరాబాద్‌,: తెలంగాణ పోలీసులు మరో అరుదైన గౌర వం సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీలో తెలంగాణ పోలీసులు ఉపయోగిస్తున్న ‘హాక్‌ ఐ’ మొబైల్‌ యాప్‌కు బహుమతి లభించింది. దేశ పోలీసింగ్‌లో మొదటి అంతర్జాతీయ అవార్డు తెలంగాణ పోలీసులు సొం తం చేసుకోవడం విశేషం. ఈ యాప్‌ను హైదరాబాద్‌ పోలీసులు ప్రవేశపెట్టారు. ‘7వ బిలియంత అవార్డు-2016’ పోటీలు ఢిల్లీలో నిర్వహించారు. సార్క్‌ దేశాల నుం చి 348 ఎంట్రీలు రాగా అందులో హాక్‌ ఐ మొబైల్‌యాప్‌ ...

Read More »

నేతాజీ విమాన ప్రమాదంలో మరణించలేదా

టీనగర్: నేతాజీ సుభా్‌ష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించలేదని తిరుచ్చిలో ఐఎన్‌ఏ సైనికుడు ఒకరు చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. తిరుచ్చి జోసెఫ్ కళాశాల చరిత్ర విభాగం ఆధ్వర్యంలో మండ్రం ప్రారంభోత్సవం శుక్రవారం జరిగింది. నేతా జీ ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్‌ఏ) దళంలోని సైనికుడు దురైరాజ్ (96) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మలేసియాలో నేతాజీ ఐఎన్‌ఏ కోసం అభ్యర్థులను సేకరించారని, ఆ యన ప్రసంగానికి ఆకర్షితుడినై తనతో సమా 180 మం ది ఐఎన్‌ఏలో చేరామని తెలిపారు. ...

Read More »

డేంజర్ గేమ్..పోకెమాన్ గో..

ప్రపంచాన్ని పిచ్కెక్కిస్తున్న మొబైల్ గేమ్ మొబైల్‌ని చూస్తూ తిరగాల్సి రావటంతో ప్రమాదాలు – తొలిసారి వర్చువల్ రియాలిటీతో అనుసంధానం – రోడ్లపై డ్రైవింగ్‌లోనూ ఆటే; ప్రమాదాలు- పోలీసుల హెచ్చరిక – అమెరికాలో శ్మశానంలో ఇరుక్కున్న మహిళ –  తమను గుర్తుపట్టేశాడని యువకుడిని కాల్చేసిన దుండగులు –  ఇండియాలో మూడునాలుగు రోజుల్లో విడుదల: నింటెండో –  ఇక్కడ విదేశాల మాదిరి రోడ్లపై ఆడితే చాలా ఇబ్బందికరం – మొబైల్ సిగ్నల్స్ కూడా వీక్‌గా ఉంటాయి కనక ఇక్కడ కష్టం – నింటెండో కంపెనీకి కిక్కిచ్చిన గేమ్; ...

Read More »

మళ్లీ నోకియా స్మార్ట్‌ఫోన్లు

ఈ ఏడాది చివరినాటికి మార్కెట్లోకి.. ఫిన్లాండ్‌కు చెందిన టెలీకమ్యూనికేషన్స్‌ దిగ్గజం నోకియా మళ్లీ స్మార్ట్‌ ఫోన్లను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారత్ వంటి వర్ధమాన దేశాల్లో స్మార్ట్‌ఫోన్లకు గిరాకీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ మొబైల్‌ ఫోన్ల మార్కెట్లోకి ప్రవేశించాలని నో కియా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏ డాది చివరినాటికి రెండు ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారిత మొబైల్‌ ఫోన్లను తీసుకురావాలని నోకియా భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ప్రీమియం మెటల్‌ డిజైన్‌, ఐపి68 సర్టిఫికేషన్‌తో ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ...

Read More »

నాన్న కోసం….

అరబ్‌ తండ్రి, పాతబస్తీ తల్లి ఫ చిన్ననాడే స్వదేశానికి వెళ్లిన తండ్రి  తండ్రి ఆచూకీ కోసం 14 ఏళ్లుగా పరితపిస్తున్న కొడుకు   అధికారుల చుట్టూ ప్రదక్షిణలు ఫ వివాహ సర్టిఫికెట్‌లో తండ్రి పీపీ నెం. చార్మినార్‌: నాన్నను చూడాలని ఓ కొడుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. తనకు జన్మనిచ్చిన తండ్రి చిన్పప్పుడే మరో దేశానికి వెళ్లిపోయాడన్న విషయం తెలుసుకున్న ఆ కొడుకు 14 ఏళ్లుగా తండ్రి కోసం ఆరాటపడుతున్నాడు. తన తండ్రిని జీవితంలో ఒక్కసారైనా చూస్తానో లేదోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తండ్రి ఆచూకీ ...

