Breaking News

Daily Archives: August 22, 2016

కేంద్ర ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌ల దిష్టిబొమ్మ దగ్దం

  కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గోరక్ష పేరుతో దళితులపై దేశంలో జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో కామారెడ్డిలో సోమవారం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల దిష్టిబొమ్మ దగ్దం చేశారు. ఈ సందర్బంగా సిపిఎం డివిజన్‌ కార్యదర్శి చంద్రశేఖర్‌, సిఐటియు కార్యదర్శి రాజలింగం, ఎస్‌ఎప్‌ఐ నాయకుడు అరుణ్‌ మాట్లాడుతూ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు గోరక్ష సంస్థ సృష్టించి ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, గోవా, తదితర ప్రాంతాల్లో ఆవును చంపుతున్నారనే అక్రమ ఆరోపణలతో దళితులు, మైనార్టీలపై విచక్షణా రహితంగా దాడులు చేస్తున్నారన్నారు. ...

Read More »

కామారెడ్డి జిల్లాగా ప్రకటించడం హర్షణీయం

  కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించడం పట్ల టిడిపి నాయకులు హర్షం వ్యక్తంచేశారు. కామారెడ్డిలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చీల ప్రభాకర్‌ మాట్లాడారు. కామారెడ్డిని జిల్లాగాచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కామారెడ్డిలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, మూడు జిల్లాల కూడలిగా ఉండడంతోపాటు రైల్వేలైన్‌, జాతీయ రహదారి, గంజ్‌ మార్కెట్‌ సౌకర్యాలు కలిగి ఉన్నాయన్నారు. అలాంటి కామారెడ్డిని జిల్లాగా ప్రకటించినందుకు సిఎం కెసిఆర్‌కు ...

Read More »

పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి

  కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని పేర్కొంటూ కామారెడ్డి రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవో నగేశ్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రిటైర్డ్‌ ఉద్యోగులు మాట్లాడుతూ 70 సంవత్సరాలుగా నిండిన పెన్షనర్లకు 15 శాతం అదనపు పెన్షన్‌ మంజూరు చేయాలని, జనవరి 2016 నుంచి రావాల్సిన డిఎ మంజూరు చేయాలని, పిఆర్‌సి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఆరోగ్య ...

Read More »

నిజాయితీ చాటుకున్న ఆర్టీసి కండక్టర్‌, డ్రైవర్‌

  – ఏడు తులాల బంగారు ఆభరణాలు అందజేత కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాయితీ, నిబద్దతకు కామారెడ్డి ఆర్టీసి కండక్టర్‌, డ్రైవర్‌ మారుపేరుగా నిలిచారు. వృత్తిపై తమకున్న అంకితభావాన్ని చాటుకున్నారు. ప్రయాణీకులు పోగొట్టుకున్న బంగారాన్ని తిరిగి ఇచ్చి ఆర్టీసి సిబ్బంది ప్రతిష్టను ఇనుమడింపజేశారు. ఈ సంఘటన సోమవారం కామారెడ్డి బస్‌ డిపో పరిధిలో చోటుచేసుకుంది. మెదక్‌కు చెందిన ఉదయ్‌అనే వ్యక్తి మెదక్‌ నుంచి నిజామాబాద్‌ వైపు ప్రయాణిస్తూ రామాయంపేట వద్ద జూబ్లీ బస్టాండ్‌ నుంచి కామారెడ్డి వైపు ...

Read More »

నూతన జిల్లాలతో సర్వతోముఖాభివృద్ది

  – మంత్రి పోచారం కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న నూతన జిల్లాల ద్వారా పాలనా పరమైన సౌలబ్యంతోపాటు అన్ని జిల్లాల్లో సర్వతోముఖాభివృద్ది జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లాగా చేస్తున్న నేపథ్యంలో కామారెడ్డిలో సోమవారం తెరాస ఆధ్వర్యంలో భారీ సంబరాలు జరిపారు. మంత్రి సంబరాల్లో పాల్గొని ర్యాలీలో ప్రజల నుద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో ప్రస్తుతం పదిజిల్లాలుండగా పరిపాలనా సౌలబ్యం, ఆయా ప్రాంతాల అభివృద్ది కోసం ముఖ్యమంత్రి కెసిఆర్‌ ...

