Breaking News

Daily Archives: August 9, 2016

10వ రోజు అంత్య పుష్కరాల్లో భక్తులు

మోర్తాడ్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గోదావరి అంత్య పుష్కరాల్లో భాగంగా మంగళవారం 10వ రోజు భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. 10వ రోజు భక్తులు మండలంలోని తడపాకల్‌, దోంచంద, గుమ్మిర్యాల్‌ గ్రామాల్లో గల గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు.

Read More »

కళాశాలలో కొనసాగుతున్న క్రీడలు

మోర్తాడ్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌లోని ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలలో ఖోఖో, కబడ్డి, వాలీబాల్‌ క్రీడా పోటీలను విద్యార్థులకు నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోటీలు నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ పెద్దన్న తెలిపారు.

Read More »

విద్యార్థులకు ప్రశంసాపత్రాల అందజేత

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యామందిర్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యశాలలో పాల్గొన్న విద్యార్థులకు మంగళవారం ప్రశంసా పత్రాలు అందజేశారు. భారతప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖ, మంత్రాలయ, కురుక్షేత్ర, విద్యాభారతి సంస్కృతి శిక్షా సంస్థాన్‌ ఆద్వర్యంలో ఈనెల 8,9 తేదీల్లో విద్యార్థులకు కార్యశాల నిర్వహించారు. ఇందులో 520 మంది విద్యార్థులు పాల్గొని సంగీతం, భజన, శాస్త్రీయ, జానపద నృత్యాలు, చిత్రలేఖనం, క్విజ్‌, కోలాటం, వ్యాసరచన, చెక్క భజన, యోగ్‌చాప్‌ల్లో శిక్షణ పొందారు. మంగళవారం నిర్వహించిన ...

Read More »

జిల్లాలోనే ఆదర్శం…

మోర్తాడ్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ హరితహారంలో భాగంగా జిల్లా కలెక్టర్‌ మండలానికి నిర్దేశించిన లక్ష్యం మేరకు మండలంలో 7 లక్షల 40 వేల మొక్కలు నాటి జిల్లాలోనే మండలాన్ని ఆదర్శంగా నిలిపిన ఘనత సర్పంచ్‌లు, మండల అధికారులదేనని మండల ప్రత్యేకాధికారి శంకరయ్య అన్నారు. మంగళవారం మండలంలోని షెట్పల్లి గ్రామం వద్దగల ఎత్తిపోతల పథకం రిజర్వాయర్‌ పంప్‌హౌజ్‌ వద్ద ఎంపిడివో శ్రీనివాస్‌, ఇజిఎస్‌ అధికారి నర్సయ్యలు మొక్కలు నాటింపజేసి లక్ష్యాన్ని పూర్తిచేశారు. మండలంలోని ఆయా గ్రామాల్లో 40 వేల ...

Read More »

సబ్సిడీ ట్రాక్టర్‌ అందజేత

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం నుంచి సబ్సిడీ కింద విడుదలైన ట్రాక్టర్‌ను మంగళవారం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ లబ్దిదారులకు అందజేశారు. కామారెడ్డి మండలం ఇస్రోజివాడ గ్రామానికి చెందిన రవిందర్‌రెడ్డికి ప్రభుత్వం సబ్సిడీకింద జాన్‌ డీర్‌ ట్రాక్టర్‌ను మంజూరు చేసిందన్నారు. దీన్ని లబ్దిదారునికి అందజేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఐడిసిఎంఎస్‌ ఛైర్మన్‌ ముజీబుద్దీన్‌, నాయకులు ఆంజనేయులు, వెంకటేశ్వర్‌రెడ్డి, నిట్టు వేణుగోపాల్‌రావు, పద్మారెడ్డి, గోపీగౌడ్‌, బల్వంతరావు, మల్లేశ్‌ యాదవ్‌, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Read More »

సిసి రోడ్డు పనులు ప్రారంభం

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 13వ వార్డులో మంగళవారం సిసి రోడ్డు పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. లక్ష రూపాయల వ్యయంతో సిసి రోడ్డు నిర్మిస్తున్నట్టు తెలిపారు. పనుల్లో నాణ్యత లోపించకుండా నిర్మించాలని, వాటిని పర్యవేక్షించాలని అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ఎ.ఇ. గంగాధర్‌, కౌన్సిలర్‌ సావిత్రి, నాయకులు రవిగౌడ్‌, ధాత్రిక సత్యం, ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్‌ పంపిణీ

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో మంగళవారం ముఖ్యమంత్రి సహాయనిధి కింద విడుదలైన చెక్కును స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ బాధితునికి అందజేశారు. అన్నారపు శ్యాంరెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దరఖాస్తు చేసుకోగా విడుదలైన రూ. 67 వేల చెక్కును శ్యాంరెడ్డికి ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఐసిడిఎంఎస్‌ ఛైర్మన్‌ ముజీబుద్దీన్‌, నిట్టు వేణుగోపాల్‌రావు, గోపీగౌడ్‌, బల్వంతరావు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

మోకాళ్లపై ఏఎన్‌ఎంల నిరసన

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట మంగళవారం మోకాళ్లపై కూర్చొని ఏఎన్‌ఎంలు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖలో రెండవ ఏఎన్‌ఎంలుగా పనిచేస్తున్న తమను క్రమబద్దీకరించాలని డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని గత 23 రోజులుగా వివిద రూపాల్లో ఆందోళన చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం గర్హణీయమన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న ఏఎన్‌ఎంలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. వెంటనే ప్రభుత్వం తమ న్యాయమైన ...