Read More »

ఈ నిర్ణయంతో దటీజ్ కేటీఆర్ అనాల్సిందే..!

మంత్రి ఆదేశాలతో రంగంలోకి జీహెచ్‌ఎంసీ  హైదరా బాద్‌ సిటీ: నాతోపాటు ఎవరి ఫొటోలతో ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, కటౌట్లు ఏర్పాటు చేసినా తొలగించండన్న పురపాలన, పట్టణా భివృద్ధి శాఖ మంత్రి కే.తారక రామారావు తాజా ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ రంగంలోకి దిగింది. ఆదివారం కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్‌ఎస్‌ నేతలు, ఆయన అనుచరులు, అభిమానులు ముందుగానే నగరంలో భారీగా ఏర్పాటుచేసిన ఫెక్సీలు, కటౌట్లను తొలగించారు. శనివారం ఒక్కరోజే అక్రమంగా ఏర్పా టుచేసిన 4వేల ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లను తొలగించామని కమిషనర్‌ డాక్టర్‌ బీ.జనార్దన్‌రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. ...

Read More »

కరుణ లేని మాఫీ

వరుణుడు కరుణించినా ప్రభుత్వం కనికరించడం లేదు! ప్రభుత్వం కనికరించినా బ్యాంకర్లు కరుణించడంలేదు! వెరసి, అన్నదాత మళ్లీ రుణదాత దగ్గరకు పరిగెత్తుకుని వెళ్లక తప్ప ని పరిస్థితి. ప్రైవేటు అప్పులు చేయక తప్పని పరిస్థితి! తెలంగాణవ్యాప్తంగా ఇప్పుడు ఇదే పరిస్థితి. ఇందుకు కారణం రుణమాఫీ పథకం అస్తవ్యస్తంగా మారడమే! ప్రభుత్వం రుణ మాఫీ పథకాన్ని 4 విడతలుగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏడాదికి ఎంతమొత్తం రుణాన్ని మాఫీ చేస్తే బ్యాంకులు కూడా రైతుకు అంతేమొత్తం రుణాలు ఇస్తున్నాయి. రెండేళ్లుగా ఇదేపరిస్థితి నెలకొంది. అంటే, ...

Read More »

ఉద్యోగం కోసం వెళితే.. నగ్న వీడియో తీశాడు

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ తూర్పు ప్రాంతంలోని మయూర్ విహార్లో 65 ఏళ్ల వృద్ధుడు విజయ్కుమార్ను హత్య చేసిన కేసులో నిందితురాలి (25)ని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ ఆధారం, సీసీటీవీ ఫుటేజి సాయంతో నిందితురాలిని గుర్తించినట్టు పోలీసులు చెప్పారు. విజయ్కుమార్ తనపై లైంగికదాడి చేశాడని, తనను నగ్నంగా వీడియో తీశాడని, ఆయనపై ప్రతీకారం తీర్చుకునేందుకు కత్తితో పొడిచి చంపినట్టు నిందితురాలు అంగీకరించింది. రెండేళ్ల క్రితం ఉద్యోగం కోసం ఆయనను కలిస్తే తనను శారీరకంగా వేధించాడని పోలీసులకు చెప్పింది. విజయ్ కుమార్ భార్య వసుంధర ఐటీ ...

Read More »

కృష్ణద్రవ్యం అంటే ఏంటి?,

కృష్ణద్రవ్యం అంటే ఏంటి? ప్రశ్న: కృష్ణ ద్రవ్యము (Dark Matter) అంటే ఏమిటి? జవాబు: ఈ విశాల విశ్వంలో, బ్రహ్మాండాలను (గెలాక్సీలను) ఒకటిగా ఉంచడానికి, అవి గుంపులుగా కదలడానికి ఎంత ద్రవ్యరాశి (Matter)కావాలో గణనలు చేయడం ద్వారా శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. కానీ వారు గమనించిన ద్రవ్యం, విశ్వంలో ఉన్న ద్రవ్యంలో 4 శాతం మాత్రమే. కాబట్టి, ఆ కనిపించని, వెలుగునీయని ద్రవ్యాన్ని డార్క్‌మేటర్‌ (కృష్ణ ద్రవ్యము) అంటారు. ఈ ద్రవ్యము నల్లని మేఘాలు, ధూళి లేక కాలం తీరిన నక్షత్రాల (Dead Stars) రూపంలో ...

Read More »