Breaking News

Daily Archives: July 27, 2016

కత్తితో దాడిచేసిన నిందితుల అరెస్టు

  కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ఈనెల 23న ఓ వ్యక్తిపై కత్తితోదాడిచేసి గాయపరిచిన ఘటనలో నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు కామారెడ్డి సిఐ శ్రీనివాసు రావు తెలిపారు. బుధవారం కామారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పట్టణంలోని బతుకమ్మ కుంటకు చెందిన హసన్‌ చాహుస్‌, బదర్‌ అలీ అనే ఇద్దరు వ్యక్తులు అదే ప్రాంతానికి చెందిన షేక్‌ అలీ అనే వ్యక్తి వద్ద నుంచి రూ. 5 ...

Read More »

నిజాంసాగర్‌లో పంచాయతీ రాజ్‌ అతిథిగృహం

  నిజాంసాగర్‌ రూరల్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో నూతనంగా పంచాయతీరాజ్‌ అతిథి గృహ నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు. స్థానిక ప్రజాప్రతినిధుల చొరవతో మండల కేంద్రంలోని సరికొత్త అతిథి గృహ నిర్మాణానికి కోటి రూపాయల ప్రతిపాదనలు అధికారులు సిద్దం చేశారు. దీనికి సంబంధించిన టెండర్లు కూడా పూర్తయినట్టు పంచాయతీరాజ్‌ ఇఇ కిరణ్‌కుమార్‌ పేర్కొన్నారు. మూడునెలల్లో అతిథి గృహం నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. నిర్మాణం కోసం మండలంలోని పాత బస్టాండ్‌ ప్రాంతంలో స్థలాన్ని ఎంపిక చేశారు. ...

Read More »

సమస్యలు పరిష్కరించండి

  నిజాంసాగర్‌ రూరల్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యర్తల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిస్కరించాలని కోరుతూ నిజాంసాగర్‌, పిట్లం మండలాల రెండవ ఆరోగ్య కార్యకర్తలు బుధవారం భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా సంఘం అద్యక్ష, ఉపాధ్యక్షురాలు స్వాతి, పుష్ప మాట్లాడారు. రెండవ ఏఎన్‌ఎంలను క్రమబద్దీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. 10వ పిఆర్‌సి ప్రకారం కనీస వేతనం 21 వేల 300 రూపాయలను మంజూరు చేయించాలని డిమాండ్‌ చేశారు. డిఎ, హెచ్‌ఆర్‌, ఆరోగ్య బీమా వర్తించేలా ప్రభుత్వం అన్ని రకాల ...

Read More »

ఆదమరిస్తే అంతే…

  నిజాంసాగర్‌ రూరల్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హసన్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పిచ్చిర్యాగడి తాండాలో చేతికి అందే ఎత్తులో విద్యుత్‌ తీగలు ఉండడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని తాండా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. తాండాలోని అంగన్‌వాడి కేంద్రం సమీపంలో ఎలాంటి భద్రత లేకుండా ట్రాన్స్‌ ఫార్మర్‌ ఉండడంతో కేంద్రానికి వచ్చే పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని తాండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read More »

అరెస్టులు అప్రజాస్వామ్యం…

  నందిపేట, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్‌ నాయకులపై కక్షగట్టి అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బండి నర్సాగౌడ్‌ ఆరోపించారు. మల్లన్నసాగర్‌ వలన నిర్వాసితులవుతున్న ముంపు గ్రామాల ప్రజలకు పోలీసులు లాఠీచార్జి చేయడం అన్యాయమని, దాన్ని ఖండిస్తూ అక్కడి రైతులను పరామర్శించడానికి, మల్లన్నసాగర్‌ను పరిశీలించడానికి వెళుతున్న కాంగ్రెస్‌ నాయకులను అరెస్టు చేయడం నియంత పాలనకు నిదర్శనమని ఆయన అన్నారు. రైతులకు న్యాయం జరగకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు తగిన ...

Read More »

ఎట్టకేలకు రోడ్డు మరమ్మతు

  నందిపేట, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద గల మెయిన్‌ రోడ్డు గత నెలరోజులుగా కురుస్తున్న వర్షాలకు చిత్తడిగా మారడంతో రోడ్డుగుండా ప్రజలు నడవలేని స్థితిలో సర్కస్‌ ఫీట్లు చేయాల్సి వస్తుందని ప్రజలు అంటున్నారు. దీనిపై వారంరోజులుగా మీడియాలో కథనాలు రావడంతో స్పందించిన రోడ్డు భవనాల శాఖ అధికారులు సిమెంటు కంకరతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. మళ్లీ వర్షాలు కురిస్తే చెడిపోయే ప్రమాదముంది కాబట్టి త్వరలోనే పూర్తిస్థాయి రోడ్డు వేయాలని మండల ...

Read More »

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ప్రథమ వర్ధంతి

  నందిపేట, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఫౌండేషన్‌ ఆద్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ ఏపిజె అబ్దుల్‌ కలాం ప్రథమ వర్ధంతిని పాఠశాల విద్యార్థులతో కలిసి జరిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ అధ్యక్షుడు లింగం, కార్యదర్శి రఫీక్‌, ఎంపిటిసి బాలగంగాధర్‌, దారం సురేశ్‌, మహేందర్‌ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read More »

మూర్చవ్యాధితో వ్యక్తి మృతి

  బాసర, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోజువారి కూలీగా పనిచేసే ఓవ్యక్తి బుధవారం ఫిట్స్‌ రావడంతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే… సంగారెడ్డిజిల్లా రజినీనగర్‌కు చెందిన రాజేందర్‌ గత నాలుగైదురోజుల క్రితం కూలీపని నిమిత్తం బాసరకు వచ్చాడు. కాగా బుధవారం బాసర నుంచి గోదావరి వెళ్లే దారిలో ఫిట్స్‌ వచ్చి పడిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ట్రెయినీ ఎస్‌ఐ ఆర్‌.రమేశ్‌ సంఘటన స్థలానికి చేరుకున్నాడు. మృతుని వద్దగల ఫోన్‌బుక్‌ ఆధారంగా కుమారుడు ప్రవీణ్‌కుమార్‌కు, బంధువులకు సమాచారం ...

Read More »

మొక్కలు నాటే కార్యక్రమాన్ని యజ్ఞం లాగా భావించాలి

  – మంత్రి పోచారం నిజామాబాద్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం కార్యక్రమాన్ని ఒక యజ్ఞం లాగా భావించి అంకితభావంతో మొక్కల్ని నాటి పర్యావరణ సమతుల్యానికి ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని పద్మశాలీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త, మేయర్‌ ఆకుల సుజాత, ఎమ్మెల్సీ విజి.గౌడ్‌తో కలిసి మొక్కలు ...

Read More »

ప్రత్యేక కేటగిరి డిగ్రీ విద్యార్థుల దృవపత్రాల పరిశీలన

  డిచ్‌పల్లి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలల్లోని తుది దశలో ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకున్న ప్రత్యేక కేటగిరి అభ్యర్థులు ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌, స్పోర్ట్స్‌, వికలాంగులు, ఇతర బోర్డుల నుంచి ఇంటర్‌, 10+2 అభ్యర్థులు ఈనెల 28,29 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలని తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన యూనివర్సిటీలోని కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ...

Read More »

సమీక్షా సమావేశాలు నిర్వహించిన మంత్రి, ఎమ్మెల్యే

  నందిపేట, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని ఆంధ్రానగర్‌ గ్రామంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆశన్నగారిజీవన్‌రెడ్డి కలిసి పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి పాఠశాలలో జరిగిన గ్రామ సభలో పాల్గొన్నారు. అధికారులతో ఆయా శాఖల వారిగా గణాంకాలతో నివేదిక అడిగి తెలుసుకున్నారు. ప్రతి శాఖకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖలపై అవగాహన ఉన్న మంత్రి ప్రతి శాఖ గణాంకాలను క్షుణ్ణంగా విన్నారు. శ్రద్దగా పనిచేస్తున్న అధికారులను అభినందించడం, వివరాలు ...

Read More »

విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించినప్పుడే సత్ఫలితాలు

  – జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా రెంజల్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినపుడే సత్పలితాలు వస్తాయని, అందుకుగాను ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా కృషి చేయాలని జిల్లా పాలనాధికారి డాక్టర్‌ యోగితా రాణా అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాందీ పాఠశాలలో కొనసాగుతున్న వందేమాతరం ఫౌండేషన్‌ శిక్షణను ఆమె పరిశీలించారు. శిక్షణ పొందుతున్న విద్యార్థినిల గదిలోకి వెళ్లి ఆరాతీశారు. గణాంక మూల్యాంకనంపై విద్యార్థులు నేర్చుకున్న విషయాలను కలెక్టర్‌కు చెప్పారు. అందరి ...

Read More »

సాటాపూర్‌లో 915 మందికి వైద్య పరీక్షలు

  రెంజల్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో ఉర్దూ మీడియం పాఠశాలలో ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య శిబిరాన్ని ఎంపిపి మోబిన్‌ఖాన్‌, సర్పంచ్‌ జావెద్‌ ప్రారంభించారు. క్యాన్సర్‌, ఆర్ధోపెడిక్‌, పిల్లలు తదితర వ్యాధులతో బాధపడుతున్న 915 మంది రోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో వ్యాధిగ్రస్తులైన నలుగురిలో ముగ్గురిని నిజామాబాద్‌ నగరానికి, ఒకరిని హైదరాబాద్‌ రిఫర్‌ చేసినట్లు జిల్లా కో ఆర్డినేటర్‌ సంతోష్‌ తెలిపారు. కార్యక్రమంలో వైద్య నిపుణులు నాగార్జున, ప్రవీణ్‌ కుమార్‌, రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

జీతాలు చెల్లించని కంపెనీలు కోర్టుకు – యూఏఈ డిక్రీ

జీతాలు చెల్లించని కంపెనీలను కోర్టుకు ఈడ్చే దిశగా చర్యలు తీసుకోబడ్తాయని మినిస్ట్రీ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ అండ్‌ ఎమిరటైజేషన్‌ మంగళవారం వెల్లడించింది. మంగళవారం ఈ మేరకు ఓ డిక్రీని కూడా విడుదల చేసింది. 100 మందికి పైగా కార్మికులున్న ఏ సంస్థ అయినా ప్రతిపాదిత తేదీని దాటి 10 రోజుల్లోగా జీతాల చెల్లించకపోతే, ఆ సంస్థకు కొత్తగా వర్క్‌ పర్మిట్లు ఇచ్చే అవకాశం లేదని ఈ డిక్రీ చెబుతోంది. యూఏఈ మినిస్టర్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ అండ్‌ ఎమిరటైజేషన్‌ సక్ర్‌ ఘోబాష్‌ ఈ విషయాన్ని ...

Read More »

కొడుకును దుబాయ్ సాగనంపి వస్తుండగా ప్రమాదం: ఏపీ ఫ్యామిలీ మృతి

మహబూబ్‌నగర్: రంజాన్ పర్వదినం సందర్భంగా దుబాయ్ నుంచి కొడుకు ఇంటికి రావడంతో ఆ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిసాయి. రంజాన్ పండగ ముగిసిన క్రమంలో అతడ్ని శంషాబాద్ విమానాశ్రయంలో దిగబెట్టేందుకు కుటుంబమంతా తరలివచ్చింది. అతడ్ని సాగనంపి తిరుగురుపయనమైన ఆ కుటుంబం ఘోర ప్రమాదానికి గురైంది. ఎంతో సంతోషంతో వారు వెళుతున్న కారుకు ఓ లారీ అడ్డువచ్చింది. వేగంగా వెళుతున్న కారును అదుపుకాకపోవడంతో లారీని ఢీకొంది. దీంతో కారులోని వారంతా ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన మానవపాడు మండలం జల్లాపురంలో చోటు చేసుకుంది. అలంపూర్‌ సీఐ ...

Read More »

హిల్లరీ క్లింటన్ గెలవకపోతే అమెరికా నాశనం అవుతుంది…

ట్రంప్ గెలిస్తే అమెరికా నాశనం అవుతుందని, అదే హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తే అమెరికా దేశానికి అన్ని రకాలుగా చాలా బావుంటుందని డెమోక్రాట్ల తరపున హిల్లరీకి గట్టి పోటీ ఇచ్చిన బెర్నీ వ్యాఖ్యానించారు. ట్రంప్ వివాదస్పద వ్యాఖ్యల కంటే ఇప్పుడు బెర్నీ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. అమెరికా నాశనమవుతుందని ఆయన అనడంపై అంతా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడయితే ఆయన నోటి దూలతో ప్రమాదాలను కొనితెచ్చుకోవడమే అవుతుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఇకపోతే హిల్లరీ క్లింటన్‌ను బెర్నీ పొగడ్తలతో ముంచెత్తారు. ఆమె ఆలోచనా ...

Read More »

మాయదారి వాన!

: ఉదయం 9 గంటలు! ఉప్పల్‌లో బయలు దేరిన వాహనదారుడు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడానికి రెండున్నర గంటలు పట్టింది! సాయంత్రం 5 గంటలు. పెన్షన్‌ ఆఫీసు దగ్గర బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబరు 12లోకి తిరిగిన వాహనదారుడు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టుకు చేరుకోవడానికి రెండు గంటలు పట్టింది! .. వర్ష బీభత్సానికి మంగళవారం నగరంలో అస్తవ్యస్తమైన ట్రాఫిక్‌కు ఉదాహరణలివి. సరిగ్గా ఉదయం ఆఫీసులకు వెళ్లే సమయంలో, సాయంత్రం ఆఫీసుల నుంచి తిరిగి వచ్చే రద్దీ సమయాల్లో వరుణుడు దంచికొట్టాడు. ఉదయం 6-9 గంటల మధ్య భారీ ...

Read More »

తప్పుడు ఫోన్‌తో పోలీస్‌ కేసు..!

హైదరాబాద్‌ సిటీ: మ్యాన్‌హోల్‌లో ఓ వ్యక్తి పడిపో యాడని తప్పుడు సమాచారం అందించిన వ్యక్తిపై లంగర్‌హౌస్‌ పోలీస్‌స్టే షన్‌లో కేసు నమోదైందని వాటర్‌బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. రోహిత కుమార్‌ అనే వ్యక్తి లంగర్‌హౌస్‌ సమీపంలో మ్యాన్‌హోల్‌లో ఓ వ్యక్తి పడి పోయాడని వాటర్‌బోర్డు అధికారులకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అలాంటి ఘ టన జరిగినట్టు నిర్ధారణ కాకపోవడంతో ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ డివిజన్‌-3 మేనేజర్‌ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీ ...

Read More »

యువతులు ప్రేమను నిరాకరించారని..

 రైలుకు ఎదురెళ్లి ఇద్దరు యువకుల ఆత్మహత్యయత్నం   ఒకరు మృతి.. మరొకరికి తీవ్రగాయాలు  బర్కత్‌పుర: ప్రేమ విఫలమైందని తీవ్ర మనోవేదనకు గురైన ఇద్దరు యువకులు రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేశారు. అందులో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్‌ కోఠికి చెందిన ఎ.రాజ్‌కుమార్‌(20), చాధర్‌ఘాట్‌లో నివాసముంటున్న రవి(21) ఇబ్రహీంపట్నంలోని సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాలలో బిటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. కొద్ది కాలం క్రితం ఇద్దరికీ వేర్వేరు అమ్మాయిలతో స్నేహం ఏర్పడింది, దీన్ని ప్రేమ అనుకున్నారు. అదే విషయాన్ని యువతులకు చెప్పారు. కాని ...

Read More »

మింత్రా చేతికి జబాంగ్‌

డీల్‌ విలువ రూ.470 కోట్లు న్యూఢిల్లీ : ఫ్లిప్‌కార్ట్‌ యాజమాన్యంలోని మింత్రా ఇ కామర్స్‌లో తమ ప్రత్యర్థి జబాంగ్‌ను కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ ఏడు కోట్ల డాలర్లు (రూ.470 కోట్లు). ఇ కామర్స్‌ విభాగంలో తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకునే లక్ష్యంతో గ్లోబల్‌ ఫ్యాషన్‌ గ్రూప్‌ నుంచి జబాంగ్‌ను కొనుగోలు చేసినట్టు మింత్రా ప్రకటించింది. మొత్తం డీల్‌ విలువను నగదు రూపంలోనే చెల్లించనున్నట్టు తెలిపింది. ఈ కొనుగోలుతో మహిళల దుస్తులు, ఇతర విభాగాల్లో జబాంగ్‌ మార్కెట్‌ తమ చేతికి వస్తుందని ...

Read More »