Breaking News

తెయులో ఉత్సాహభరితంగా ఫ్రీడం రన్‌

 

డిచ్‌పల్లి, ఆగష్టు 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీడం రన్‌ క్యాంపస్‌ నుంచి డిచ్‌పల్లి 7వ స్పెషల్‌ పోలీసు బెటాలియన్‌ వరకు ఉత్సాహభరితంగా సాగింది. ఉదయం 10.30 గంటలకు మొదలైన ఫ్రీడంరన్‌లో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌రావు ముందుండి మొత్తం 2.5 కి.మీ.లు పరుగెత్తారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ రన్‌లో పాల్గొని దేశభక్తిని ఎలుగెత్తి చాటారు.

బెటాలియన్‌ కమాండెంట్‌ వై.శ్రీనివాస్‌రావు, అసిస్టెంట్‌ కమాండెంట్‌ వెంకటరాములు, ఇతర సీనియర్‌ అధికారులు సిబ్బందితో కలిసి ఫ్రీడంరన్‌ను ఆహ్వానించారు. దారి పొడుగునా త్రివర్ణ పతాకాలు చేబూని విద్యార్థులు దేశభక్తి నినాదాలుచేస్తూ హోరెత్తించారు. యుజిసి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ఫ్రీడంరన్‌లో విద్యార్థులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి స్ఫూర్తిని చాటారని రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌రావు తెలిపారు. దేశం కోసం, ప్రజల రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూ, ప్రాణత్యాగానికి సైతం వెనకాడని స్పెషల్‌ పోలీసు బెటాలియన్‌ సిబ్బందితో కలిసి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. బెటాలియన్‌ కమాండెంట్‌ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ దేశభక్తి స్ఫూర్తిని నింపే కార్యక్రమం చేపట్టడం, అందులో బెటాలియన్‌ సిబ్బందితో కలిసి జరుపుకోవడం గర్వకారణమన్నారు.

తనకు ఇండియన్‌ పోలీసు మెడల్‌ రావడంలో తనకు అన్ని స్థాయిల్లో సిబ్బంది అందించిన సహకారం ప్రధాన కారణమన్నారు. ఈ మెడల్‌ వారికే అంకితం చేస్తున్నానని తెలిపారు. తర్వాత బెటాలియన్‌ సిబ్బందికి వర్సిటీ మహిలా అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినిలు రాఖీలు కట్టి రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు తయారుచేసిన గ్రీటింగ్‌ కార్డులను బెటాలియన్‌ సిబ్బందికి రిజిస్ట్రార్‌తో కలిసి ప్రిన్సిపాళ్ళు కనకయ్య, సత్యనారాయణచారి, వైస్‌ ప్రిన్సిపాల్స్‌ డాక్టర్‌ జాన్సన్‌ దామెర, ప్రవీణాబాయి తదితరులు అందజేశారు. ఇండియన్‌ పోలీసు మెడల్‌కు ఎంపికైన కమాండెంట్‌ శ్రీనివాసరావును వర్సిటీ రిజిస్ట్రార్‌, స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.మమత, ఇతర అధ్యాపక బృందం శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున బెటాలియన్‌ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

మండల‌ జర్నలిస్టుల‌ కార్యవర్గం ఎన్నిక

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయంలో జర్నలిస్టుల‌ సమావేశం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *