Breaking News

ఉన్నత విద్యపై జాతీయ సెమినార్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్నల్‌ క్వాలిటి అసెస్‌మెంట్‌ విభాగం, నాక్‌ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో క్వాలిటి ఎడ్యుకేషన్‌, ఎమర్జింగ్‌ ట్రెండ్స్‌, ఛాలెంజెస్‌ ఫర్‌ 21 సెంచరీ అనే అంశంపై జరిగే జాతీయ సెమినార్‌ ఆగష్టు 18న ప్రారంభమవుతుందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ముఖ్య అతిథిగా వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య హాజరవుతారని, కీ నోట్‌ స్పీకర్‌గా కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. గెస్ట్‌ ఆఫ్‌ హానర్‌గా రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌రావు, ప్రత్యేక అతిథులుగా ఆచార్య కనకయ్య, సత్యనారాయణచారి, డాక్టర్‌ జెట్లింగ్‌ ఎల్లోసాలు పాల్గొంటారన్నారు. ఐక్యూఏసి డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.అరుణ తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 170 పేపర్లు వచ్చాయని, దేశ వ్యాప్తంగా 200 మంది డెలిగేట్లు ఈ సెమినార్‌లో పాల్గొంటారని తెలిపారు. కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం సెమినార్‌ హాల్‌లో ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ఇందుకు సంబంధించిన సావనీర్‌ విడుదల చేశారు.

Check Also

అర్హత పరీక్ష గడువు పెంపు

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఎలాంటి విద్యార్హత ...

Comment on the article