Breaking News

దేశం గర్వించే పౌరులు కావాలి

 

– తెవివి విసి సాంబయ్య

డిచ్‌పల్లి, ఆగష్టు 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంచుకున్న రంగంలో కష్టపడి, అంకిత భావంతో ఉన్నత శిఖరాలకు చేరుకుని దేశం గర్వించే పౌరులుగా ఎదగాలని తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పి.సాంబయ్య పిలుపునిచ్చారు. మంగళవారం తెయులో 70వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. కార్యక్రమంలో భాగంగా దాదాపు 500 మంది విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది సామూమిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. యుజిసి ఆదేశించిన విధంగా సరిగ్గా ఉదయం 11 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన తెయు కంప్యూటర్‌ సైన్స్‌ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ 120 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఒలింపిక్‌ పతకాలు కేవలం రెండు రావడం బాధాకరమన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో స్పోర్ట్స్‌ సౌకర్యాలు మెరుగవ్వాలని, విద్యార్థులు చిన్నతనంలోనే క్రీడల పట్ల ఆసక్తి చూపాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. విద్యార్థులు తరగతులు రెగ్యులర్‌గా జరగాలని డిమాండ్‌ చేయాలని, తరగతులు చెప్పని వారిని నిలదీయాలని విసి పిలుపునిచ్చారు.

వారంరోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించిన అధ్యాపకులకు, విద్యార్థులను అభినందించారు. రిజిస్ట్రార్‌ వై.జయప్రకాశ్‌రావు మాట్లాడుతూ తెయు యుజిసి నిర్దేశాలకనుగుణంగా కార్యక్రమాలు విజయవంతంగా చేపట్టి ప్రత్యేక ప్రశంసలు పొందిందన్నారు. ప్రీడంరన్‌, సామూహిక జాతీయ గీతాలాపన, సాంస్కృతిక, సాహిత్య పోటీలు గొప్పగా జరిగాయని అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రిన్సిపాల్లు ఆచార్య కనకయ్య, సత్యనారాయణచారి, జట్లింగ్‌ యెల్లోసా, తదితరులు ప్రసంగించారు. డాక్టర్‌ త్రివేణి, డాక్టర్‌ సంపత్‌కుమార్‌లు సమన్వయం చేశారు.

Check Also

ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన కల్పించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో ఇచ్చిన టార్గెట్‌ పూర్తి కావాలని, పెట్టిన ప్రతి ...