Read More »

విద్యావ్యవస్థ సమూల ప్రక్షాళన అవసరం

  – వైస్‌ఛాన్స్‌లర్‌ సాంబయ్య డిచ్‌పల్లి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యావ్యవస్థలో సమూల ప్రక్షాళన అవసరమని తెలంగాణ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య స్పష్టం చేశారు. విద్యావ్యవస్థలో మరింత జవాబుదారి తనం అవసరమని ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా, నిజాయితీ, నిబద్దతతో కృషి చేసినపుడే ప్రభుత్వ విద్యాసంస్థలపై నమ్మకం పెరుగుతుందని ఆచార్య సాంబయ్య అన్నారు. మంగళవారం కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల బిఇడి కోర్సు సిలబస్‌పై సెమినార్‌ నిర్వహించారు. ఈ సెమినార్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య సాంబయ్య ...

Read More »

సభకు తరలిన నాయకులు

బాన్సువాడ, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మల్లన్నసాగర్‌ సాధన సమావేశానికి బాన్సువాడ నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ప్రాజెక్టు నిర్మాణానికి మెదక్‌ జిల్లాలో భూసేకరణ వివాదం నేపథ్యంలో ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరే నెపంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మల్లన్నసాగర్‌ సాధన సమావేశం నిర్వహిస్తుంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన సదస్సుకు బాన్సువాడ నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గానికి ...

Read More »

పనినే దైవంగా భావించాలి

  డిచ్‌పల్లి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగులు పనినే దైవంగా భావించి, నిబద్దత, అంకిత భావంతో పనిచేయాలని తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. మంగళవారం తెవివి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతో ప్రత్యేకంగా సమావేశమైన విసి మాట్లాడుతూ అలసత్వాన్ని, క్రమశిక్షణ రాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోను సహించేది లేదన్నారు. ఉద్యోగుల పనితీరు నిరంతరం గమనిస్తామని, వారు సంపూర్ణమైన అంకితభావంతో పనిచేయాలని, రాజకీయాలకు దూరంగా ఉండాలని పిలపునిచ్చారు. ఉద్యోగులు గొప్ప పనితీరును ప్రదర్శించినపుడే, వారి ప్రతిభను గుర్తిస్తామని ...

Read More »

దోస్త్‌లో రిజిస్టర్‌ అయిన సీటు రాని విద్యార్థులకు మరో అవకాశం

– రిజిస్ట్రార్‌ ఆచార్య జయప్రకాశ్‌రావు డిచ్‌పల్లి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్లలో భాగంగా దోస్త్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని సీటురాని అభ్యర్థులకు మరో అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని తెవివి రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వై.జయప్రకాశ్‌రావు తెలిపారు. దోస్త్‌లో రిజిస్టర్‌ అయి ఎక్కడా సీటురాని వారు ఆగష్టు 10,11 తేదీల్లో వెబ్‌ ఆప్షన్‌ ఇవ్వాలని ఆయన తెలిపారు. ఒకటి, రెండవ, మూడవ దశలలో సీట్‌ వచ్చి, కాలేజీల్లో జాయిన్‌ అయినవారు వెబ్‌ ఆప్షన్‌ ఇచ్చే వీలు లేదని రిజిస్ట్రార్‌ ...

Read More »

స్మోకీ చికెన్‌

కావల్సినవి: ఆలివ్‌నూనె – రెండు టేబుల్‌స్పూన్లు,   చికెన్‌ ముక్కలు – నాలుగు, ఉల్లిపాయ – ఒకటి, వెల్లుల్లి రెబ్బలు – రెండు, మైదా – టేబుల్‌స్పూను, కారం – రెండు చెంచాలు, చికెన్‌ ఉడికించిన నీరు – కప్పు, టొమాటో పేస్టు – అరకప్పు, క్రీం చీజ్‌ స్ప్రెడ్‌ – అరకప్పు (ఇది బజార్లో దొరుకుతుంది), ఉప్పు, మిరియాలపొడి – రుచికి సరిపడా, ఉల్లికాడల తరుగు – పావుకప్పు.   తయారీ: బాణలిలో సగం నూనె వేడిచేసి చికెన్‌ని వేయించి, ఐదునిమిషాల తరవాత ...

Read More »