Breaking News

తెవివిలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు

డిచ్‌పల్లి, ఆగష్టు 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించడం జరుగుతుంది, ఇందులో భాగంగానే శుక్రవారం మధ్యాహ్నం వ్యాసరచన, వక్తృత్వ విభాగాల్లోపోటీలు నిర్వహించినట్టు తెలుగు అధ్యయన విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బాలశ్రీనివాసమూర్తి తెలిపారు. బంగారు భారతదేశం అనే శీర్షికతో వ్యాసరచన పోటీకి, నా కలల్లో భారతదేశం అనే శీర్సికతో వక్తృత్వ పోటీ నిర్వహించామని తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. నిర్వాహకులుగా డాక్టర్‌ లక్ష్మణచక్రవర్తి, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ప్రవీణాబాయి, డాక్టర్‌ జాన్సన్‌ ఉన్నారు.

Check Also

మండల‌ జర్నలిస్టుల‌ కార్యవర్గం ఎన్నిక

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయంలో జర్నలిస్టుల‌ సమావేశం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *