24న డిజిటల్‌ ఇండియాపై అవగాహన సదస్సు

 

డిచ్‌పల్లి, ఆగష్టు 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని 20 డిగ్రీ కళాశాలల్లోని 20 ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు, 250 మంది విద్యార్థులతో ఆగష్టు 24న తెయులో డిజిటల్‌ ఇండియాపై అవగాహన వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నట్టు తెవివి ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ సి.హెచ్‌.ఆర్తి తెలిపారు. ఆగష్టు 24న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. రాష్ట్ర ఈ గవర్నెర్స్‌ మిషన్‌ టీం నుంచి రిసోర్సు పర్సన్లు వస్తాయని ఆమె అన్నారు. అవగాహన సదస్సు ద్వారా వర్సిటీ విద్యార్థులను ఎంగేజ్‌, ఎంపవర్‌, ఎడ్యుకేట్‌ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లను డిజిటల్‌ ఇండియా వలంటీర్లుగా తీర్చిదిద్దుతామని డాక్టర్‌ ఆర్తి తెలిపారు. కార్యక్రమంలో భాగంగా స్కిట్‌ పోటీలు, క్విజ్‌, డిజైనింగ్‌, ఐడియా జెనరేషన్‌ లాంటి పోటీలు నిర్వహిస్తారన్నారు. కార్యక్రమం కంప్యూటర్‌ సైన్స్‌ కళాశాలలో ఉంటుందన్నారు. కేంద్ర ఈ గవర్నెర్స్‌ డివిజన్‌, డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఐటి శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని డాక్టర్‌ ఆర్తి తెలిపారు.

Check Also

లాక్‌ డౌన్‌ ఎత్తేస్తే ఏమైతది…

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతామని తెలంగాణ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *