Breaking News

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తేవాలి

డిచ్‌పల్లి, ఆగష్టు 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతదేశంలో నేడు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి శాస్త్ర, సాంకేతిక రంగాలతోపాటు విద్యా, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ టి.మృణాళిని, ప్రొఫెసర్‌ వాణి, లాతూర్‌కర్‌ – నాందేడ్‌ అన్నారు. ‘నాణ్యమైన విద్య – 21వ శతాబ్దంలో మనం ఎదుర్కొంటున్న సవాళ్ళు’ అనే అంశంపై తెవివిలో జరిగిన రెండ్రోజుల జాతీయ సెమినార్‌ శుక్రవారం వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నత విద్యలో పెను మార్పులు తీసుకురావడానికి యుజిసి, రూసా, న్యాక్‌ వంటి జాతీయ సంస్థలు అందిస్తున్న ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకొని విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన పరిశోధన ఫలితాలు వెలువడాలని ఆకాంక్షించారు. నేటి సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి 21వ శతాబ్దంలో విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి పరిశోధనలు జరగాలన్నారు. ఉన్నత విద్యలో విద్యా విధానాన్ని అనుసంధానం చేస్తూ విజ్ఞానాన్ని అందరు అందిపుచ్చుకొనే విధంగా మార్పులు తేవాలన్నారు. నాణ్యమైన విద్యనందిస్తూ విద్యార్థులకు స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించే విధంగా పాఠ్యాంశాలుండాలన్నారు. ముగింపు సమావేశంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. వక్తలను జ్ఞాపిక, శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆచార్య సత్యనారాయణచారి, డాక్టర్‌ జాన్సన్‌, ఆచార్య నసీం, ఆచార్య ఎం.యాదగిరి, టూటా అధ్యక్షుడు డాక్టర్‌ ప్రవీణ్‌ మామిడాల, డాక్టర్‌ అత్తర్‌ సుల్తానా, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన కల్పించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో ఇచ్చిన టార్గెట్‌ పూర్తి కావాలని, పెట్టిన ప్రతి ...

Comment on the article