Breaking News

Daily Archives: July 26, 2016

ఏఎన్‌ఎంల ఆందోళనకు మద్దతు

  కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఏఎన్‌ఎంలు చేస్తున్న ఆందోళనకు తమ మద్దతు తెలుపుతున్నట్టు కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు. ఏఎన్‌ఎంలు మంగళవారం కాంగ్రెస్‌ నాయకులను కలుసుకొని వినతి ప త్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీనియర్‌ నాయకులు నయీమ్‌, కైలాష్‌ శ్రీనివాస్‌రావు, అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ఏఎన్‌ఎంలు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సమంజసం కాదన్నారు. వారి న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరారు. శాసనమండలిలో ...

Read More »

భక్తి శ్రద్దలతో బోనాల పండగ

  కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ శ్రీసూర్యవంశీ ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కట్టమైసమ్మ తల్లికి బోనాల పండగను వైభవంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన బోనాలను మహిళలు నెత్తిన బెట్టుకొని పట్టణంలోని సుభాష్‌రోడ్డు, ధర్మశాల, గోదాము రోడ్డు, బతుకమ్మ కుంట, సైలానిబాబా కాలనీవరకు ఊరేగింపు నిర్వహించి అక్కడగల మైసమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగుండాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ...

Read More »

మల్లన్నసాగర్‌ కోసం తెరాస ఆందోళన

  కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును కట్టాలని పేర్కొంటూ మంగళవారం తెరాస ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. నిజాంసాగర్‌ చౌరస్తా వద్ద మానవహారం, రాస్తారోకో చేపట్టారు. ప్రాజెక్టు అడ్డుకుంటున్న విపక్షాల దిష్టిబొమ్మ దగ్దం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు సాగునీరు కోసం ప్రభుత్వం మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మించాలని చూస్తుంటే విపక్షాలన్ని ఏకమై ప్రాజెక్టును అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం ముంపు గ్రామాలకు సంబందించిన ...

Read More »

మొక్కలు నాటి లక్ష్యాన్ని పూర్తిచేస్తాం

  నిజాంసాగర్‌ రూరల్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ హరితహారం పథకం కింద 6 లక్షల 80 వేల మొక్కలు నాటేందుకు లక్ష్యం కాగా పూర్తిచేస్తామని మండల ప్రత్యేకాధికారి జగన్నాథ్‌ రావు అన్నారు. మండలంలోని ఎంపిడివో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. 14 గ్రామ పంచాయతీల్లో మొక్కలు నాటే కార్యక్రమం వందశాతం పూర్తి చేయడం జరిగిందన్నారు. వీటిలో ఆరేపల్లి, సుంకిపల్లి, సింగీతం గ్రామాల్లో వందశాతం పూర్తి లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. జిల్లాలో నిజాంసాగర్‌మండలం ద్వితీయ స్థానంలో ...

Read More »

నిజాంసాగర్‌లో ఫిజియోథెరఫి

  నిజాంసాగర్‌ రూరల్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని స్థానిక ఎంఆర్‌సి భవనంలో ఫిజియోథెరపి శిబిరం నిర్వహించారు. ఆయా పాఠశాలల్లో 15 మంది వికలాంగ విద్యార్థులకు ఫిజియో థెరపి విధానంలో చికిత్సలు నిర్వహించారు. శిబిరంలో వికలాంగ విద్యార్థులకు వారు చేయాల్సిన వ్యాయామం గురించి డాక్టర్‌ మౌనిక మారె చేసి చూపించారు. కార్యక్రమంలో ఎంఇవో బలరాం నాయక్‌, ఐఆర్‌టియులు సాయిలు, సునీల్‌, తదితరులు ఉన్నారు.

Read More »

హసన్‌పల్లిలో మామిడిమొక్కల పంపిణీ

  నిజాంసాగర్‌ రూరల్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని హసన్‌పల్లి గ్రామానికి హరితహారంలో భాగంగా మంజూరైన మామిడి మొక్కలను స్థానిక సర్పంచ్‌ బత్తుల రమా సంగమేశ్వర్‌గౌడ్‌ ప్రజలకు పంపిణీ చేశారు. గ్రామానికి 200 మామిడి మొక్కలు ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. గ్రామాల్లో ప్రతి కుటుంబానికి ఒక్కో రేషన్‌ కార్డుకు మామిడి మొక్క పంపిణీ చేస్తున్నామన్నారు. మొక్కలను నాటి సంరక్షించాలని కోరారు.

Read More »

అభివృద్దిని అడ్డుకునేందుకే ప్రతిపక్షాల కుట్రలు

  – మాజీ ఎంపిపి రమణాగౌడ్‌ రెంజల్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పార్టీ అభివృద్దిని చూసి ఓర్వలేకే ప్రతిపక్ష పార్టీలు మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంపై రాజకీయాలు చేస్తున్నాయని మాజీ ఎంపిపి రమణాగౌడ్‌ అన్నారు. మంగళవారం తెరాస ఆధ్వర్యంలో రెంజల్‌ మండల కేంద్రంలో ప్రతిపక్షాల దిష్టిబొమ్మను ఊరేగింపు నిర్వహించి దగ్దం చేశారు. తెరాస పార్టీ ప్రజల పార్టీ అని ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే పార్టీ కాబట్టి అభివృద్దిని చూసి ఓర్వలేక కుట్రలు పన్నుతున్నాయన్నారు. కార్యక్రమంలో తెరాస నాయకులు ...

Read More »

భారీ వర్షంతో నీటమునిగిన పంటలు

  రెంజల్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పంటలు నీట మునిగాయి. రైతులు ఎకరానికి రూ. 20 వేలు ఖర్చుచేసి పంటలు వేయగా రాత్రి కురిసిన వర్షానికి పంటలు నీట మునగడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా తాసికుంట చెరువులో రూ. 28 లక్షలతో పనులు చేపట్టగా అందులో 10 ఎకరాలకు మాత్రమే ప్రయోజనం చేకూరగా, మిగతా 40 ఎకరాల సాగుభూమికి నష్టం వాటిల్లుతుందని ...

Read More »

భీమ్‌గల్‌లో ఏబివిపి బంద్‌ విజయవంతం

  భీమ్‌గల్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌లో ఏబివిపి తలపెట్టిన బంద్‌ మంగళవారం విజయవంతమైందని జక్కుల కార్తీక్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం ఇకనైనా కళ్లుతెరిచి విద్యార్థులకు కనీస వసతులు కల్పించి, వారి సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో అఖిల్‌, అజయ్‌బాబు, ప్రదీప్‌ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల అధికారులకు వినతి పత్రం సమర్పించారు.

Read More »

తెవివిలో ఇంగ్లీష్‌ టెక్ట్స్‌ బుక్‌ ఆవిష్కరణ

  డిచ్‌పల్లి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఇంగ్లీష్‌ విభాగం తెవివి పరిధిలోని వివిధ కళాశాలలలోని డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థుల కొరకు సిద్దం చేసిన ఇంగ్లీష్‌ ఫర్‌ అస్‌ అన్న పుస్తకాన్ని తెవివి వైస్‌ఛాన్స్‌లర్‌ ఆచార్య పి.సాంబయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునికయుగంలో ఇంగ్లీష్‌ అవసరమైన భాష అన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి మాట్లాడుతూ పుస్తకంలో ప్రాంతీయ దృష్టితో పాఠాలు ఉంచడం మంచి విషయమన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య ...

Read More »

తెలంగాణ ప్రభుత్వంలో అన్ని మతాలు, పండుగలకు గౌరవం

  – మంత్రి పోచారం నిజామాబాద్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని మతాల, కులాల పండగులకు ప్రాధాన్యతనిచ్చి అధికారికంగా జరుపుతూ గౌరవించుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ వద్ద టిఎన్‌జివోస్‌ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్‌, మేయర్‌, జడ్పి ఛైర్మన్‌, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి బోనమెత్తి నడిచారు. ఈ సందర్భంగా ప్రగతిభవన్‌ ...

Read More »

ఎట్టకేలకు ప్రవహిస్తున్న మొండివాగు, పెదవాగు

  మోర్తాడ్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత రెండు సంవత్సరాలుగా వర్షాలు కురియక మోర్తాడ్‌ మొండివాగు, గాండ్లపేట్‌వద్ద పెదవాగు ఎండిపోయి భూగర్భజలాలు అడుగంటి ఫిల్టర్‌ బెడ్లు సైతం ఎత్తిపోయాయి. గత నాలుగు సంవత్సరాలుగా పెదవాగు, మొండివాగు వర్షపు నీటితో ప్రవహించిన దాఖలాలు లేవు. గత నాలుగురోజుల క్రితం, సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు మోర్తాడ్‌ పోలీసు స్టేషన్‌ పక్కనేగల మొండివాగు, పెదవాగు వర్షపు నీటితో ప్రవహిస్తుంది. పెదవాగు ప్రవహించడంతో ఆయకట్టు ప్రాంత రైతులు తమ పంటలు గట్టెక్కుతాయని ...

Read More »

ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ భద్రత కల్పించాలి

  మోర్తాడ్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సమ్మె చేస్తున్న రెండవ ఏఎన్‌ఎంలకు ఉద్యోగ భద్రత కల్పించాలని మండల ఏఎన్‌ఎంల సంఘం అధ్యక్షురాలు వీణ అన్నారు. మంగళవారం 9వ రోజు మండల పరిషత్‌ కార్యాలయం ముందు బైఠాయించి దీక్షలు కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు.

Read More »

ప్రాజెక్టును అడ్డుకుంటే ప్రతిపక్షాలకు పుట్టగతులుండవు

  మోర్తాడ్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో సిఎం కెసిఆర్‌ కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు పలు ప్రాజెక్టులు నిర్మాణాలు చేపడుతున్నారని, అందులో భాగంగానే నాలుగు జిల్లాలలోని రైతుల 18 లక్షల ఎకరాల భూములకు సాగునీరందించేందుకు మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారని, ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆగవని తెరాస రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు వేముల సురేందర్‌ రెడ్డి, రాష్ట్ర విత్తనోత్పత్తి సంస్థ డైరెక్టర్‌ కొట్టాల చిన్నారెడ్డి, సామవెంకట్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ ...

Read More »

లిటిల్‌ హార్ట్స్‌

కావలసినవి మైదాపిండి: 200గ్రా., పాలపొడి: 50 గ్రా., పంచదారపొడి: 100గ్రా., కేక్‌ మార్జరిన్‌: 75గ్రా., అమూల్‌ వెన్న: 75 గ్రా., పాలు: 2 టేబుల్‌స్పూన్లు, వెనీలా ఎసెన్స్‌: టీస్పూను, జామ్‌: 100గ్రా., ఐసింగ్‌షుగర్‌: 50గ్రా.,   తయారుచేసే విధానం ఐసింగ్‌ షుగర్‌లో కొద్దిగా వెన్న వేసి బాగా గిలకొట్టి క్రీమ్‌లా చేసి పక్కన ఉంచాలి. మార్జరిన్‌లో వెన్న కలిపి బాగా గిలకొట్టి క్రీమ్‌లా చేయాలి. అందులోనే కొంచెం కొంచెంగా పంచదార పొడి, పాలపొడి వేసి బాగా గిలకొట్టాలి. పాలు, ఎసెన్స్‌ కూడా వేసి కలపాలి. ...

Read More »

ఒక హీరోను అభిమానిస్తే ఇంతలా ఉంటుందా.. అని ఆశ్యర్యపడాల్సిందే

అభిమానానికి హద్దులు లేవు  టూత్‌బ్రష్‌ నుంచి పళ్లేల వరకు అన్నింటిపైనా ఎంజీఆర్‌ చిత్రాలు  చెన్నై: తమిళ చిత్రరంగంలో రారాజుగా వెలుగొంది ముఖ్యమంత్రిగా రాష్ట్రప్రజలకు సేవలందించిన భారతరత్న ఎంజీఆర్‌ అభిమానులు అధికంగా ఉన్న ప్రాంతం మదురై. ఎంజీఆర్‌ అభిమానులను సంతోషపరచేందుకు ఇక్కడున్న థియేటర్లు నెలలో రెండు సార్లు ఆయన నటించిన చిత్రాలను ప్రదర్శిస్తున్నాయి. ఎంజీఆర్‌ పాతచిత్రాల కలెక్షన్ ఇప్పటి స్టార్‌హీరోల చిత్రాలకు ధీటుగా వసూలవుతున్నందువల్ల థియేటర్ల యజమానులు ప్రజాదరణ కలిగిన ‘పురుచ్చి తలైవర్‌’ చిత్రాలను ప్రదర్శించేందుకు పోటీపడుతున్నారు. ఎంజీఆర్‌ భౌతికంగా లేకపోయినా ఆయన అభిమానులు మాత్రం ...

Read More »

ఇంత చిన్నవయసులో ఎంత పెద్దమనసు తల్లీ నీది..

సామాజిక చైతన్యంపై ఓ విద్యార్థిని వినూత్నయత్నం బాలికకు మరుగుదొడ్డి నిర్మించి ఇచ్చి బర్త్‌ డే జరుపుకున్న వైనం చెన్నై : చెన్నైకి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని అక్షయ (13) తన పుట్టినరోజు వేడుకలను వినూత్నంగా జరుపుకుంది. తన గ్రామానికి దగ్గర్లో ఉన్న భువనగిరిలో ఓ బాలికకు చెందిన ఇంటిలో మరుగు దొడ్డి నిర్మించి ఇచ్చి, వారింటిలోనే తన జన్మదిన వేడుకలను జరుపుకుంది. ఇటీవల అక్షయ తిరుచ్చికి బస్సులో ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలో ఓ గ్రామంలో బాలికలు మరుగుదొడ్డి వసతి లేక ఇబ్బందులకు గురవుతుండటాన్ని గమనించింది. ...

Read More »

సేలంలో రెండు తలల కొండచిలువ.. ఇలా ఉండటం చాలా అరుదు

చెన్నై: సేలంలో రెండు తలలతో పట్టుబడిన కొండ చిలువను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. సేలం ఇరుంబాలై ఓలైపట్టికి చెందిన న్యాయవాది రంగనాథన్ తన ఇంటి పెరటితోటలో ఆదివారం మొక్కలకు నీరు పోస్తున్నప్పుడు రెండు తలల కొండచిలువ పిల్ల కనిపించింది. వెంటనే అక్కడున్న యువకుల సహాయంతో దానికి పట్టి డబ్బాలో బందించి సేలం హస్తంపట్టి అటవీ శాఖ కార్యాలయంలో అప్పగించారు. పామును స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ అధికారి మాట్లాడుతూ, ఇది కొండ చిలువ రకానికి చెందిందని, సాధారణంగా కొండ చిలువకు 2 తలలు వుండవని, ...

Read More »

నేపాల్‌ పరిణామాలు

అవిశ్వాస తీర్మానంలో ఓటమి ఎలాగూ తప్పదు కనుక నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి ముందుగానే రాజీనామా చేసి తప్పుకున్నారు. ఆయనను అధికారంలోకి తీసుకువచ్చిన పక్షాలు సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలగడంతో ఈ రాజకీయ సంక్షోభం తలెత్తింది. అడుగంటిన భారత్-నేపాల్‌ సంబంధాలను ఈ ఎనిమిది నెలల కాలంలో తాను ఉచ్ఛస్థితికి తీసుకువచ్చానని చెప్పుకుంటూనే, తన పదవిపోవడం వెనుక భారత్ కుట్ర బలంగా పనిచే సిందని పరోక్ష విమర్శలు అనేకం చేశారు ఓలి. ఆయన స్థానంలో మావోయిస్టు సెంటర్‌ అధినేత ప్రచండ ప్రధాని అయ్యే అవకాశాలు ...

Read More »

అమ్మాయిని గట్టిగా హత్తుకున్నాడు… దండం పెట్టి వదలమని చెప్పినా…

`విజయనగరం జిల్లా మోదవలస రెసిడెన్షియల్ బైబిల్ యూనివర్శిటీ జాయింట్ డైరెక్టర్ ప్రసన్నబాబు పైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఆయన వర్సిటీలోని తమ పిల్లలను లైంగిక వేధింపులకు గురిచేస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అతను ఓ అమ్మాయిని మీ తండ్రి పిలుస్తున్నాడని చెప్పి తన పర్సనల్ గదికి తీసుకు వెళ్లి, గట్టిగా హత్తుకున్నాడని, ఆమె వదలమని దండం పెట్టి బతిమాలిందని చెబుతున్నారు. ఇరవై మందికి పైగా అతని బాధితులు ఉన్నారని అంటున్నారు. పది మందికి పైగా బాలికలపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారని ఎస్పీకి ...

Read More »