Read More »

24న డిజిటల్‌ ఇండియాపై అవగాహన సదస్సు

  డిచ్‌పల్లి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని 20 డిగ్రీ కళాశాలల్లోని 20 ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు, 250 మంది విద్యార్థులతో ఆగష్టు 24న తెయులో డిజిటల్‌ ఇండియాపై అవగాహన వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నట్టు తెవివి ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ సి.హెచ్‌.ఆర్తి తెలిపారు. ఆగష్టు 24న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. రాష్ట్ర ఈ గవర్నెర్స్‌ మిషన్‌ టీం నుంచి రిసోర్సు పర్సన్లు వస్తాయని ఆమె అన్నారు. అవగాహన ...

Read More »

జీవశాస్త్రంలో ఆధునిక పరిశోధనలు జరగాలి

  డిచ్‌పల్లి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచంలో పెరుగుతున్న జనాభాకు కనీస మౌలిక వసతులు సమకూర్చటానికి జీవశాస్త్రంలో ఆధునిక నాణ్యమైన పరిశోధనలు జరగాల్సిన ఆవశ్యకత ఉందని సిసిఎంబి మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ సి.హెచ్‌.మోహన్‌రావు సూచించారు. సోమవారం తెవివిలోని వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘మైక్రోబియల్‌ బయోడైవర్సిటీ’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ముఖ్యవక్తగా విచ్చేసిన మోహన్‌రావు మాట్లాడుతూ నేటి సమాజానికి కంప్యూటర్‌ అత్యాధునిక వస్తువుగా మారిందన్నారు. దీంతో అభివృద్ది చెందిన అమెరికా వంటి దేశాల్లో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ...

Read More »

బస్‌షెల్టర్‌లేక ప్రయాణీకుల ఇక్కట్లు

  నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పట్టణంలోని పోలీసు స్టేషన్‌ ప్రాంతంలో బస్‌షెల్టర్‌ నిర్మాణం చేపట్టాలని స్థానికులు ఎన్నో ఏళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నా పలితం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. బాన్సువాడ, నిజామాబాద్‌వైపు వెళ్లే ప్రయాణీకులు బస్టాండ్‌ కంటే పోలీసు స్టేషన్‌ వద్ద ఉన్న స్టాపు నుంచి వందలాది మంది బస్సుల కోసం నిరీక్షిస్తుంటారు. ఇక్కడ బస్‌షెల్టర్‌ లేకపోవడంతో ఎండకు, వానకు తడుస్తూ ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ప్రజల ఇబ్బందుల్ని ...

Read More »

ఎండుతున్న పంటలు – ఆందోళనలో రైతులు

  బాన్సువాడ, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వారంరోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో పంటలు ఎండుతున్నాయి. కష్టాల నెదుర్కొని కోటి ఆశలతో ఖరీఫ్‌ పంట సాగుచేసిన రైతులు ఆదినుంచే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి వసతి లేక వర్షాధారంగా సాగు చేస్తున్న మెట్ట పంటలు ఎండుముఖం పట్టడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. బాన్సువాడ ప్రాంతంలో మెట్ట భూముల్లో సోయా, పెసర, మినుము, మొక్కజొన్న పంటలు సాగుచేశారు. తొలకరి వర్షాలకు ముందుగా వేసిన పంట ప్రస్తుతం కాపుదశలో ఉంది. ఈ పరిస్థితుల్లో తేమ ...

Read More »

మొక్కలకు కంచెల ఏర్పాటు

  నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాలిపూర్‌ ఉన్నత పాఠశాలలో మొక్కలకు కంచెలు ఏర్పాటు చేశారు. పాఠశాలలో విధులు నిర్వహించే ఉపాధ్యాయుడు నర్సింగ్‌రావుతోపాటు ఉపాధ్యాయ బృందం పాఠశాల ఆవరణలో కంచెలు ఏర్పాటు చేశారు. నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాలని, వాటి సంరక్షణ కోసం కంచె ఏర్పాటు చేయడం, వాటికి ప్రతిరోజు నీటిని అందించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు సాగాలన్నారు.

Read More »

సబ్‌ మార్కెట్‌ యార్డు నిర్మాణ పనుల పరిశీలన

  నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని నాబార్డు నిధులతో మంజూరైన 3 కోట్ల వ్యయంతో నిర్మించిన 5 వేల మెట్రిక్‌ టన్నుల గోదాము నిర్మాణ పనులను పిట్లం మార్కెట్‌ కమిటీ వైస్‌ఛైర్మన్‌ వెంకట్రాంరెడ్డి, సిడిసి ఛైర్మన్‌ దుర్గారెడ్డి పరిశీలించారు. పిట్లం మార్కెట్‌ కమిటీ పరిధిలోని నిజాంసాగర్‌ సబ్‌ మార్కెట్‌ యార్డు గోదాము పనులు పూర్తయితే సబ్‌ మార్కెట్‌ యార్డు ప్రారంభం అవుతుందని, తద్వారా నిజాంసాగర్‌ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులకు ఇబ్బందులు దూరమవుతాయని ...

Read More »

విద్యార్థులు అభద్రత భావాన్ని తొలగించుకోవాలి

  నందిపేట, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని జడ్పిహెచ్‌ఎస్‌ ఉర్దూమీడియంలో సోమవారం వేకువ ఫౌండేషన్‌ హైదరాబాద్‌ వారి ఆధ్వర్యంలో ప్రేరణ ప్రాజెక్టులో భాగంగా విద్యార్థుల కొరకు పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ అంశంపై మిర్జాకాలిబ్‌ బేగ్‌ ప్రసంగించి విద్యార్థులకు మెళకువలు నేర్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లో దాగివున్న నైపుణ్యాలను బయటికి తీయాలని, తమను తాము తక్కువగా అంచనా వేసుకోవద్దని, నేను చేయగలను అనే దృక్పథంతో ముందుకు వెళ్లాలని సూచించారు. భయాన్ని, అభద్రత బావాన్ని, సంకుచిత తత్వాన్ని విడనాడి, ...

Read More »

ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతులు చేయించాలి

  నందిపేట, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆద్వర్యంలో చెడిపోయిన ట్రాన్స్‌పార్మర్‌ను మరమ్మతు చేయించాలని కోరుతూ నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న తెలంగాణ టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్‌చార్జి రాజారాం యాదవ్‌ పాల్గొని మాట్లాడుతూ మండల కేంద్రంలోని 132/33 కె.వి. సబ్‌స్టేషన్‌లోని రెండు పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లను 50 ఎం.వి. చెడిపోయి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ మరమ్మతులు చేయించకపోవడం శోచనీయమని ధ్వజమెత్తారు. దీనివల్ల ఆర్మూర్‌, నవీపేట, మాక్లూర్‌ మండలాల్లోని 20 సబ్‌స్టేషన్లకు సరఫరాలో ...

Read More »

బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి ? బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేవాలా ?

బ్రహ్మ ముహూర్తం..!! ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ.. దీనికి సరైన అర్థం, పరమార్థం మాత్రం చాలామందికి తెలియదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున అని తెలుసు కానీ.. కరెక్ట్ సమయం మాత్రం చాలామందికి తెలియదు. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి ? బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలని, పూజ చేయాలని, పిల్లలు చదువుకోవాలని ఎందుకు సూచిస్తారు ? బ్రహ్మ ముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యత ? బ్రహ్మి ముహూర్తంలోనే ఎందుకు నిద్రలేవాలి ? ఇలాంటి అనుమానాలన్నింటికీ.. పరిష్కారం దొరికింది. తెలుసుకోవాలని ఉందా.. ...

Read More »

జిమ్నాస్ట్ దీపాపై కేసీఆర్ కనకవర్షం

హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో వాల్ట్ ఫైనల్‌కు చేరి భారతీయుల హృదయాలు కొల్లగొట్టిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వరాల జల్లు కురిపించారు. తృటిలో పతకం కోల్పోయినా జిమ్నాస్టిక్స్ విభాగంలో అర్హత పొందిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించిన దీపకు కేసీఆర్ రూ.50 లక్షల నజరానా ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేశానికి పతకాలు సాధించిపెట్టిన అమ్మాయిల ప్రతిభాపాటవాలను కొనియాడారు. రియోలో స్ఫూర్తిమంతమైన ప్రదర్శన కనబరిచారన్నారు. అమ్మాయిలను అన్ని రంగాల్లోనూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్ మహిళలు ఎందులోనూ తీసిపోరని వీరు ...

Read More »

బాలుడిపై అక్కాచెల్లెళ్ల అత్యాచారం.. శిక్ష విషయంలో వెనక్కి తగ్గిన కోర్టు.. జైలు వద్దని?

తోడబుట్టిన తమ్ముడని కూడా లేకుండా లైంగికంగా వేధించి అత్యాచారానికి పాల్పడిన అక్కాచెల్లెళ్ల పట్ల వోర్సెస్టర్ క్రౌన్ కోర్టు ఉదారత ప్రదర్శించింది. 14 ఏళ్ల పాటు ఓ బాలుడిపై అత్యాచారానికి పాల్పడిన అక్కాచెల్లెళ్లకు దోషిగా తేలినా.. దోషుల్ని బధిరులు కావడంతో జైలుకు పంపేందుకు బదులు పూర్తి ఒంటరిగా ఉంచాలంటూ తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం.. కింగ్‌టన్‌కు చెందిన జులీ ఫెలోస్(30), జెన్నిఫెర్(32) అక్కాచెల్లెళ్లు ఆరేళ్ల పిల్లాడిని లైంగికంగా వేధించారు. ఈ ఘోరం 14 ఏళ్లపాటు కొనసాగిందని 2000 సంవత్సరంలో ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. వారిద్దరూ ...

Read More »

మార్కెట్‌లో నాసిరకం విత్తనాలు

ప్రమాణాల మేరకు లేని మొలక శాతం.. అమ్మకాలను నిలిపేయాలని ఆదేశాలు హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రధాన పంటలకు సంబంధించి నాణ్యత లేని విత్తనాల అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డీలర్ల వద్ద వ్యవసాయశాఖ సేకరించిన విత్తనాల్లో పలు కంపెనీలకు చెందిన పత్తి, వరి, మొక్కజొన్న తదితర పంటల విత్తనాల మొలక శాతం ప్రమాణాల మేరకు లేవని తేలింది. దీంతో సదరు విత్తనాల అమ్మకం నిలిపేయాలంటూ వ్యవసాయశాఖ.. జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలూ జారీ చేసింది. పత్తి, వరి, మొక్కజొన్న తదితర విత్తనాల నమూనాలను ...

Read More »

మెగాస్టార్ 150వ సినిమా టైటిల్ ఇదే

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 150వ సినిమా శరవేగంగా తెరకెక్కుతోంది. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో కథానాయికగా చందమామ కాజల్ ఫైనల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఎప్పటినుంచో చిరంజీవి 150వ సినిమాకు రకరకాల టైటిల్స్ ఊహాగానాలయ్యాయి. అయితే ఈ సినిమాకి నూటికి నూరు శాతం సరిపడే “ఖైదీ నెంబర్ 150’’ అనే ...

Read More »

ఆగస్టులో కలిసిరాని నైరుతి

రాష్ట్రవ్యాప్తంగా 5 శాతం తక్కువ వర్షాలు.. ఈ నెలలో పడింది కేవలం 5.9 సెంటీమీటర్లే 8 జిల్లాల్లో ‘సాధారణ‘మైనా కురవలేదు ఈ నెల 25 వరకూ పరిస్థితి ఇలాగే: వైకే రెడ్డి హైదరాబాద్‌ సిటీ: ఈ ఏడాది దేశమంతటా వర్షపాతం సంతృప్తికరంగా ఉంటుందన్న భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాల నేపథ్యంలో మోసులెత్తిన రాష్ట్ర రైతన్న ఆశలు నీరుగారే పరిస్థితి ఏర్పడింది. నైరుతి రుతుపవన సీజన్‌ మొత్తంమీద తెలంగాణలో 51.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. అయితే, ఈసారి మూడున్నర నెలల్లో 48.6 ...

Read More »

బ్రిక్స్‌ సదస్సులో ‘హరితహారం’ .. ప్రస్తావించిన ఎంపీ కవిత

హైదరాబాద్‌,:పింక్‌సిటీ జైపూర్‌లో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న బ్రిక్స్‌ దేశా ల మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొన్న టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రభు త్వ పథకాలను వివరించారు. రెండో రోజు కార్యక్రమంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంలో వస్తున్న మార్పులు, సభ్యదేశాలు తీసుకోవాల్సిన చర్యలపై జరిగిన చర్చలో కవిత పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ హరిత హారం’ పథకాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. హరితహారంలో భాగంగా ఐదేళ్లలో 230 కోట్ల మొక్కలను నాటే మహాయజ్ఞం కొనసాగుతోందని అన్నారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం రూ. ...

Read More »